Take a fresh look at your lifestyle.

బీజేపీపై ఎదురు దాడి… కాంగ్రెస్‌పై సానుభూతి

కేసీఆర్‌ ‌రెండంచెల వ్యూహం
ఏ విధంగా చూసినా గులాబీకే లాభం
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర : కేంద్రంలోని బీజేపీపై ఎదురు దాడి చేస్తూ..ఆ పార్టీకి బద్ధ శత్రువైన కాంగ్రెస్‌ ‌పై సానుభూతి చూపిస్తూ రాజకీయంగా లబ్ది పొందే వ్యూహాన్ని గులాబీ బాస్‌, ‌సీఎం కేసీఆర్‌ ‌తెలంగాణలో అనుసరిస్తున్నారు. బీజేపీపై పోరాటం చేస్తున్న కాంగ్రెస్‌ను సమర్థించడం ద్వారా బీజేపీకి తమ పార్టీ దూరమనే సంకేతాలు ఆ పార్టీ వ్యతిరేక పార్టీలకు పంపడంతో పాటు ఆ పార్టీ కార్యకర్తలను అయోమయానికి గురి చేయడం కూడా కేసీఆర్‌ ‌వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొద్ది కాలంగా సీఎం కేసీఆర్‌ ‌ప్రధాని మోదీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై వొంటి కాలిపై లేస్తున్నారు. తిట్టిన తిట్టు తిట్టకుండా కడిగి పారేస్తున్నారు. అదే సమయంలో ఆ పార్టీకి బద్ధ శత్రువైన కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీపై అస్సాం సీఎం చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సానుభూతి చూపించారు. ఈ వ్యూహంతో రాష్ట్రంలో వొచ్చే ఎన్నికల నాటికి బలమైన శక్తిగా రూపుదిద్దుకోవాలని చూస్తున్న బీజేపీని, కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌కు మద్దతుగా నిలవడంతో ఆ పార్టీ శ్రేణుల నుంచి మద్దతు పొందే ద్విముఖ వ్యూహాన్ని కేసీఆర్‌ ‌పకడ్బందీగా అమలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ను ఓ వైపు బీజేపీ దెబ్బ కొడుతుంటే మరోవైపు, ఆపార్టీని పరోక్షంగా కేసీఆర్‌ ‌దెబ్బ కొడుతున్నారనే చర్చ రెండు పార్టీలలోనూ సాగుతుంది. సీఎం కేసీఆర్‌ ఏం ‌చేసినా దాని ప్రభావం కాంగ్రెస్‌ ‌పార్టీపై పడుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా కేసీఆర్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీని పెద్దగా టార్గెట్‌ ‌చేయడం లేదు. ఆ పార్టీని విమర్శించిన సందర్భాలు కూడా పెద్దగా లేవనే చెప్పాలి. ప్రస్తుతం కేసీఆర్‌ ‌టార్గెట్‌ అం‌తా బీజేపీనే కాబట్టి ఆ పార్టీని లక్ష్యంగా చేసుకుని ఆయన రాజకీయాలు చేస్తున్నారు. బీజేపీ కూడా కేసీఆర్‌ ‌ప్రధాని మోదీపై, తమ పార్టీపై చేస్తున్న విమర్శలకు గట్టిగానే కౌంటర్‌ ఇస్తున్నప్పటికీ ఆయన వాటిని తెలంగాణ సెంటిమెంట్‌తో తిప్పికొడుతున్నారు. గత వారం జనగామ, భువనగిరిలో నిర్వహించిన బహిరంగ సభలలో తనను ఎంపీగా గెలిపించిందనందుకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాననీ, మరోసారి దీవిస్తే దిల్లీ కోటను బద్ధలు కొడతానని అందుకు మీరు సిద్దమేనా అని ప్రజలను అడిగి వారితో సమాధానం చెప్పించడం కూడా కేసీఆర్‌ ‌తెలంగాణ సెంటిమెంట్‌ను మరోసారి రెచ్చగొడుతున్నారని అనడానికి స్పష్టమైన సంకేతాలని రాజకీయ విశ్లేషకులు బావిస్తున్నారు. ఈ రెండంచెల వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీల దృష్టిలో టీఆర్‌ఎస్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందనీ, అది వొచ్చే ఎన్నికలలో లబ్ది చేకూరుస్తుందని భావిస్తున్నారు.

Leave a Reply