Take a fresh look at your lifestyle.

ఛైర్మన్‌, ‌మేయర్‌ల ఎన్నికలలో.. వివాదాలు, ఘర్షణలు

Karimnagar mayor, deputy mayor-elect on May 29
వాయిదా పడ్డ నేరేడుచెర్ల మున్సిపల్‌ ‌చైర్మన్‌ ఎన్నిక
  • 118 మున్సిపాలిటీల్లో చైర్మన్‌, ‌వైస్‌ ‌చైర్మన్‌, 9 ‌కార్పొరేషన్‌లలో మేయర్‌ ఎన్నక పూర్తి
  • నేరేడ్‌ ‌చర్ల, మేడ్చెల్‌లో ఎన్నిక వాయిదా
  • 29న కరీంనగర్‌లో…
  • ఎక్స్ ఆఫిసియో వోటు వివాదం
  • టీఆర్‌ఎస్‌పై బీజేపీ, కాంగ్రెస్‌ ‌విమర్శ

రాజకీయ ఘర్షణలు, ఉద్రిక్తతలు, వివాదాల మధ్య సోమవారం కార్పొరేషన్‌ల మేయర్‌, ‌మునిసిపల్‌ ‌చైర్మన్‌ల ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్‌ ‌సభ్యులు, ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సీలు మాజీ మంత్రులు ప్రత్యక్షంగా ఘర్షణలకు దిగడంతో రాజకీయ కోపతాపాలు తారస్థాయికి చేరుకున్నాయి. సాధారణంగా ప్రత్యక్షంగా ఒకరికొకరు తారసపడినప్పుడు భిన్న రాజకీయపక్షాలకు చెందినప్పటికీ ఉల్లాసంగా పలుకరించుకునే రాజకీయనాయకులు తమ శ్రేణుల గెలుపుకోసం బరిలోకి దిగారు. ఆదిభట్లలో ఎంపీ కోమటరెడ్డి వెంకటరెడ్డి, ఎంఎల్‌ఏ ‌మంచిరెడ్డి ల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకొని ఇద్దరినీ వేర్వేరుగా తీసుకపోవాల్సి వచ్చింది. చౌటుప్పల్‌లో కాంగ్రెస్‌ ‌శాసనసభ్యులు రాజగోపాలరెడ్డిని అరెస్టు చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా పోలింగ్‌ ‌జరిగిన ఆదిభట్లలో కాంగ్రెస్‌పార్టీకి చెందిన వార్డు సభ్యులు ఎక్కువవాతం గెలిచినప్పటికీ, కాంగ్రెస్‌ ‌చైర్మన్‌ అభ్యర్థికే గులాబీ కండుబా కప్పి ఆదిభట్ల మునిసిపాలిటీని టీఆర్‌ఎస్‌ఖాతాలోకి జమచేసుకున్నారు. కాగా ఇలాంటి రాజకీయ నాటకీయ పరిణామాల మధ్య 118 మునిసిపాలిటీల్లో చైర్మన్‌, ‌వైస్‌ ‌చైర్మన్‌, 9 ‌కార్పొరేషన్‌లలో మేయర్‌ ‌డిప్యూటీ మేయర్‌ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యింది. ఎన్నికైన వాటిలో 110 మునిసిపాలిటీల్లో, 10 కార్పొరేషన్‌లలో టీఆర్‌ఎస్‌ ‌జెండా రెపరెపలాడింది, నాలుగు మునిసిపాలిటీలను కాంగ్రెస్‌ ‌గెలుచుకున్నది,..రెండు బీజేపీ, రెండు ఎంఐఎం గెలుచుకున్నాయి. మేడ్చల్‌, ‌నేరేడుచర్ల లలో ఎన్నికలు రద్దయ్యాయి. చౌటుప్పల్‌ ‌కాం•గ్రెస్‌కు ఓటు వేస్తామని హామీ ఇచ్చిన ఇద్దరు వార్డు సభ్యులకు గులాబీ కండువా కప్పి చౌటుప్పల్‌ను టీఆర్‌ఎస్‌ ‌లెక్కలోకి తెచ్చుకున్నారు. ఇక ఎక్స్ ఆఫిసియో ఓటు వివాదాస్పదమైంది. ఎంపీలు, ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సీలు