Take a fresh look at your lifestyle.

శాకంబరిగా కనకదుర్గమ్మ

విజయవాడ,జులై 3 :  ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో శాకంబరీ ఉత్సవాలను ప్రారంభించారు. వివిధ రకాలైన కూరగాయలతో అమ్మవారిని అలంకరించారు. మూడు రోజులపాటు శాకంబరీ దేవిగా అమ్మవారి దర్శనం లభించనుంది. రోజుకి ఆరు వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.

అమ్మవారి దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌ ‌ద్వారా తీసుకునే వెసులుబాటును దేవస్థానం అధికారులు కల్పించారు. దుర్గమ్మకు నేటి నుంచి మూడురోజులపాటు శాకంబరి ఉత్సవాలు జరుగుతాయని ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎం.వి.సురేష్‌బాబు తెలిపారు. వివిధ రకాలైన కూరగాయలతో అమ్మవారి అలంకారం జరుగుతుందని, మూడు రోజుల పాటు అమ్మవారు శాకంబరి దేవిగా దర్శనమిస్తారని తెలిపారు.

Leave a Reply