Take a fresh look at your lifestyle.

దేశానికే ఆదర్శంగా కేసీఆర్‌ ‌కిట్‌

  • ‌ప్రభుత్వ దవాఖానల్లో 22 శాతం మేర పెరిగిన ప్రసవాలు
  • కేసీఆర్‌ ‌మార్గదర్శనంలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ వైద్య రంగం
  • గజ్వేల్‌ ‌ప్రభుత్వ దవాఖానను మంత్రి హరీష్‌ ‌రావు ఆకస్మిక తనిఖీ

సిద్ధిపేట, జనవరి 19 (ప్రజాతంత్ర బ్యూరో) : రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రవేశపెట్టిన కేసీఆర్‌ ‌కిట్‌ ‌దేశానికే ఆదర్శంగా నిలిచిందనీ, కేసీఆర్‌ ‌కిట్లతో ప్రభుత్వ దవాఖానల్లో 22 శాతం మేర ప్రసవాలు పెరిగినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు తెలిపారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ ‌ప్రభుత్వ దవాఖానను మంత్రి హరీష్‌రావు ఎమ్మెల్సీ డాక్టర్‌ ‌వంటేరు యాదవరెడ్డి, ఎఫ్‌డిసి ఛైర్మన్‌ ‌వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మార్గనిర్దేశంలో తెలంగాణ వైద్య రంగం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంఆగా జనరల్‌ ‌వార్డు, పిల్లల వార్డు, కొరోనా టెస్టుల కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా చెకప్‌ ‌కోసం వొచ్చిన గర్భిణులతో మంత్రి మాట్లాడారు. అందుతున్న వైద్య సేవలు, చేస్తున్న పరీక్షలు, అమ్మ ఒడి వాహన సేవలు, కేసీఆర్‌ ‌కిట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రసవాల కోసం మహిళలు ప్రభుత్వ దవాఖానాలకే రావాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకు రావడంతో పాటు, కేసీఆర్‌ ‌కిట్లు నయా పైసా ఖర్చు లేకుండా అందిస్తున్నట్లు చెప్పారు. మగ బిడ్డ పుడితే 12వేల రూపాయలు, ఆడ బిడ్డ పుడితే 13వేల రూపాయలదించడంతో పాటు 16 వస్తువులతో కూడిన కిట్‌ అం‌దిస్తున్నట్లు చెప్పారు. ఆటో కిరాయి ఖర్చు లేకుండా గర్భిణుల కోసం అమ్మ ఒడి సేవలు సిద్దంగా ఉన్నాయనీ, వీటన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొరోనా పరీక్షా కేంద్రం వద్ద పరీక్షలు చేస్తున్న తీరును మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా చేస్తున్న పరీక్షలు, అందిస్తున్న హోమ్‌ ఐసోలేషన్‌ ‌కిట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. కిట్‌లో ఉన్న మందులను వాడుతూ దైర్యంగా ఉండాలని సూచించారు.

ఒమిక్రాన్‌ ‌వేరియంట్‌ ‌వ్యాప్తి ఎక్కువ ఉన్నప్పటికీ, సోకిన వారు ప్రమాదకర పరిస్థితులకు వెళ్లే అవకాశం చాలా తక్కువగా ఉందన్నారు. అలా అని నిర్లక్ష్యం చేయొద్దనీ, కొరోనా నిబంధనలు పాటించడంతో పాటు ప్రతి ఒక్కరూ రెండు డోసుల టీకా వేసుకోవాలని సూచించారు. కొరోనా పరిస్థితులను ఎదుర్కునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కోటి హోమ్‌ ఐసోలేషన్‌ ‌కిట్లు, రెండు కోట్ల టెస్టింగ్‌ ‌కిట్లు సిద్ధం చేసుకున్నట్లు చెప్పారు. సబ్‌ ‌సెంటర్‌, ‌పిహెచ్‌సి స్థాయి నుంచి అన్ని దవాఖానాల్లో వీటిని అందుబాటులో ఉంచామన్నారు. సిద్ధిపేట మెడికల్‌ ‌కాలేజీలో వంద పడకల కొరోనా వార్డును ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు.

గజ్వేల్‌ ‌వైద్య ఆరోగ్య అధికారులు, సిబ్బందికి మంత్రి ప్రశంస
గజ్వేల్‌ ‌జిల్లా దవాఖానలో పని చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది బాగా పని చేస్తున్నారని మంత్రి హరీష్‌ ‌రావు కితాబిచ్చారు. దవాఖానలో నెలకు 400 డెలివరీలు చేస్తున్నారనీ తెలిపారు. గజ్వేల్‌ ‌దవాఖానలో అప్పుడే పుట్టిన పిల్లలకు వొచ్చే పసిరికలు, ఇతర ఆరోగ్యపరమైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అత్యవసర వార్డు చక్కగా పని చేస్తుందన్నారు. వైద్యులు పిల్లలకు మంచి సేవలందిస్తున్నారని అన్నారు.

Leave a Reply