అమెరికాలో పుట్టిన కమలా హారిస్ ఆదేశపు రెండవ అత్యున్నత పదవి కి ( వైస్ ప్రెసిడెంట్ గా) ఎన్నికయ్యింది. అమెరికాలో పుట్టిన సుధా భరద్వాజ్ బెయిల్ కూడా దొరక్కుండా రెండేళ్లుగా భారత దేశ పు జైల్లో మగ్గుతోంది.కమలా హారిస్ తల్లి లాగానే సుధా భరద్వాజ్ తల్లి దండ్రులు కూడా అమెరికా వెళ్లి స్థిరపడ్డారు.కమలా హారిస్ బాగా చదువుకుంది.సుధా భరద్వాజ్ చాలా బాగా చదువుకుంది . కమలా హారిస్ అమెరికా పౌరురాలిగా స్థిరపడింది.సుధా భరద్వాజ్ అమెరికా పౌరసత్వాన్ని ఒదులుకుంది.కమలా హారిస్ పేద దేశాలపై పెత్తనం చెలాయించే ప్రపంచ పోలీస్ కు మార్గదర్శకం వహించనుంది.సుధా భరద్వాజ్ తన మూలాల్ని వెతుక్కుంటూ మాతృ భూమికి వచ్చింది.కమలా హారిస్ చుట్టూ కార్పోరేట్ సంపద.సుధా భరద్వాజ్ సంపదను, సదుపాయాలను ఒదులుకుని మాతృ భూమిలో పేదల హక్కుల కోసం ఏళ్ళ తరబడి పోరాడింది. కమలా హారిస్ అమెరికా వైస్ ప్రసిడెంట్ గా ఎన్నికయ్యే సరికి మన వాళ్ళలో ఎక్కడ లేని ఆనందం! పండగలు చేసుకున్నారు, సంబరాలు జరుపుకున్నారు.
సుధా భరద్వాజ్ రెండేళ్లుగా బెయిల్ కూడా దొరక్కుండా జైల్లో ఉంటే మనకు చీమ కట్టినట్టు కూడా అనిపించదు. కమలా హారిస్ మన కమ్మ వారి ఆడపడుచు అని ఫేస్బుక్ లో కొందరు ఆనంద పడిపోయారు.లేదు లేదు మన సద్ బ్రాహ్మణ యువతే నని మరి కొందరు పుండు పడేలా బరు క్కున్నారు.సుధా భరద్వాజ్ గురించి ఎవ్వరూ వాదులాడు కోలేదు.కనీసం ఆమె జైల్లో ఎన్ని అవస్థలు పడుతోందో నని చింతించ నూ లేదు. అస లామే మన దేశం కోసం పోరాడుతోం దని ఎంతమంది కి తెలుసు కనుక !?కమలా హారిస్ కానీ, ఆమె తల్లి కానీ మాతృ భూమి మీది వెనక్కి తిరిగి చూడలేదు.అయినా కమలా హారిస్ అంటేమనకు ఎంత ఇష్టమో చెప్పలేం!‘ నీ గెలుపే మా గెలుపు కాదా ! ‘అంటూ మన వాళ్ళు కూనిరాగాలు తీస్తారు!బాత్ రూం సాంగ్స్ పాడుకు ంటారు! పత్రికలు పతాక శీర్షికలు పె ట్టేస్తాయి. న్యూస్ చానెళ్ళు అయితే ‘ ఢము కు ఢమా.. ఢం కు ఢమా..’ సుధా భరద్వాజ్.. నీ వెనుక భాజా భజంత్రీలులేనందుకుసంతోషించు. నీకు బాసటగా ఆదివాసీలు ఉన్నారు. నా లాంటి గుప్పెడు మంది గుమ్మరించేఅక్షరాలున్నాయి.తల్లీ నీకు వందనాలు.
Source Facebook : (From Raghavasarma Aluru wall)