Take a fresh look at your lifestyle.

కెసిఆర్‌ అవినీతి, కుటుంబ పాలనకు చరమగీతం

  • హైదరాబాద్‌ ‌గెలుపుతోనే ఇది సాధ్యం
  • నగరంలో రోడ్డుషోలో పిలుపునిచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా

హైదరాబాద్‌,‌నవంబర్‌27: ‌కెసిఆర్‌ అవినీతి, కుటుంబ పాలనకు చరమగీతం పాడాలంటే హైదరాబాద్‌ ఎన్నికల్లో బిజెపిని గెలిపించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పలిపునిచ్చారు. నగరంలో రోడ్డు షో నిర్వహించిన సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. బల్దియా ఎన్నికల వేళ బీజేపీ నాయకులు విసృత్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి బీజేపీ అగ్ర నేతలు కూడా వచ్చి రాష్ట్రంలో పర్యటిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. అంతేగాకుండా కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ప్రచారంలో భాగంగా శుక్రవారం కొత్తపేటలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రోడ్‌షో నిర్వహించారు. ఈ రోడ్‌షోలో కొత్తపేట నుంచి నాగోల్‌ ‌వరకు ప్రచారం చేశారు. జోరు వర్షంలోనూ రోడ్‌ ‌షో కొనసాగుతోంది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి డివిజన్‌లో కమలం జెండా రెపరెపలాడుతుందని చెప్పారు. ప్రజల స్పందన చూస్తుంటే కేసీఆర్‌ ‌పాలనకు ముగింపులా అనిపిస్తోందన్నారు. తెలంగాణను అప్పుల మయంగా మార్చారని విమర్శించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హాలను నెరవేర్చకుండా కొత్త హాలతో ప్రజలను మభ్య పెడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ‌పని అయిపోయిందని, ప్రజలు గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం చెబుతారన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతా మన్నారు. గల్లీ ఎన్నికలకు ఢిల్లీ నేతలు వస్తున్నారని కేటీఆర్‌ ‌విమర్శిస్తున్నారని పార్టీని గెలిపించడం కోసం ఎక్కడికైనా వస్తానని అన్నారు. టీఆర్‌ఎస్‌ ‌నేతల డ్రామాలు ఇకదట సాగవని జేపీ నడ్డా మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ‌పాలనకు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడుతారని చెప్పారు. జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకుగాను బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌ ‌చేరుకున్నారు.

ప్రత్యేక వినానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న నడ్డాకు కిషన్‌ ‌రెడ్డి, బండి సంజయ్‌ ,ఎమ్మెల్యే రాజాసింగ్‌, ‌పెద్దిరెడ్డి, కన్నా లక్ష్మినారాయణ స్వాగతం పలికారు. నడ్డా బేగంపేట నుంచి నేరుగా కొత్తపేటకు చేరుకోనున్నారు. అక్కడ కొత్తపేట చౌరస్తా నుంచి నాగోల్‌ ‌వరకు జరిగే రోడ్‌ ‌షో లో నడ్డా పాల్గొన్నారు. బీజేపీ జీహెచ్‌ఎం‌సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. అతిరథ మహారథులందరినీ హైదరాబాద్‌లో దించుతోంది. గ్రేటర్‌పై పూర్తి ఫోకస్‌ ‌పెట్టింది. గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఒక కార్పొరేషన్‌ ఎన్నికకు బీజేపీ ఇంత ప్రాధాన్యతనివ్వడం, ఢిల్లీ నేతలందరూ సిటీలోని గల్లీలకు తరలిరావడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేకేత్తిస్తోంది. దుబ్బాక విజయం ఇచ్చిన ఊపు బీజేపీలో నయాజోష్‌ ‌నింపింది. ఈసారి ఎలాగైనా బల్దియాపై కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ భావిస్తోంది. అందుకనుగుణంగా తమ వ్యూహాలకు కూడా పదునుపెట్టింది. ప్రచారంపై దృష్టి పెడుతూ మరోవైపు ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌లోని అసంతృప్తి నేతలకు గాలం వేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇప్పటికే పలువురు టీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌నేతలను పార్టీలోకి చేర్చుకొని టికెట్‌ ఇచ్చింది.

Leave a Reply