Take a fresh look at your lifestyle.

పాటమ్మకు జెల్లకొట్టిండ్లు!

గప్పుడు ప్రజాయుద్ధ స్వరం మారింది
అటెంక లాల్ నీల్ జెండా చేతికొచ్చింది
పొడుస్తున్న పొద్దుయాల్లకు జారిపడ్డడు
తాను అసెంబ్లీ బాటలో ఆగమై పోయిండు
తను లింగమని నమ్మిండన్నడు
అతను లంగై పోయిండన్నడు
కోపమంతా పాటల ఎల్లగక్కిండు
సందు చూసి దొర చంకల్లో దూరిండు
గిట్ల జనం పాటకు జెల్లకొట్టిండ్లు
పదవి బిక్షకు కొంగు చాపిండ్లు
గొంతు కోసం పాటమ్మ వెదుకులాట!!
ఏ నిబద్ధుడితో తీరునో ఆమే దేవులాట!!
—-–కత్తెరశాల కుమారస్వామి
        సీనియర్ జర్నలిస్టు

Leave a Reply