Take a fresh look at your lifestyle.

రైతును రాజు చేయడం కెసిఆర్‌ ‌లక్ష్యం

తెలంగా ణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లా కలెక్టరేట్‌లో జాతీయ జెండా ను రాష్ట్ర పంచాయతీ రాజ్‌ ‌గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు జెండా ఆవిష్క• •ణ చేశారు. ముందుగా ఉద్యమంలో వీరమరణం పొందిన అమర వీరులను స్మరించుకుం టూ అమర వీరుల స్మారక స్తూపం వద్ద మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు లు కలిసి అమరవీరులకు నివాళులర్పించారు. విలేకర్లతో మాట్లాడుతూ ప్రస్తుత సిఎం, నాటి ఉద్యమ నేత కేసిఆర్‌ ‌నాయకత్వంలో అనేక మంది పోరాటాల ఫలితం, అమరుల బలిదానాలు, త్యాగాల నీరతి నేటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అన్నారు. సీఎం కేసిఆర్‌ ‌తెలంగాణని దేశంలో నెంబర్‌ ‌వన్‌ ‌గా తీర్చిదిద్దుతున్నారన్నారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షల కు అనుగుణంగా పరిపాలన సాగుతున్నదని, సాగు నీటితో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కరోనా కష్ట కాలం లోనూ నిరాటంకంగా కొనసాగుతున్నాయన్నారు. రైతును రాజు చేసే పనిలో సీఎం కేసిఆర్‌ ఉన్నారన్నారు. అందుకే సిఎం కేసిఆర్‌ ‌రైతులకు రుణ మాఫీ, రైతు బంధు, రైతు బీమా వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు.

రైతులు, మన వ్యవసాయం శాస్త్రవేత్తల అధ్యయనం మేరకు ప్రభుత్వమే ఏయే పంటలు వేయాలో సూచిస్తుందన్నారు. నియంత్రిత పంటలను వేసి లాభసాటిగా మారాలని పిలుపునిచ్చారు. త్వరలోనే వరంగల్‌ ‌పూర్వ, రూరల్‌ ‌జిల్లాలో అనేక పరిశ్రమలు రానున్నాయని, అన్ని రంగాల్లో వరంగల్‌ అ‌గ్రగామిగా మారుతుందన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వచ్చే వానాకాలం సీజన్‌ ‌లో అంటు వ్యాధులు ప్రబల కుండా జాగ్రత్త పడాలన్నారు. పల్లె ప్రగతికి కొనసాగింపుగా నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌ ‌పర్సన్‌ ‌గండ్ర జ్యోతి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ ‌రెడ్డి, కలెక్టర్‌ ‌హరిత, సిపి రవీందర్‌, ‌వెంకట లక్ష్మి, పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply