దేశంలో నక్సలైట్ ఉద్యమం
పీడితజన మహా అధ్యాయం
నాడు వసంతకాల మేఘ గర్జన
సాయుధ పోరుపై తర్జన భర్జన
మన ఉస్మానియా రక్తచలనం
అడవి పోరుతో కరచాలనం
చదువులో పెద్ధమేటిగాండ్లు
జనం కోసం తుపాకి పట్టిండ్లు
వెనదిరుగక పోరాడిండ్లు
యవ్వనాన్ని ధారపోసిండ్లు
అమరత్వాన్ని వరించిండ్లు
ఎర్ర స్థూపాలై నిలిచిండ్లు
మేథో సంపత్తిని కోల్పోయింది!!
తెలంగాణ ఎంతో నష్టపోయింది!!!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్ జర్నలిస్ట్