Take a fresh look at your lifestyle.

జాతిని చీల్చే వారిపట్ల అప్రమత్తం

ప్రపంచానికే స్ఫూర్తి ప్రదాత..గాంధీ
మహాత్ముడిని కించపరిచే వెకిలి చేష్టలు
ఆయన ఎప్పటికీ మహాత్ముడే
దేశానికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఒక అపురూప సందర్భం
దేశ ఐక్యత కోసం ఎందరో త్యాగధనుల కృషి
స్వాతంత్య్ర స్ఫూర్తిని ముందుతరాలకు చాటాలి
సిపాయిల తిరురుబాటు గుణపాఠంతో ఉద్యమించారు
వీరుల త్యాగాలను ఎప్పటికీ విస్మరించకుండా ముందుకు
వజ్రోత్సవ వేడుకల్లో సిఎం కెసిఆర్‌ ‌పిలుపు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 8 : ‌దేశంలో మహాత్మాగాంధీని అవమానించే పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. జాతిపిత గాంధీజీనీ కొందరు కించపరిచేలా ప్రవర్తిస్తున్నారని..మహాత్ముడు ఎప్పటికీ మహాత్ముడుగానే ఉంటాడని సీఎం కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. మనం స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు ఎందరో ప్రాణత్యాగం చేశారని తెలిపారు. అనేక త్యాగాలు, పోరాటాలతో దేశానికి స్వాతంత్యం వొచ్చిందన్న ముఖ్యమంత్రి..ఏ దేశానికికైనా స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఒక అపురూప సందర్భమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో స్వాతంత్య భారత వజ్రోత్సవాలు అద్భుతంగా జరగాలని ఆకాంక్షించారు.సోమవారం హెచ్‌ఐసీసీలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ప్రారంభించిన ముఖ్యమంత్రి ఆపై జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ ‌మాట్లాడుతూ…గాంధీనీ కించపరిచే సంఘటనలు ఇవాళ దేశంలో వినాల్సి వొస్తుందన్నారు.
భారతమాతకు సమానంగా గౌరవం ఇవ్వాల్సిన సందర్భంలో కొందరు చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహాత్ముడు ఎప్పటికైనా మహత్ముడే అని స్పష్టం చేశారు. స్వాతంత్య ్రపోరాటం గురించి కొత్త తరానికి తెలియదని…  కొత్త తరాలకు స్వాతంత్య ్రపోరాటాలు తెలియాలన్నారు. పలువురి త్యాగాలు, పోరాటాలతో స్వాతంత్య్రం వొచ్చిందని అన్నారు. పేదరికం ఉన్నంత కాలం అలజడులు ఉంటాయని చెప్పుకొచ్చారు. ప్రజల ఆకాంక్షలు ఇంకా పూర్తిగా నెరవేరలేదని కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. ఇదే సందర్భంలో మోదీ, బీజేపీ విధానాలపై కేసీఆర్‌ ‌పరోక్షంగా చురకలు అంటించారు. నెగెటివ్‌ ‌ఫోర్కస్‌లను చూసి భయపడాల్సిన అవసరం లేదన్నారు. చెలరేగుతున్న కూర్పును చెడగొట్టడానికి అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జాతిని చీల్చే వారిపట్ల అప్రమత్తమై ఉండాలని తెలిపారు. అవసరమైతే దేశం కోసం ముందుండి పోరాటం చేయాలని కేసీఆర్‌ ‌పిలుపునిచ్చారు. అనేక త్యాగాలు, పోరాటాలతో దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. గాంధీజీ ఎన్నో త్యాగాలు చేసి.. స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించారని తెలిపారు. ఎన్నో దేశాల్లో స్వాతంత్య పోరాటాలకు గాంధీజీ స్ఫూర్తిగా నిలిచారన్నారు. స్వాతంత్య్ర  పోరాటంలో ఎందరో నేతలు జీవితాలు త్యాగాలు చేశారని గుర్తు చేశారు. కొత్త తరం వారికి స్వాతంత్య్ర పోరాట సందర్భ ఘటనలు తెలియవని వ్యాఖ్యానించిన సీఎం కేసీఆర్‌…ఉద్యమకారులను ఆనాటి బ్రిటిష్‌ ‌ప్రభుత్వం దారుణంగా అణచివేసిందని తెలిపారు.
