Take a fresh look at your lifestyle.

‘‌కమలం రూటు మారాలే’!

ఝూటా మాటలకు తెగపడుతరు
ఉల్టా వాదనలతో ఎగపడుతరు
కేంద్రం నుంచి నిధులను రాబట్టరు
ఇక్కడి బీజేపీ నేతలది ఇదే తీరు

ఖాజీపేట రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ లేదట
పునర్విభజన హమీ అమలు కాదట
ఇప్పటికే ఐటీఐఆర్‌ ‌ప్రాజెక్టు రద్దయింది
రాష్ట్ర వినతులను బుట్టదాఖలు చేస్తోంది

ఈడ కమలం రాజకీయ రూటు మారాలే
తెప్పించిన నిధులతో పతారా పెరుగాలే
గట్లయితనే జనం మీ వెంట నడుస్తరు!!
కాకుంటే కర్రు కాల్చి వాత పెడుతరు!!!

కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్ట్ ..

Leave a Reply