Take a fresh look at your lifestyle.

కాశ్మీర్‌ ‌డిలిమిటేషన్‌ ‌సమర్థనీయమే

న్యూదిల్లీ, ఫిబ్రవరి 13 : దేశమంతా డి లిమిటేషన్‌ ‌జరిగినప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో జరగలేదు. ఇప్పుడు జరుగుతుందని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి వెల్లడించారు. జమ్మూకాశ్మీర్‌ను ఇతర రాష్టాల్రతో పోల్చవద్దన్నారు. జమ్మూకాశ్మీర్‌ ‌విషయంలో తప్పిదం జరిగింది కాబట్టి చట్టాలు మారుస్తున్నామని కిషన్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు.సోమవారం ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయినంత మాత్రాన డిలిమిటీషన్‌ ‌చేయాలనేది సబాబు కాదన్నారు.

పునర్విభజన చట్టాల్లో పెట్టినంత మాత్రాన అవుతుందా అని ప్రశ్నించారు. చట్టంలో చాలా పెట్టారని..దీనిపై చర్చ జరగకుండా రాశారని అన్నారు. బీజేపీ అధికారంలోకి రాక ముందు ఉన్న చట్టాల ఆధారంగా..జనాభా లెక్కల ఆధారంగా అసెంబ్లీ స్థానాల పెంపు జరుగుతుందని కిషన్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. కశ్మీర్‌లో చాలా చట్టాలు మారుస్తున్నారని, అంబేద్కర్‌ ‌రాజ్యాంగం అమలు అవుతుందని చెప్పారు.

Leave a Reply