Take a fresh look at your lifestyle.

రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్న కేసీఆర్: ‌బండి సంజయ్‌‌

గూడూరు, మార్చి 5, (ప్రజాతంత్ర విలేకరి): రాష్ట్ర ప్రజలను కెసిఆర్‌ ‌నమ్మించి మోసంచేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం గూడూరు మండలంలోని మచ్చర్లలో రాష్ట్ర గిరిజన మోర్చాఅధ్యక్షులు హుస్సేన్‌ ‌నాయక్‌ ఇం‌టి వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి రాష్ట్రంలో బిజెపికి ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుందని సీఎం సర్వేలన్నీ బిజెపి గెలుపును సూచిస్తున్నాయని తండ్రి కొడుకుల బహురూపుల వేషాలు వేస్తున్నారని జిమ్మిక్కులు చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించడం కోసం సీఎం ఓట్లు అడిగారా, కనీసం పట్టభద్రులను ఓట్లు అడగలేదు అని అదే ఆయన అహంకారానికి నిదర్శనమని ఓటు అడగని పార్టీకి ఎందుకు ఓటు వేయాలని మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి టీచర్లను బెదిరిస్తున్నారని ఎన్నికల డ్యూటీ వేయకుండా వారిని అవమానించారని కొత్తగా లెటర్లు రాస్తున్నారని 2017లో రైల్వే వాగన్‌ ‌వర్క్షాప్‌ ‌వచ్చింది ఇప్పటిదాకా రాష్ట్రం ఎందుకు స్పందించలేదని ఈ మధ్య నేను కిషన్‌ ‌రెడ్డి వరంగల్లో టూర్‌ ‌పెడితే ఆగమేఘాలపై వివాదాస్పద భూమి ఇచ్చారు.

లేఖలతో ఆడుతున్న డ్రామలు ఆ లేఖలో మీకు చితీ గామారబోతున్నాయని, పోడు భూములు విషయంలో కెసిఆర్‌ ‌డ్రామా ఆడుతున్నారని పేద ప్రజల భూములు లాక్కొని హరితహారం చేయమని చెప్పేది గిరిజన ఎమ్మెల్యేలను రెచ్చ కొడుతున్నారని గిరిజనుల భూములు లాకు ఉంటున్నారని మేము వెళ్తే మా పై కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని రాష్ట్రంలోని వర్గాలు టిఆర్‌ఎస్‌ ‌కు వ్యతిరేకంగా ఉన్నాయని కార్పొరేట్‌ ‌సంస్థలు ఇచ్చే డబ్బులతో ఎమ్మెల్సీ ఎలక్షన్‌ ‌లో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎమ్మెల్సీలు పోటీ చేస్తున్నారని ఎమ్మెల్సీలు గెలవాలని విపరీతంగా డబ్బు ఖర్చు పెడుతున్నారని అందుకని ఈ ఈ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపిస్తే పి.ఆర్‌.‌సి నిరుద్యోగ భృతి ఉద్యోగాలు వస్తుంది వస్తుంది ఉద్యోగాలు వస్తాయి మీసమస్యలు తీరుతాయని ఆయన ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం వన్‌ ‌కాంట్రాక్టు ఉద్యోగులకు నిర్ధాక్షిణ్యంగా తొలగించారని, బిజెపి అభ్యర్థి ప్రేమేందర్రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలోఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డి రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు జాటోత్‌ ‌హుస్సేన్‌ ‌నాయక్‌, ‌జిల్లా అధ్యక్షులు రామచంద్ర రావు, బిజెపి ప్రధాన కార్యదర్శి, బంగారు శృతి ,యాప సీతయ్య, రాచకొండ కొమురయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి చెల్పూరి వెంకన్న ,చీకటి మహేష్‌, ‌మండల బిజెపి అధ్యక్షులు మెరుగు మల్లయ్య, సురేందర్‌, ‌బంద్‌ అలగడ్డ సర్పంచ్‌ ‌మాలోతు సునీత బావ్‌ ‌సి మండల బిజెపి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply