మండువ రవిందర్ రావు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం పర్యటనతో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం దాదాపుగా ముగిసినట్లైంది. దీనికి ఒకరోజు ముందు అంటే శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బహిరంగ సభలో ప్రసంగించారు. జీహచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారాంతంలో ఈ పార్టీలకు చెందిన ఇద్దరు ప్రధాన నాయకుల ప్రసంగాలతో ప్రచార పర్వానికి తెరపడినట్లైంది. ఈ ఎన్నిక)ద్వారా తమ ఆధిపత్యాన్ని సాధించుకోవాలని భారతీయ జనతాపార్టీ విశ్వప్రయత్నం చేస్తోంది. అందుకే ఢిల్లీస్థాయి నాయకులను కూడా ఇక్కడి ప్రచారానికి ఆహ్వానించింది. ప్రచార చివరి అంకంలో ఆ పార్టీ ముఖ్యనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను రంగంలోకి దింపిందా పార్టీ. అమిత్‌షా రావడంతో భారతీయ జనతాపార్టీ శ్రేణుల్లో జోష్ నింపినట్లైంది. ఆయనరాక సందర్భంగా నగరమంతా కాషాయ మయంగా మారింది. అమిత్‌షా రోడ్ షో నిర్వహించిన ప్రాంతమంతా ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులతో నిండిపోయింది.

వివాదస్పదంగా మారిన పాతబస్తీలోని చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మీ ఆలయాన్ని ఆయన ముందుగా సందర్శించినప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ ప్రాంతమంతా కాషాయ సేనతో నిండిపోయింది. ఆ తర్వాత వారాసిగూడా నుంచి నామాలగుండు వరకు రోడ్‌షోలో పాల్గొన్నప్పుడు విశేష జనసందోహం, కాషాయజండాల రెపరెపలతో అక్కడి రోడ్లన్నీ నిండిపోయాయి. జనం కదలడం కష్టంకావడంతో అమిత్‌షా మధ్యలోనే ర్యాలీనుండి వెళ్ళిపోయాడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడినప్పుడు హైదరాబాద్‌పై తమ బాణాన్ని ఎక్కుబెట్టామని మరోసారి చెప్పకనే చెప్పారు. హైదరాబాద్‌లో వేళ్ళూనుకున్న నిజాం కల్చర్ నుండి ఈ ప్రాంతానికి విముక్తి కలిగించడమే తమ లక్ష్యంగా ఆయన చెప్పుకొచ్చారు. అందుకే వోట్లు, సీట్ల కోసం కాకుండా ఇక్కడి కల్చర్ మార్చేందుకే తమ పార్టీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి పోటీపడుతున్న విషయాన్ని ఆయన స్పష్టంచేశారు. ఇంటర్నేషనల్ ఐటి హబ్‌గా, మినీ ఇండియాగా హైదరాబాద్‌ను మార్చడమే తమ లక్ష్యమన్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుండి బిజెపి రాష్ట్ర, కేంద్రనాయకులనేకులు పర్యటించిన సందర్భంగా చేసిన ఆవేశ పూరిత ప్రసంగం ఈసారి అమిత్‌షాలో కనిపించలేదు. ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాము అధికారంలోకి వొస్తే పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్నలాంటి మాటలు గాని, జీహచ్ఎంసీ ఎన్నికలు అయిపోగానే రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వొస్తాయన్న సంచలనాత్మక మాటలేవీ ఆయన ప్రసంగంలో ఈసారి కనిపించలేదు. తాము గెలిస్తే హైదరాబాద్ పేరునే మార్చేస్తామన్న గుజరాత్ సిఎం యోగీ అదిత్యనాథ్ లాంటి మాటలను కూడా ఆయన మాట్లాడలేదు. గతంలో అనేకసార్లు హైదరాబాద్ వచ్చిన సందర్భంగా టిఆర్ఎస్ పైన, కెసిఆర్‌పైన చేసినంత ఘాటుగా అయన ఈసారి స్పందించకపోయినా ఎంఐఎంతో దోస్తానీపై ఆయన టిఆర్ఎస్పై సున్నితమైన విమర్శచేశారు. రాజకీయాల్లో ఏ పార్టీతోనైనా స్నేహ సంబంధాలు ఉండవొచ్చు కాని, రహస్య స్నేహమెందుకంటూ టిఆర్ఎస్కు చురక అంటించారు. ఆ పార్టీ అండతోనే రాజధానిలో అనేక అక్రమాలను నిర్వహిస్తోందని పరోక్షంగా అధికారపార్టీని దుయ్యబట్టిన అమిత్‌షా హైదరాబాద్ అభివృద్దికోసం తమకో అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తిచేశారు. వాస్తవంగా కెసిఆర్ పాలనాతీరే భవిష్యత్‌లో తమపార్టీ విజయానికి సోపానమవుతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యానం ఆలోచించతగిందిగా ఉంది.
ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచార ముగింపుకు ఒకరోజు ముందు కెసిఆర్ ప్రసంగం కూడా గతంలో ప్రజలను ఆకట్టుకున్న స్థాయిలో కనిపించలేదు. ఆయన బహిరంగ సభలో ఘాటైన పదజాల ప్రయోగం చేస్తారనుకున్నారు. అయితే ప్రతిపక్షాలు తనను విమర్శించిన స్థాయిలో తానూ మాట్లాడగలిగినా సామరస్యాన్ని పాటిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రాంతీయ ఎన్నికలకు వివిధ రాష్ట్రాలు, కేంద్రం నుండి బిజెపి బడా నాయకులు కట్టకట్టుకుని రావడాన్ని ఎత్తిచూపుతూ, తనలాంటి బక్కోడిని కొట్టేందుకు బిజెపి చేస్తున్న దాడిని ఎత్తిచూపారు. స్థానిక ఎన్నికల్లో స్థానిక సమస్యలపైన మాట్లాడకుండా జాతీయ స్థాయిలో జరుగుతున్న ఎన్నికల్లోలా మాట్లాడటాన్ని కెసిఆర్ తప్పుపట్టారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టి విడదీయాలని చూస్తున్న శక్తులపట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలను హెచ్చరించారు. గత ఆరేళ్ళలో తాము చేసిన అభివృద్ధి, చేయబోయే కార్యక్రమాలను ఏకరువు పెడుతూనే ఇతరులకు అధికారమిస్తే హైదరాబాద్ వినాశనాన్ని కోరుకున్నట్లే అవుతుంది. ఇప్పుడు పొరపాటు చేస్తే హైదరాబాద్ పురోగతినిలిచి పోతుంది. భూముల ధరలు పడిపోతాయి. వ్యాపారాలు బంద్ అవుతాయంటూ ఆయన వోటర్లను అప్రమత్తం చేసే ప్రయత్నంచేశారు. ఒక పక్క జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కెసిఆర్ ప్రభుత్వం ఉండదని బిజెపి ప్రచారం చేస్తుండగా, జాతీయ రాజకీయ ప్రక్షాళన దిశగా తాను అడుగులు వేయకుండా అడ్డుతగులుతున్నారంటూ, తాను ఢిల్లీకి వొస్తానని గజగజ వణుకుతున్నారంటూ ఆయన చేసిన ప్రసంగం ఏమేరకు ఆకళింపుచేసుకున్నారన్నది వోట్లద్వారా మరో రెండు రోజుల్లో ప్రజలు చెప్పనున్నారు.