image.png
స్వాతంత్య్రం వొచ్చాక ఈ దేశాన్ని కలిపి ఉంచేందుకు ఎంతో కష్టపడ్డారు. వందల మంది సంస్థానాల అధిపతులను ఒప్పించారు. రాజభరణాలు ఇచ్చారు. జమ్ముకశ్మీర్‌, ‌జునాగఢ్‌, ఇం‌డోర్‌, ‌హైదరాబాద్‌.. ‌దేశంలో విలీనమయ్యాయి. ఎన్నో వ్యయ ప్రయాసల తర్వాత పుదుచ్చేరి, గోవా, సిక్కిం కలిశాయి. పేదరికం ఉన్నంత కాలం దేశంలో అలజడులు, అశాంతి ఉంటాయి. దేశంలో పేదరికం పూర్తిగా తొలగిపోతేనే అభివృద్ధి సాధిస్తాం. ఈ దేశం నాదనే అభిప్రాయం ప్రతి ఒక్కరిలో కలగాలి.మహాత్ముడు ఎప్పుడూ మహాత్ముడే..: జాతిపిత గాంధీజీనీ కొందరు కించపరిచేలా ప్రవర్తిస్తున్నారు. మహాత్ముడు ఎప్పటికీ మహాత్ముడుగానే ఉంటాడు. మనం స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు ఎందరో ప్రాణత్యాగం చేశారు. తెలంగాణ వచ్చాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిఢవిల్లుతున్నాయి. చిల్లర మల్లర చేష్టలను ప్రతి ఒక్కరూ చీల్చి చెండాడాలి. ఐకమత్యంతో ఉండి ఈ జాతి ఔన్నత్యం చాటాలని కేసీఆర్‌ ‌వ్యాఖ్యానించారు. ఎన్ని త్యాగాలు.. ఎన్ని పోరాటాలు.. ఆవేదనలతో స్వాతంత్య్రం సిద్ధించింది.. ఆ స్ఫూర్తిని అందరికీ తెలిసేలా వాడవాడలా.. గ్రామగ్రామాన అద్భుతంగా స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ‌పిలుపునిచ్చారు. ‘భారత స్వాతంత్య్రం కూడా సుదీర్ఘమైన పోరాటం.
image.png
సుమారు ఒకటిన్నర శతాబ్దం పాటు కొనసాగిన పోరాటం. అనేక మంది పెద్దలు, అనేక రకాల పద్ధతుల్లో వలస పాలకులకు వ్యతిరేకంగా అపురూపమైన త్యాగాలు చేస్తూ పోరాటాలు చేశారు. దాంట్లో ప్రధానంగా 1857 సిఫాయిల తిరుగుబాటును తీసుకుంటాం. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విశేషమేంటంటే.. సిఫాయిలు తిరుగుబాటు రాజ్యం పడిపోవాలి. విప్లవపంథాలో విప్లవాలు చెలరేగి.. విప్లవ శక్తులు విజయం సాధించిన వేళకూడా రాజ్యానికి సహకరించే సగం మంది విప్లవకారులతో కలిసినప్పుడే విజయం సాధిస్తుంది. అట్లాగే సాయుధ బలగాలు పోరాటం, తిరుగుబాటు చేస్తే రాజ్యంపోవాలే. కానీ, భారత స్వతంత్ర సమరంలోని ఉజ్వలఘట్టం ఆ నాటి బ్రిటిష్‌ ‌వలస రాజ్యం కూలిపోలే. ఆ తర్వాత బలంగా అణచివేత ప్రారంభించారు. అయినా స్వతంత్ర ఉద్యమకారులు సిపాయిల తిరుగుబాటు లాంటి అరూపఘట్టమే ఫెయిల్‌ అయ్యిందని ఎనాడూ నిరాశ చెందలే. అదే స్ఫూర్తితో వైఫల్యాన్ని పాఠంగా నేర్చుకొని పోరాటాన్ని కొనసాగించారు. బాలగంగాధర్‌ ‌తిలక్‌ ‌నేతృత్వంలో అనేక సాంస్కృతిక పోరాటాలు వచ్చాయ్‌. ‌లాలాలజపతిరాయ్‌, ‌బిపిన్‌చంద్రపాల్‌ ఇలా అనేక మంది పోరాటాలు చేశారు.
ఝాన్సీ లక్ష్మీభాయి, ఎంతో మంది రాజులు, సంస్థానాదీశులు యావత్‌ ఆసేతుహిమాచలం ఒకటై పోరాటం జరిపారు’ అని సీఎం కేసీఆర్‌ ‌కొనియాడారు.. బారిష్టర్‌ ‌చదువుకొని, చాలా సందించుకునే అవకాశాలుండి.. గొప్ప అడ్వకేట్‌గా పేరున్న మహాత్మా గాంధీ.. ఆయన స్వతంత్ర సమరానికి నాయకత్వం వహించి.. నడుం బిగించారు. దక్షిణాఫ్రికాలో ఎదుర్కొన్న జాతివివక్ష, అనేక వ్యవహారాలకు వ్యతిరేకంగా పోరాటం జరిపి.. నా జాతి కూడా ఇదే పద్ధతిలో పోరాటం చేస్తుందని ఆయన భారత్‌కు రావడం జరిగింది. చాలా గొప్ప బిడ్డను కన్నది మన భరత మాత. భారతదేశ స్వతంత్ర సముపార్జన సారథే కాదు.. యావత్‌ ‌ప్రపంచానికే అహింసా సిద్దాంతాన్ని ప్రతిపాదించిన శాంతిదూత, విశ్వమానవుడు మన మహాత్మాగాంధీ. నేను పార్లమెంట్‌ ‌సభ్యుడిగా ఉండే కాలంలో.. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరిగిన సందర్భంలో ఆనాటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబమా వచ్చారు. పార్లమెంట్‌ ‌జాయింట్‌ ‌సెషన్‌లో ప్రారంభించారు. ఉపన్యాసం ప్రారంభించే సమయంలో విలువైన మాట చెప్పారు. ఆ రోజు మన భారతీయులందరి గుండెలు పులకిపోయాయి. వ్యక్తిగతంగా నేను గర్వపడ్డాను. ’గాంధీ గారు ఈ ప్రపంచంలో పుట్టకపోయి ఉంటే.. ఒబమా అనే నేను అమెరికా అధ్యక్షుడిని అయ్యేవాడినే కాదు’? ఇది అమెరికా అధ్యక్షుడు చెప్పిన మాట. ఐన్‌స్టిన్‌ ‌శాస్త్రవేత్త మహాత్మాగాంధీ అనే వ్యక్తి రక్తమాంసాలతో పుట్టి ఈ భూమివి•ద నడయాడుతడు అనుకోలేదు.. అంతటి మహాత్ముడి అని ఐన్‌స్టీన్‌ ‌చెప్పారు. ఆఫ్రికాలో ఎంతో పోరాటంచేసిన నెల్సన్‌ ‌మండేలా.. నాకు ప్రముఖమైన స్ఫూర్తి ప్రధాత గాంధీ అని చెప్పారు. గాంధీ విశ్వమానవుడు.. ఆయనను కన్న గడ్డ నా భరత జాతి. అటువంటి జాతికి వారసులం మన అందరం’ అని అన్నారు. మనం ఎంతో గర్వంగా, సంతోషంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహాత్మాగాంధీ వారసులుగా ఈ దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దడానికి కంకణంకట్టుకున్న వ్యక్తులుగా మనం ప్రజాసేవరంగంలో మునిగి ఉన్నాం.
వి• అందరికీ శ్రమ ఇచ్చి రాష్ట్రం నలుమూల నుంచి పిలిపించిన కారణం ఏంటంటే.. ఒక మహోజ్వల మైనటువంటి స్వతంత్ర వజ్రోత్సవ దీప్తి.. వాడవాడల గ్రామగ్రామాన చాలా అద్భుతంగా జరగాలి. చాలా గొప్పగా ఎన్ని త్యాగాలతో,ఎన్ని రకాల పోరాటాలతో, వేదనలు.. ఆవేదనలతో స్వాతంత్యం•-ర వచ్చిందో ప్రతిగడపకు తెలిసేలా నిర్వహించాలి. జిల్లాలో మంత్రుల ఆధ్వర్యంలో కమిటీలు ఉన్నయ్‌. ‌మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ అధ్యక్షులు, మేయర్లు, మున్సిపల్‌ ‌చైర్మన్లు, ఎంపీపీలు అందరు తమ పరిధిలో ఉజ్వలం నిర్వహించాలని, ఆ స్ఫూర్తిని ఈ వేదికగా వి•రు పొంది తిరిగి వి• వి• గ్రామాలు, పట్టణాల్లో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు రప్పించాం అని మనవి చేస్తున్నా’ అన్నారు. ’ఏయే సందర్భంలో ఎవరు త్యాగాలు చేశారు, ఎన్ని రకాల పోరాటాలు చేశారు.. అలవోకగా తమ అసువులు, ఆయుష్షును దేశ స్వాతంత్య్రం కోసం ధారబోశారు. మరణానికి వెనుకాడకుండా..మడమ తిప్పకుండా పోరాటాలు చేశారు. అలాంటి స్ఫూర్తి, త్యాగనీరతితో మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది’ అన్నారు. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, కళాకారులు ఈ వజ్రోత్సవాల్లో పాల్గొన్నారు. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా హెచ్‌ఐసీసీలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వేదికపై 75 మంది కళాకారులతో నిర్వహించిన వీణావాయిద్య ప్రదర్శన వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. శాండ్‌ ఆర్ట్‌తో స్వతంత్ర పోరాట ఘట్టాల ప్రదర్శన అందర్ని భావోద్వేగానికి గురి చేసింది. వేదికపై దేశభక్తి ప్రబోధ నృత్యం, ఫ్యూజన్‌ ‌డ్యాన్స్, ‌లేజర్‌ ‌షో అలరించాయి. వజ్రోత్సవాల్లో భాగంగా 15 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్‌ ‌సహా అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటా జాతీయ జెండా ఎగుర వేసేందుకు ప్రభుత్వం 1.2 కోట్ల జెండాలను పంపిణీ చేయనుంది. ఈ నెల 9 నుంచి 21 వరకు రాష్ట్రంలో 562 సినిమా హాళ్లలో ఉదయం పూట పాఠశాలల విద్యార్థుల కోసం రిచర్డ్ అటెన్‌బరో నిర్మించిన ‘గాంధీ’ చిత్రాన్ని ప్రదర్శిస్తారు. ఈ నెల 21న శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. 22న ఎల్బీ స్టేడియంలో ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 15 నుంచి పింఛనుకార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని సీఎం కేసీఆర్‌ ‌ప్రకటించారు.
వజ్రోత్సవ వేడుకల్లో ఆకట్టుకున్న కళాబృందాలు… కళాకారులకు సిఎం కెసిఆర్‌ అభినందన
స్వాతంత్య్ర సంరంభం మళ్లీ విరబూసింది. తెలంగాణ వేదికగా ఆ విరోచిత పోరాటం మళ్లీ కండ్లకు కనిపించింది. తెలంగాణ సర్కార్‌ ఇవాళ హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో అత్యంత వైభవంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్ని నిర్వహించింది. దేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకువచ్చిన మహానీయుల వీరగాధల్ని గుర్తు చేసుకున్నది. వివిధ రకాల కళారూపాలతో ఆ నాటి సమరయోధుల ఘన చరిత్రలను ప్రజెంట్‌ ‌చేశారు. సీఎం కేసీఆర్‌ ఈ ‌కార్యక్రమాన్ని సమరస్పూర్తితో తిలకించారు. 75 ఏళ్ల స్వాతంత్య స్పూర్తిని తెలంగాణ అత్యంత అలౌకికరీతిలో చాటిన తీరు అనిర్వచనీయం. ఉత్సవ వేడుకల్ని సీఎం కేసీఆర్‌ ఆసక్తితో తిలకించారు. స్టేజ్‌పై సాగిన ప్రతి భావోద్వేగ సన్నివేశాన్ని ఆయన మెచ్చుకున్నారు.. తన చప్పట్లతో కళాకారులను ప్రోత్సహించారు.

Leave a Reply