- తెలంగాణ ప్రజలను మోసం చేసారు..
- లీగల్ గా పొరాడుతాం: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగిందే నీళ్లు-నిధులు-నియామకాల కోసమని 90శాతం పూర్తి అయిన ప్రాజెక్టులను కేసీఆర్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రిడిజైన్ తో ప్రజలకు అన్యాయం చేసిందని శాసనసభ పక్ష నేత భట్టి విక్రమార్క విమర్శించారు.మంగళవారం అసెంబ్లీ లోని మీడియా పాయింట్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ….ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నుంచి 3టీఎంసీల నీళ్లను లిఫ్ట్ చేస్తామని జివో విడుదల చేసిందని ఇరు రాష్ట్రాల సీఎంలు పోతిరెడ్డిపాడు అంశంలో మాట్లాడుకుని చేస్తున్నారా అనే అనుమానం ఉందన్నారు .తెలంగాణ రాష్ట్రం పోతిరెడ్డిపాడు సామర్థ్యం తగ్గిస్తే-ఏపీ ప్రభుత్వం పెంచుతూ వెళ్తోందని తెలంగాణ తగ్గించిన నెలరోజులకు ఏపీ పెంచినట్లు జివో విడుదల చేసిందని అన్నారు.
ఆనాడు పోతిరెడ్డిపాడు కోసం రక్తం మరీగిపోతుందన్న కేసీఆర్-ఇవ్వాళ సీఎం గా ఉన్నారు మరి ఎలా మరుగాలని ప్రశ్నించారు…? కేసీఆర్ తన ఆర్థికపరమైన లావాదేవీల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ చిత్తశుద్ధి పై మాకు అనుమానాలు ఉన్నాయని గతంలో శబరినది ఇలానే వదిలేశారు కాబట్టి మేము లిగల్ గా వెళతామని కేసీఆర్-జగన్ అన్నదమ్ములు అంటే ఇది వాళ్ళ ఇంటి వ్యవహారం కాదని -తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు అనేది మర్చిపోవద్దని తెలిపారు జగన్-కేసీఆర్ రోజు మాట్లాడుతున్నారని అంటున్నారు- ఇది సీఎం కేసీఆర్ కి తెలియకుండా జరిగిందా అని అనుమానం వ్యక్తం చేశారు.ఏపీ ప్రభుత్వం జివో విడుదల చేసేంత వరకు తెలంగాణ ఇంటలిజెన్స్ ఎమ్ చేస్తోందని నిలదీశారు. జగన్-కేసీఆర్ మాట్లాడుకొని చేయడం లేదనే గ్యారెంటీ ఏంటి అనేది చెప్పాలన్నారు.నదీజలాల పంపకాల విషయం అపెక్స్ కమిటీ-బోర్డ్ లో చర్చించకుండా జివో విడుదల చేసిందా?కేసీఆర్ కి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? లేదా పార్టీ కుటుంబం ముఖ్యమా?గతంలో సీఎం కేసీఆర్ శబరినది పై ఇలానే మాట్లాడి కోల్పోయామని అన్నారు.