Take a fresh look at your lifestyle.

తెలుగు సంస్కృతికి ప్రతీక సంక్రాంతి పండుగ

యుగయుగాలుగా, తరతరాలుగా అవిచ్ఛిన్నంగా ప్రవహిస్తున్న క్షీర ధార హైందవ సంస్కృతి. ఆ పాల వెల్లువలో పెల్లుబికిన మీగడ తరగలే మన సాంప్ర దాయాలు. హైందవ సంస్కృతీ సంప్ర దాయాలకు, ఆచారాలకు ‘‘పండగ కేంద్ర బిందువు, పండుగలు శుభ సూచకాలు. ప్రతి కుటుంబంలో కష్ట నష్టాలను మరపించి, నూత నోత్సాహాన్ని కలిగిస్తాయి. పండగలు పురాణేతిహాస, రుతు సంబంధాలు, శీతోష్ణ  స్థితుల, సామాజిక జీవన విధానాధారాలుగా ఏర్పడ్డాయి. ప్రతి పండగలో పరమార్థం  ఉన్నందునే అవి సాంప్రదాయాలుగా మారాయి. డోలు సన్నాయి వాద్యాలు, వాటి రాగాలకు అనుగుణంగా విన్యాసాలు చేసే అలంకృత గంగిరెద్దులు, హరిలో రంగ హరీ అంటూ, నడినెత్తి నుండి నాసిక దాకా తిరుమణి శ్రీచూర్ణ పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లు ఘల్లుమనగా, బోడి తలపై రాగి అక్షయపాత్ర కదల కుండా, చిందులు తొక్కే హరిదాసులు, అడుగడు గునా ముంగిళ్లలో రంగుల ఆకృతులు, భోగిమం టలు, కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు, బొమ్మల పండుగలతో కలబోసిన గ్రామీణ సుందర మనో హర దృశ్యాలు తెలుగు వారికే ప్రత్యేకమైన సాంప్ర దాయ ప్రతీకలు.
చాంద్రమానం’’ పాటించే తెలుగువారు ‘‘సౌరమానం’’ ప్రకారం జరిపే పండుగ సంక్రాంతి’’, ‘‘తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమ కేశు సంచరత: సూర్యస్య పూర్వ స్మాద్రాశే ఉత్తర: రాశౌ సంక్రమణ ప్రవేశ: సంక్రాంతి’’. మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి.సంక్రాంతి అంటే మారడం, చేరడం అని అర్థం. కర్కాటకం నుంచి మకర సంక్రాంతి వరకు సూర్యుడు దక్షిణాభి ముఖంగా సంచరించడం వల్ల ఈ కాలాన్ని ‘దక్షిణా యణం’ అంటారు. మకర సంక్రాంతి నుంచి కర్కాటక సంక్రాంతి వరకు ఉత్తరాభి ముఖుడై సంచరించడం వల్ల ఈ కాలాన్ని ‘ఉత్తరాయణం’ అని అంటారు. దేవతలకు ఉత్తరాయణం ఉత్తమ కాలమని, దక్షిణా యణం పితృదేవతలకు ముఖ్య కాలమని భావిస్తారు. ఉత్తరాయణంలో మరణిస్తే మోక్షప్రాప్తి కలుగు తుందంటారు. అందుకే అంపశయ్యపై భీష్మా చార్యుడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి ఉన్నాడని మహా భారతం చెబుతోంది.
మూడు రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి సంబ రాలలో మొదటిది  భోగి పండగ. ఇతర పండు గల వలె తిథి ప్రధానము అయినది కాదు. ఇది ధనుర్మా సానికి, దక్షిణాయనానికి ఆఖరు రోజు.  మకర సంక్రమణానికి పూర్వపు రోజు. గోదాదేవి తిరుప్పావై రచన పూర్తి చేసిన ముప్పయవ నాడు రంగ నాథుడు ప్రత్యక్షమై అమెను వివాహమాడతానని, సకల భోగాలు సమకూరుస్తానని చెప్పి, వివాహమాడగా, వివాహ తంతు పూర్తికాగానే ఆమె స్వామి వారిలో ఐక్యం  పొందుతుంది. అందుకే ‘‘భోగి’’  అని ఈ పర్వమానికి పేరు. జన సామాన్యానికి భోగ భాగ్యాలు ఇచ్చే రోజని ప్రతీతి. భోగినాడు మేఘాధిపతి యైన ఇంద్రపూజు చేయడం ఆనవాయితీ.  బలి చక్రవర్తి అణగిన దినంగా చెపుతారు. భోగి నాడు భోగి పీడ నివారణ, తెల్లవారగనే అభ్యంగన స్నానం చేయడం, విధాయక కృత్యం. చంటిపిల్లలకు తలంటు పోసి, భోగి పళ్ళు పోయడంతో దృష్టి పరిహారం చేస్తారు. కొత్త బట్టలు కట్టి, కుర్చీలో కూర్చుండ చేసి, రేగు పళ్ళు, పైసలు, చెరుకు ముక్కలు, బోడికలు దిగువార బోస్తారు.

 

ధనుర్మాసం నెల రోజులు ఆడపిల్లలు తయారు చేసిన గొబ్బి పిడకలు చేయడం, తెల్లవారగట్లు భోగిమంటలు చేయడం ఆచరిస్తారు. మకర సంక్రాంతి సూర్యుడు ఉత్తర గతుడు కావడం త  ఉత్తరాయణ ప్రవేశమవుతుంది. ఉత్తరాయణం దేవతలకు అర్హమైన కాలం, ఈ అయనంలో మృతి చెందిన వారు పుణ్యాత్ములై, సూర్య సాయుజ్యం పొందగలరని వేద వచనం. సూర్య సంచారమును బట్టి ఏర్పడిన పండుగ. ఆడపిల్లలు తెల్లవారు జామున లేచి పెట్టే గొబ్బిల్లు, ఆర్ష కర్మలలో ప్రాము ఖ్యం కలిగిన కళా భిజ్ఞత ఉట్టిపడే ముగ్గులు, పళ్ళ నైవేద్యాలు, బాజా భజంత్రీల వాద్యాలు, ఎక్కడ చూసినా ఈనాడు దర్శనమిస్తాయి. రెండవ నాడు జరిపే మకర సంక్రాంతి అత్యంత పురాతనమైనది. సంక్రాంతి నాడు గంగలో స్నానం చేసి, బ్రాహ్మణునికి పెరుగు దానం చేయాలనే నియమాన్ని పాటించిన యశోదకు కృష్ణుడు జన్మించాడని దుర్వాసముని ద్వారా వివరింపబడి, ఆయన సూచనపై ద్రోణాచా ర్యుని సతి కృపి, సంక్రాంతి పర్వాన్ని జరిపి, పెరుగు దానం చేయడం ద్వారా అశ్వత్థామకు జన్మనిచ్చినట్లు పురాణ కథనం. ఈ సందర్భంగా నువ్వుల ముద్దలతో నలుగు పెట్టుకుని, తలంటి స్నానాలు చేసిన ముత్తయిదువలు, అలంకృతులై, ఐదు మట్టి ముంతలు పుచ్చుకుని, ఒక్కొక్క ముంతలో బియ్యం, పప్పు దినుసులు, చెరుకు, క్యాబేజీ ముక్కలు, రేగుపళ్ళు, నువ్వులు ఉంచి, మూకుడు మూతతో ఉంచి, ఎరిగిన వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి ఇస్తారు. నువ్వులతో చేసిన భక్ష్యాలతో భోజనం చేస్తారు. చిన్నపిల్లలకు మిఠాయి ఉండలు, రేగు పళ్ళు పంచు తారు.మకర సంక్రాంతినాడు రాముని పూజ చేసి ఉపవాసం ఉండాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది.

ఈనాడు సూర్యుని ఆరాధించి, తిలలు, కూష్మాండాలు, భాండాలు, కంబళి, ధా న్యాలు, లోహాలు, వస్త్రాలు, తైల దీపాలను దానం చేయాలని శాస్త్ర వచనం. భోజనానికి బంధు మిత్రులను ఆహ్వానించడం, నగలతో అలంకరించుకుని సూతన వస్త్ర ధారణ గావించిన  ముత్తయిదువలు పంచదార లో నువ్వులు కలిపి చిమ్మిలి చేసి, పంచి పెడతారు. సంవత్సరం పొడువునా, స్నేహితులై ఉండాలని ఆకాంక్షిస్తూ,  శుభ, సుఖ ప్రదం కావాలని దీవనలను పెద్దవారి నుండి పొందడం ఆచారం. ఇక చివరిది కనుము పండుగ. అధర్వణ  వేదంలో దీనిని వ్యషభో త్సవమని పేర్కొన్నారు. ముందు సంక్రమణం పెళ్ళిన మరువాడు పశువులకు చేసే పండగ ఇది. కనుమ నాడు మినుములు తినాలట. కనుమనాడు మిను ములు తినాలని, లేకపోతే యముడు ఇనుము కొరికిస్తాడని పెద్దలు అంటారు. కొన్ని ప్రాంతాల్లో కనుమనాడు తమ గ్రామ దేవతలకు నైవేద్యాలను సమర్పించే ఆచారం ఉంది. పురుషులు గ్రామ పొలి మేరల్లో కోడి పందాలు, పొట్టేళ్ల పందేలు జరుపు తారు. కనుమ రోజున ప్రయాణం పెట్టుకో కూడదని అంటారు. వెళ్తే వెంటనే తిరిగి రావడం కుదరదని ప్రతీతి. కనుమ నాడు కాకి కూడా ఎక్కడకీ బయల్దేరదనే సామెత.
కనుము నాడు గోపూజ చేయడం కొన్ని చోట్ల కనిపి స్తుంది. ఆవులను, దూడలను, ఎడ్లను, శుభ్రంగా కడిగి, కొమ్ము లకు ముఖానికి పసుపు రాచి, కుంకుమ పెడతారు. అలంకరణార్థం కుచ్చులు, కొత్త కట్టు తాళ్ళు పెడతాడు. వీధుల  వెంట ఊరే గిస్తారు. పశువుల శాలలను శుభ్రపరిచి మామిడాకులు కట్టి, పూలతో అలంకరిస్తారు. సాయం కాలం పొంగిలి నైవేద్యాన్ని పశువుల శాల వద్ద పెడతాడు. పవి త్రోదకం చల్లుతారు. పంటలు పండించే భగవంతునికి పొలాలను దున్నే  ఎద్దులకు కృతజ్ఞత తెలిపే పర్వం సంక్రాంతి యనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు వారికి ఇష్టమైన  సంక్రాంతి సంబరాలకు తెలుగు నేల సిద్ధమవుతున్నది
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

Leave a Reply