Take a fresh look at your lifestyle.

‘‘‌కరిగిన కాలం- చెదిరిన స్వప్నం’’

స్వప్న జగత్తులో విభ్రమకు రెక్కలొస్తే…
పొలాల్లోని పైర్లన్నీ పండు ముత్తయిదువుల్లా నిండుగా కనిపించాయి.విచ్చుకున్న కలువలన్నీ నీటిపై నాట్యమాడాయి.మూగవీణ సైతం మ్రోగుతుంటే ఎడారి లో సంద్రం ఏర్పడినట్టయింది.మోడువారిన వృక్షం చిగురు తొడిగినట్టయింది. శూన్యాకాశం సప్తపర్ణి తో శోభిల్లింది. బీడువారిన భూముల్లో మొలకెత్తిన బీజం ఆనందంతో ఆటలాడింది. తలెత్తి తాండవ మాడింది. చిగురు టాకులన్నీ చిద్విలాసం చేసాయి. పండుటాకులు సైతం పరవశించాయి. నూనూగు మీసాల నూత్న యవ్వనం తొలకరి చినుకుకు పరవశించిన ప్రకృతి లా తన్మయత్వంతో తాండవమాడింది. అడవిలోని నెమళ్ళన్నీ పురివిప్పి నాట్యమాడాయి. శీతల సమీరమేదో మనసును తాకింది.ఉచ్ఛ్వాస,నిశ్వాసాల వేగం పెరిగింది. అచ్చెరువుతో కనులు కనురెప్పలను మేల్కొలిపాయి.

కొక్కరో కో…అనే శబ్ధం వినిపించలేదు.అలారం మోగింది. తెల్లారిందని తెలిసింది. రాతిరి కల చెదిరింది. వాస్తవ విరుద్ధమైన భ్రమలా తోచింది. గడిచిన కాలం వర్తమానమై తిరిగి రావాలనే కలలో ఆశ ఇలలో సాధ్యమా? నవరసాలు ఒలికించే నవనాగరికంలో శృతి మించి పాకాన పడుతున్న ఆధునికత్వం మాయా మోహితులను చేస్తుంటే, ప్రకృతి కి చోటెక్కడ… మనిషికి నిలువ నీడెక్కడ…మునిగే నావకు రంధ్రం పడితే కాగల కార్యం గంధర్వులే తీర్చిన కథ ఆవిష్కృతమైనది.గతం కలలా కరిగింది- వర్తమానం ఇలలో శోఖించింది.
నిండా మునిగాక చలెక్కడ? విధ్వంసానికి విరుగుడెక్కడ?

– సుంకవల్లి సత్తిరాజు.9704903463.
(సామాజిక విశ్లేషకులు, కాలమిస్ట్)

Leave a Reply