Take a fresh look at your lifestyle.

పాక్‌ ‌ప్రేరేపిత ఉగ్రవాదంపై కమలాహ్యారిష్‌ ఆం‌దోళన

  • అమెరికా ఉపాధ్యక్షురాలితో మోడీ సమావేశం
  • ద్వైపాక్షిక అంశాలతో పాటు ఉగ్రవాదంపైనా చర్చ
  • భారత్‌ ‌పర్యటనకు రావాలని కమలను కోరిన మోడీ

అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌ ‌ప్రధానంగా ఉగ్రవాదంలో పాకిస్థాన్‌ ‌పాత్ర గురించి చర్చించారు. వైట్‌ ‌హౌస్‌లో జరిగిన సమావేశంలో ఇండో-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేయాలని ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నారు. పాకిస్థాన్‌లో పలు ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయని, ఈ విషయంలో ఇస్లామాబాద్‌ ‌పై చర్యలు తీసుకోవాలని కమలాహారిస్‌ ‌కోరారు. పాకిస్థాన్‌ ఉ‌గ్రవాదుల ప్రభావం అమెరికా, భారతదేశాలపై పడకుండా చర్యలు తీసుకోవాలని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌ ‌కోరారని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. దశాబ్దాలుగా భారతదేశం ఉగ్రవాద బాధిత దేశంగా ఉందని, ఉగ్రవాద గ్రూపులకు పాక్‌ ‌మద్ధతును నిశితంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని కమలాహారిస్‌ ‌ప్రధానమంత్రి మోదీతో వ్యాఖ్యానించారు. అమెరికా, భారతదేశాల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం రెండు దేశాల బాధ్యత అని కమలాహారిస్‌ ‌పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యం, అఫ్ఘానిస్థాన్‌, ఇం‌డో-పసిఫిక్‌ ‌వంటి ముప్పులతో సహా ఉమ్మడి ఆసక్తి ఉన్న ప్రపంచ సమస్యలపై ఇద్దరు నేతలు చర్చించారు. కోవిడ్‌ ‌మహమ్మారి ప్రబలిన సమయంలో భారతదేశానికి మద్ధతు అందించిన కమలాహారిస్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశాన్ని సందర్శించాలని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించారు. అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ‌మొదటి సారి భేటీ అయ్యారు. ఇరువురి మధ్య మొదటి రోజు పలు అంశాలు చర్చకు వొచ్చాయి. ఉగ్రవాద సమస్య గురించి మాట్లాడుతూ..హారిస్‌ ‌స్వయంగా పాకిస్థాన్‌ ‌ప్రస్తావనను తీసుకువచ్చారు.

ఉగ్రవాద సంస్థలకు ఆ దేశం మద్దతు ఇవ్వడం మానుకోవాలని ఈ సందర్భంగా హితవు పలికారు. దీనికి సంబంధించిన వివరాలను భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ ‌ష్రింగ్లా వి•డియాకు వెల్లడించారు. ‘ఉగ్రవాదం సమస్య చర్చకు వొచ్చినప్పుడు..అమెరికా ఉపాధ్యక్షురాలు పాకిస్థాన్‌ ‌పాత్రను స్వయంగా ప్రస్తావించారు. ఉగ్రసంస్థలకు పాకిస్థాన్‌ ఇస్తున్న మద్దతును నిశితంగా పర్యవేక్షించాల్సి ఉందన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలపై పాక్‌ ‌చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే కొన్ని దశాబ్దాలుగా భారత్‌ ‌బాధితురాలిగా ఉందని మోదీ వాస్తవాన్ని వెల్లడించగా ఆమె అంగీకరించారు’ అని ష్రింగ్లా వెల్లడించారు. అలాగే ఇటీవల చోటుచేసుకున్న పలు అంతర్జాతీయ పరిణామాలపై మోదీ, కమల తమ అభిప్రాయాలు పంచుకున్నారని చెప్పారు. మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా.. మొదటి రోజు కమలా హారిస్‌, ఆ‌స్ట్రేలియా, జపాన్‌ ‌ప్రధానులతో మోదీ సమావేశమయ్యారు. ప్రముఖ సంస్థల సీఈఓలతో చర్చలు జరిపారు. ఇక రెండో రోజు అధ్యక్షుడు జో బైడెన్‌, ‌క్వాడ్‌ ‌నేతలతో భేటీ కానున్నారు.

Leave a Reply