Take a fresh look at your lifestyle.

కేసీఆర్‌ ‌కుటుంబమంతా కమీషన్ల బాపతే…: విజయశాంతి

  • కొరోనా టైంలో రూ.లక్ష కోట్ల కుంభకోణం?
  • కేసీఆర్‌ ‌కుటుంబం కమీషన్‌ ఎం‌తో చెప్పాలి
  • కేటీఆర్‌…‌మీకు టీకా అంటే ఏంటో తెలుసా?
  • మండిపడ్డ విజయశాంతి

రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్‌)‌పై బిజెపి సీనియర్‌ ‌నాయకురాలు, మాజీ ఎంపి, ప్రముఖ సినీ నటి విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ తనదైనశైలిలో మండిపడ్డారు. కేటీఆర్‌ ‌గారూ.. అసలు మీకు టీకా అంటే ఏంటో తెలుసా..? టీకా ఉత్పత్తి ఎలా జరుగుతుందో కొంతమాత్రమైనా అవగాహన ఉందా..? వ్యాక్సిన్‌ అనేది గంటలలోనో… రోజులలోనో… ఉత్పత్తి జరిపి ఇప్పటికిప్పుడు ఇబ్బడిముబ్బడిగా తయారు చేసేది కాదు. అదొక ప్రత్యేకమైన పక్రియ అంటూ విరుచుకుపడ్డారు. ఈ మేరకు సోమవారం ఆమె సోషల్‌ ‌మీడియా ద్వారా ఓ పోస్టు చేస్తూ… కేంద్ర ప్రభుత్వానికి విజన్‌ ‌లేదు.. ప్లాన్‌ ‌లేదంటూ మాట్లాడుతున్న కేటీఆర్‌కే సరైన విజ్ఞత లేదని అర్థమవుతోందనీ, ఎందుకంటే ప్రపంచంలో వ్యాక్సినేషన్‌ ‌మొదలైందే గత డిసెంబర్‌లో. భారత్‌లో జనవరి 16న వ్యాక్సినేషన్‌ ‌పక్రియ మొదలైంది. జనవరి 16 నుంచి మొదలు ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 25 కోట్లకు పైగా టీకా డోసుల (వ్యాక్సినేషన్‌) ‌పూర్తి చేశాం. ఇది అమెరికా కంటే ఎక్కువ. ఈ లెక్కలు తెలుసా కేటీఆర్‌ ‌గారూ అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపడం మంచిదికాదనీ, కొరోనా మహమ్మారి భారత్‌లో పుట్టలేదు. అది వూహాన్‌లో పుట్టి వివిధ దేశాలకు విస్తరించి మన భారత్‌కు అంటుకుందన్నారు. అందుకే ప్రపంచానికి వ్యాక్సినేషన్‌ ‌జరిగినప్పుడే వైరస్‌ ‌నిర్మూలన అనేది సుసాధ్యం. అవివేకంతో ఒక్క తెలంగాణలోనే వ్యాక్సిన్‌ ‌చేస్తా అనుకుంటే అది మీ అజ్ఞానమే అవుతుందన్నారు.

కేసీఆర్‌ ‌కుటుంబం, జీవితమే కమీషన్ల బాపతు. అందుకే ఫైజర్‌, ‌జాన్సన్‌ అం‌డ్‌ ‌జాన్సన్‌ ‌కంపెనీలను భారతదేశానికి ఎందుకు తీసుకురావడం లేదని గాయిగాయి పెడ్తున్న మీరు దేశ సంపదను ఆ కంపెనీలకు దోచిపెట్టాలనుకుంటున్నారా..? అంటే దేశంలో ఒక డోసు టీకా రూ. 250 ధరకే దొరకొద్దా..? రూ. 2వేలు, రూ.3వేలు అంటూ ఇష్టారీతిన రేట్లు పెంచుతూ కమీషన్లు దండుకోవాలనుకోవడం టిఆర్‌ఎస్‌ ‌ద•ర్బుద్ధి కాదా..?అని ప్రశ్నించారు. వ్యాక్సినేషన్‌ ‌పక్రియపై టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపడం దుర్మార్గం. ప్రపంచంలోనే అత్యధికంగా వ్యాక్సినేషన్‌ ‌జరిగిన దేశాల్లో భారత్‌ ‌రెండోస్థానంలో ఉంది. మొదటి డోసు ఇచ్చిన స్థానాల్లో భారత్‌ ‌మొదటిస్థానంలో ఉంది. వచ్చే డిసెంబర్‌ ‌నాటికి మొత్తం 250 కోట్ల డోసులు వ్యాక్సిన్‌ ఇవ్వాలన్న లక్ష్యంతో నరేంద్ర మోదీ సర్కారు పనిచేస్తోందన్నారు. ఈ కొరోనా టైంలో సుమారు రూ. లక్ష కోట్ల కుంభకోణం జరిగింది. ప్రైవేటు దవాఖానలకు దోచిపెట్టి కమీషన్లు దండుకుంది ఈ టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం. వేలమంది పేద ప్రజల ప్రాణాలను బలిపెట్టి ఖజానా నింపుకోవడం దుర్మార్గం. ప్రైవేట్‌ ‌దవాఖానల దోపిడీ గురించి స్పందించకుండా.. టాస్క్ ‌ఫోర్స్ అం‌టూ కొన్ని ఆసుపత్రులపై జులుం చూపెట్టి.. దోపిడీ చేసే పలు ప్రైవేట్‌ ‌దవాఖానలను చూసీచూడనట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారు..?

