Take a fresh look at your lifestyle.

నిరుద్యోగులను మోసం చేస్తున్న కేసీఆర్‌

టీజేఏస్‌ అధినేత ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌
‌నల్లబెల్లి, మార్చి 5, (ప్రజాతంత్ర విలేకరి) : నియామకాల పేరుతో ఏర్పాటు చేసుకున్న తెలంగాణలో నిరుద్యోగులను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మోసం చేస్తున్నాడని వరంగల్‌, ‌ఖమ్మం, నల్గొండ పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి టీజేఏస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నల్లబెల్లి మండలంలోని రుద్రగూడేం ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంతనతరం మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాలరాస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు. 2014 అసెంబ్లీ సమావేశాల్లో లక్ష పన్నెండు వేల ఉద్యోగాలున్నాయని చెప్పి కనీసం యాభై వేల ఉద్యోగాలు కూడా నింపలేదన్నారు.

ఇన్నిరోజులు గుర్తుకు రాని ఉద్యోగాల భర్తీ కేటీఆర్‌కు ఒక్కసారిగా గుర్తుకురావటం విడ్డురామన్నారు. విద్యుత్‌, ‌పంచాయతీ కార్యదర్శులు, సింగరేణి, ఉద్యోగాలు నియామక పక్రియ చూపించి నిరుద్యోగులను మోసం చేస్తున్నారన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రొఫెసర్‌ ‌కోదండరాం సార్‌ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాకార్యదర్శి అంబటి శ్రీనివాస్‌, ‌బోట్ల పవన్‌, ‌కుమారస్వామి, దయాకర్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply