ఖమ్మం సిటి, మే 14 (ప్రజాతంత్ర విలేకరి) : ఖమ్మం నియోజకవర్గం పరిధిలోని మంజూరైన కళ్యాణలక్ష్మీ చెక్కులను ఖమ్మంలోని విడివోస్ కాలనీలోగల మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ గురువారం లబ్దిదారులకు పంపిణీ చేసారు. ఖమ్మం అర్బన్ పరిధిలోని 30, రఘునాధపాలెం మండల పరిధిలోని 17, చెక్కుల మొత్తం 47 చెక్కులకు గాను రూ. 47.52 లక్షల విలువ గల చెక్కులను ఆయన అందజేసారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ప్రభుత్వం ఈ కళ్యాణలక్ష్మీ పథకం అములచేస్తుందన్నారు. ఆడపిల్ల ఉప్న ప్రతి పేద కుటుంబానికి ఇది ఒక వరమని చెప్పారు. సిఎం కెసిఆర్ పేద కుటుంబానికి పెద్దకొ•డుకై ఈ పథకం ప్రయో•నాన్ని అందిస్తున్నాడని చెప్పారు.
ఈ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందన్నారు. అర్హులకే పథకాల ప్రయోజనాలు అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనర్హులకు ఒక్క పథకంకూడా అమలు అయ్యే ఆస్కారమేలేదన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని అన్నివిధాలుగా ఎదగాలన్నారు. పేదలకు అందిస్తున్న ప్రతి పథకం వెనుక సిఎం కెసిఆర్ మంచి మనసు ఉందని గుర్తు చేసారు. ఈ కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, డిప్యూటీ మేయర్ మురళి, తదితరులు పాల్గొన్నారు.