వేసే ఎక్ష్ అఫిసీయో ఓటు వివాదం ముదిరిపాకానపడటం బహుశా దేశ రాజకీయ చరిత్రలోనే విడ్డూరమని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నేరేరుడచర్ల మునిసిపాలిటీలో ఓటుహక్కు ఉపయోగించుకోవాలనుకున్న కేవీపీ రామచంద్రరావు ఓటు, టీఆర్‌ఎస్‌ ‌ప్రధానకార్యదర్శి కేశవరావు ఓటు, మాజీ మంత్రి కడియం శ్రీహరి ఓటు ఉద్రిక్తతలకు,ఘర్షణలకు, వివాదాలకు దారితీశాయి. అదేస్థాయిలో డిప్యూటీ మేయర్‌, ‌వైస్‌ ‌చైర్మన్‌ల ఎన్నికలు కూడా తోపులాటలతో యుద్ధవాతావరణం ఏర్పడటం గమనార్హం. ఈ వరుసలోనే తక్కుడూడా, భువనగిరి, బండ్లగూడా, ఫీర్జాదీగూడూ తదితర మునిసిపాలిటీల్లో గొడవలు జరిగాయి.నేరేడుచర్ల మేడ్చేల్‌ ‌మునిసిపాలిటీలలో చైర్మన్‌, ‌వైస్‌ ‌చైర్మన్‌ల ఎన్నికలు రద్దయ్యాయి. ఇంత గందరగోళం జరుగుతున్నా, రిటర్నింగ్‌ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో కాంగ్రెస్‌, ‌బీజేపీ శ్రేణులు అసహనానికి గురయ్యారు.కేపీపీ రామచంద్రరావు, కేశవరావుల ఎక్స్ఆఫిసియో ఓట్లపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, ‌సీనియర్‌ ‌బీజేపీ నాయకులు నల్లు ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు. డబ్బులు పోసి సిపీఎం వార్డు మెంబర్లను కొన్నదని, కాంగ్రెస్‌ ‌గెలిచే అవకాశాలు ఉన్న ప్రతీచోట నాటకీయ పరిణామాలు చోఉ చేసుకున్నాయి.హైదరాబాద్‌, ‌రంగారెడ్డి చుట్టూ ఉన్న బడంగ్‌పేట్‌, ‌మీర్‌పేట, బండ్లగూడాజాగీర్‌,‌బోడుప్పల్‌, ‌ఫీర్జాదిగూడా, జవహర్‌నగర్‌, ‌నిజాంపేటలపైన టీఆర్‌ఎస్‌ ‌పెద్దలు పూర్తిస్థాయిలో శ్రద్ధ తీసుకున్నారు. ఈ మునిసిపాలిటీలో ఎట్టిపరిస్థితిలో గులాబీజెండా ఎగరాలని ఆదేశాలు ఉండటంతో శాసనసభ్యులు మాజీ మంత్రులు, ఇతర టీఆర్‌ఎస్‌ ‌పెద్దలు రంగంలోకి దిగి రాష్ట్ర పెద్దల అభీష్టం ప్రకారం నడుచుకున్నారు.రంగారెడ్డి జిల్లాకు చెందిన పెద్దఅంబర్‌పేటలో ఘర్షణలు తీవ్రస్థాయిలో జరిగాయి. బలం లేనిచోట ఎక్స్అఫిసియో ఓటును ఉపయోగించి మునిసిపాలిటీలను కైవసం చేసుకోవడం అప్రజాస్వామికమని, అనైతికమని కోమటిరెడ్డి వెంటకరెడ్డి టీఆర్‌ఎస్‌ ‌పార్టీ నాయకులను తూర్పారపట్టారు. యాదగిరిలక్ష్మీనరసింహస్వామి సాక్షిగా సాక్షిగా టీఆర్‌ఎస్‌ అ‌క్రమాలకు, అవినీతికి, అనైతికతకు పాల్పడిందని మండిపడ్డారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ మునిసిపాలిటీలకోసం ఇంత దుర్మార్గాలకు పాల్పడాలా? అంటూ బీజేపీ నాయకులు ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలో ఫార్వర్డ్‌బ్లాక్‌ ‌నుంచి పోటీ చేసిన అభ్యర్థులందరూ టీఆర్‌ఎస్‌ ‌పిలుపును పరిగనణలోకి తీసుకొని టీఆర్‌ఎస్‌ ‌పార్టీ చైర్మన్‌లకు, వైస్‌చైర్మన్‌లకు ఓటువేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నిజామాబాద్‌ ‌కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్‌ ‌బీజేపీల మధ్య వివాదం అదుపుతప్పింది. తీవ్రస్థాయిలో వివాదాలు చెలరేగాయి. ఎన్నికల హాలులోకి ఇతర నియోజకవర్గాలకు చెందిన ఎంఎల్‌ఏలు వచ్చారని ఆరోపణలు వచ్చాయి.రాష్ట్రమంతటా ఇంత ఉద్రిక్తతలు జరిగినా, తెలంగాణభవన్‌లో ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన ఆ పార్టీ వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌మాట్లాడుతూ అంతా సవ్యంగానే జరిగిందని, 1999లో ఎన్టీఆర్‌, 2008‌లో వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి రూపొందించిన చట్టాల ప్రకారమే ఎక్స్ అఫిసియో ఓటు హక్కును ఉపయోగించుకున్నామని, తాము ఏ విధంగానూ చట్ట విరుద్ధంగా నడుచుకోలేదని వాదించారు. కాంగ్రెస్‌, ‌బీజేపీ అనైతికంగా పొత్తుపెట్టుకున్నాయని, విమర్శించారు. ప్రతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ‌బీజేపీ కలిసిపోయాయని, కాంగ్రెస్‌, ‌టీఆర్‌ఎస్‌ ‌కాంగ్రెస్‌ ‌కలిసిపోయాయని బీజేపీ విమర్శలు చేశారని, ఇప్పుడు ఇద్దరు కలిసి అసలు నిజాన్ని వెలుగులోకి తెచ్చారని ఎద్దేవా చేశారు. కాగా నాలుగు మునిసిపాలిటీల్లో గెలిచిన చైర్మన్‌లు, వైస్‌ ‌చైర్మన్‌లతో మంగళవారం కాంగ్రెస్‌ ‌రాష్ట్ర పెద్దలు ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు సమాచారం. మంత్రులు, టీఆర్‌ఎస్‌ ‌శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న మునిసిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ ‌విజయం సాధించడంతో ఆయా నియోజకవర్గాల మంత్రులు, శాసనసభ్యులు చాలా సంతోషంతో ఉన్నారు. ముఖ్యంగా తమ పదవులకు గండం తప్పిందని సంబరపడుతున్నారు.

29న కరీంనగర్‌ ‌మేయర్‌ ఎన్నిక:
ఈ నెల 29న కరీంనగర్‌ ‌మేయర్‌, ‌డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జరుగనున్నది. సోమవారం కరీంనగర్‌ ‌కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగాయి. 34 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిచారు. 11 డివిజన్లలో బీజేపీ పార్టీ అభ్యర్థులు నెగ్గారు.ఈ నేపథ్యంలోనే ముశీఏయర్‌ ఎన్నికలు జరుగనున్నాయి.

Tags: Karimnagar mayor, deputy mayor-elect on May 29,Karimnagar Mayer, Deputy Mayor

Leave a Reply