ఈ లక్షకోట్ల అవినీతిలో సీఎం కేసీఆర్‌ ‌కుటుంబ కమీషన్‌ ఎం‌తనో వారే చెప్పాలని విజయశాంతి డిమాండు చేశారు. అబద్ధాలు, పిచ్చి ప్రేలాపనలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కేసీఆర్‌ ‌కుటుంబానికి రోజులు దగ్గరపడ్డాయి. కేటీఆర్‌… ‌హైదరాబాద్‌ ‌జనాభా అంత కూడా లేని దేశాలతో 130 కోట్ల జనాభా గల భారతదేశాన్ని పోల్చడం మీ అవగాహనరాహిత్యానికి నిదర్శనం కాదా? అని నిలదీశారు. ప్రభుత్వానికి దొరకని వ్యాక్సిన్లు, ఇంత పెద్ద మొత్తంలో కొన్ని ప్రైవేట్‌ ‌సంస్థలకు ఎట్ల దొరుకుతున్నాయి..? భారత్‌ ‌బయోటెక్‌ ‌కంపెనీ మన దగ్గరే ఉన్నా, ఆ సంస్థ దగ్గర్నుంచి వ్యాక్సిన్‌ ‌తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్‌ అయిందనాన్రు. ఆ సంస్థ సుమారు పది లక్షల డోసులను మన రాష్ట్రంలోని ప్రైవేట్‌ ‌హాస్పిటళ్లకు సరఫరా చేసినట్టు హెల్త్ ఆఫీసర్లే చెప్తున్నారు. కానీ, ప్రభుత్వానికి మాత్రం ఇప్పటివరకూ రెండున్నర లక్షల డోసులే సరఫరా అయ్యాయి. అంటే మతలబు ఏంటి..? ప్రైవేటు ఆస్పత్రులతో కుమ్మక్కై కమీషన్ల కోసం ప్రజల ప్రాణాలు బలిపెట్టాలనుకుంటున్నారా..? అని అడిగారు. టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రూ. 2,500 కోట్ల ఖర్చుతో గ్లోబల్‌ ‌టెండర్లు పిలిచి వ్యాక్సిన్‌ ‌కొనుక్కుంటామంటూ బాతాలు కొడుతున్నరు కదా.. కనీసం రాష్ట్రంలో వెంటిలేటర్లను సర్వీసింగ్‌ ‌కూడా ఎందుకు చేసుకోలేకపోయారు..?

ఆక్సిజన్‌ను సకాలంలో అందించలేకపోయారు ఎందుకు..? కల్లబొల్లి మాటలతో మభ్యపెట్టే బదులు వ్యాక్సినేషన్‌ ‌విషయంలో మీ అసమర్థతను ఒప్పుకోండన్నారు. మీరు వ్యాక్సినేషన్‌ ‌చేసినా, చేయించకపోయినా.. ఖచ్చితంగా భారత ప్రజలందరికీ నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ ‌పక్రియను అందిస్తుందన్నారు. తెలంగాణ కూడా భారత ప్రజలే అని గుర్తుంచుకోవాలన్నారు. అసలు కొరోనాపై పోరాటంలో టిఆర్‌ఎస్‌ ‌సర్కారు ఏం చేసింది..? టెస్టులు తక్కువ చేసి, పాజిటివ్‌ ‌కేసులు, మృతుల సంఖ్యను తక్కువ చూపెట్టింది. దవాఖాన్లలో సిబ్బందిని నియమించలేదు. వసతులు మెరుగుపర్చలేదు. ఫలితంగా సర్కారు ఆసుపత్రులు ప్రజలకు సరైన వైద్యసేవలు అందించలేకపోయాయి. టిఆర్‌ఎస్‌ ‌నాయకుల ప్రోద్బలంతో ప్రైవేటు దవాఖానల ఫీజు దోపిడీని కొనసాగించింది. నిర్వహణ వైఫల్యంతో వ్యాక్సిన్‌ ‌పెద్దమొత్తంలో వృథా చేసిందన్నారు. కొరోనా విషయంలో టిఆర్‌ఎస్‌ ‌సర్కారు వైఫల్యాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. దీనిని తప్పించుకునేందుకే కేటీఆర్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌విషయంలో కేంద్రంపై నిందలు మొపుతున్నారు. కానీ, ప్రజలు అన్నీ అర్థం చేసుకుంటున్నారనీ, భవిష్యత్‌లో మీ పతనానికి మీరే గొయ్యి తవ్వుకుంటున్నారని గుర్తుపెట్టుకోవటం మంచిదనీ ఆ పోస్టులో కేటీఆర్‌కు విజయశాంతి చురకలంటించారు.

Leave a Reply