Take a fresh look at your lifestyle.

ఎపికి 3.72 లక్షల కోవిషీల్డ్ ‌డోసులు

రెండో డోసు కోసం ప్రజల ఎదురుచూపులు
విజయవాడ, జూలై 24 : మరో 3.72 లక్షల కొవిడ్‌ ‌టీకా డోసులు ఏపీకి చేరుకున్నాయి. పూణెళిలోని సీరం ఇనిస్టిట్యూట్‌ ‌నుంచి గన్నవరం విమానాశ్రయానికి కొవిషీల్డ్ ‌టీకా డోసులు చేరుకున్నాయి. ఢిల్లీ నుంచి ఎయిర్‌ ఇం‌డియా విమానంలో 31 బాక్సుల్లో రాష్టాన్రికి టీకా డోసులు తరలివచ్చాయి. తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్‌ను అధికారులు తరలించారు. అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో వ్యాక్సిన్‌ ‌జిల్లాలకు తరలివెళ్లనుంది. తాజాగా చేరుకున్న కొవిడ్‌ ‌టీకాలతో రాష్ట్రంలో నెలకొన్న వ్యాక్సిన్‌ ‌కొరతకు ఉపశమనం లభించింది. ఇదిలావుంటే ఇప్పటికే వ్యాక్సిన్‌ ‌ప్రక్రియ కోసం ప్రణాళికతోముందుకు వెళుతున్నారు. తాజాగా వచ్చిన వ్యాక్సిన్లతో రెండోడోసు కోసం ఎదురుచూస్తున్న వారికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలావుంటే కోవిడ్‌ ‌విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ ‌విశ్వభూషణ్‌ ‌హరిచందన్‌ ‌పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ ‌నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. కోవిడ్‌ ‌ప్రతికూల పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రజలు మొక్కవోని ధైర్యంతో వ్యవహరించి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించారని ఆయన ప్రశంసించారు. వైద్యులు, ఇతర వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది, రెడ్‌‌క్రాస్‌ ఇతర స్వచ్ఛంద సంస్థలు రాష్ట్రంలో కోవిడ్‌ ‌వ్యాప్తిని అరికట్టడంలో సమర్థవంతమైన సేవలందించారన్నారు.

Leave a Reply