Take a fresh look at your lifestyle.

కర్మ వీరులు…!

వాళ్ళు…
సామాన్యులు కాదు
దేహ సత్తును దేశానికి
దారబోసే త్యాగధనులు

బలహీనులు కాదు
నరాల నెత్తుటి ధారలు
జాతికి అర్పించే శ్రమశక్తులు

అమాయకులు కాదు
చెమట చుక్కల చిందించి
జగతికి వన్నెలద్దు వృత్తి శ్రేష్టులు

అనామకులు కాదు..
బురదలోంచి బువ్వ తీసి
జనత ఆకలి దీర్చే అన్నదాతలు

వాళ్ళు…
ఎండమావులు కాదు
నిండు ఒయాసిస్సులు

మిణుగురులు కాదు
స్వయం ప్రకాశితులు

రాలిపడే నింగి ఉల్కలు కాదు
వెలుగులు చిమ్మే  నేల తారకలు

పడమర అస్తమయాలు కాదు
తూరుపు ఉషోదయ కిరణాలు

వాళ్ళు….
శాంతి కాముకులు
స్వేచ్ఛ కాంక్షితులు
సమైక్య స్వాప్నికులు
విశ్వ మానవ ప్రేమికులు

వాళ్లే…
కార్మికులు , కర్షకులు
కష్టజీవులు, కర్మవీరులు
శ్రమ జీవన సౌందర్యాలు

– కోడిగూటి తిరుపతి
:9573929493

Leave a Reply