ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 66వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రగతి భవన్ కళకళలాడుతోంది. వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ప్రగతి భవన్లో కేసీఆర్‌ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, పలువురు మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వివిధ కమిషన్లు, అకాడల చైర్మన్లు, ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, వివిధ సంఘాల నాయకులు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు.
కేసీఆర్‌కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్రమంత్రులు, శాసనసభ స్పీకర్ పోచారం తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. వారికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.• ఏపీఐఐసీ ఛైర్మన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా కేసీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.కేసీఆర్ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వారు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటారు. పౌరసరఫరాలశాఖ కమిషనర్ సత్యనారాయణ రెడ్డికూడా మొక్కలునాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సీఎం పుట్టిన రోజువేడుకలను పండగలా నిర్వహిస్తున్నారని అన్నారు. పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో 66వేల మొక్కలు నాటామని పౌరసరఫరాలసంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.