Take a fresh look at your lifestyle.

దేశంలోనే ఎక్కడా లేని విధంగా కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌

  • ‘ఆడపిల్లల పెండ్లిళ్లకు తోబుట్టువులా సిఎం కేసీఆర్‌’
  • ‌ప్రభుత్వ దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు..
  • ప్రైవేటుకు పోయి డబ్బులు వృథా చేసుకోవొద్దు
  • కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ ‌చెక్కుల పంపిణీలో మంత్రి హరీష్‌రావు
  • ప్రతి ఒక్కరూ కోవిడ్‌ ‌టీకా తీసుకోవాలి..నేనూ రెండు డోసులు తీసుకున్నా: మంత్రి హరీష్‌ ‌రావు

దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ ‌పథకం పేరిట లక్షా 116 రూపాయలు అందిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. సిఎం కేసీఆర్‌కు పెళ్లి చేస్తే ఎంత ఖర్చు అవుతుందో కేసీఆర్‌కు తెలుసునన్నారు. పెళ్లి చేసే ఆ బరువు తల్లికి తెలుసనీ…ఆర్థిక బాధలేమిటో తెలిసిన సిఎం కేసీఆర్‌ ‌ప్రతి పేదింటి ఆడపిల్ల పెండ్లికి ఓ తోబుట్టువులా తల్లి పేరిట కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ ‌కింద చెక్కుల పంపిణీకి శ్రీకారం చుట్టారన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో మంగళవారం కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ ‌కింద మంజూరైన చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని సిద్ధిపేట అర్బన్‌ ‌మండలంలో 112 మందికి రూ.1 కోటి 12 లక్షల 38 వేల 021 రూపాయల కళ్యాణ లక్ష్మీ, 30 మందికి రూ.30.03.480 లక్షల రూపాయల మేర మొత్తం 142 మందికి రూ.1 కోటి 42 లక్షల 41 వేల 501 కోట్ల రూపాయల కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ ‌చెక్కులు మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ…తల్లి బరువును దించేలా.. తోబుట్టువులా సిఎం కేసీఆర్‌ ‌ప్రతి పేదింటి పెళ్లికి కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ ‌చెక్కులు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పేదింటి ఆడ పిల్లల పాలిట కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ ఓ ‌వరమని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో అందిస్తున్నట్లు తెలిపారు. బిజెపి పాలిత రాష్ట్రమైన కర్ణాటక, కాంగ్రెస్‌, ‌శివసేన పార్టీల ప్రభుత్వం ఉన్న మహారాష్ట్రలో ఎక్కడ ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు లేవని చెప్పారు.

ప్రభుత్వ దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు..ప్రైవేటుకు పోయి డబ్బులు వృథా చేసుకోవొద్దు
సిద్ధిపేట ప్రభుత్వ దవాఖానాలో మెరుగైన వైద్యం అందిస్తూ, సిటి స్కాన్‌, ఐసీయూ, డయాలసిస్‌, ‌డయాగ్నోస్టిక్‌ ‌కేంద్రాలతో పాటు కోవిడ్‌ ఐసోలేషన్‌, ‌బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. ప్రయివేటు దవాఖానకు పోయి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు, సిద్ధిపేట ప్రభుత్వ దవాఖానాలో పేషేంట్‌ ‌బంధువుల కోసం వెయిటింగ్‌ ‌హాల్‌ అం‌దుబాటులో తెచ్చి, వేడి వేడి ఆహారం పెడుతున్నట్లు, ప్రభుత్వ దవాఖానలో లభించే వైద్య సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ప్రజలను కోరారు. ఆడ బిడ్డలకు ఓపికతో నార్మల్‌ ‌డెలివరీలు చేయించాలని, నార్మల్‌ ‌డెలివరీ ఆవశ్యకతపై తల్లులకు అవగాహన కల్పించారు.

ప్రతి ఒక్కరూ కోవిడ్‌ ‌టీకా తీసుకోవాలి..నేను రెండు డోసులు తీసుకున్నా..
కొరోనా అంటే భయం.. నిర్లక్ష్యం రెండూ వద్దనీ… జాగ్రత్త వహించాలనీ.. తానూ కోవిడ్‌ ‌టీకా రెండు డోసులు తీసుకున్నాననీ, కొరోనా వైరస్‌ ‌నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని ప్రజలకు మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. కొరోనా టీకాను 18 సంవత్సరాలు పైబడిన వారందరూ తీసుకోవాలని కోరారు. కొరోనా వ్యాక్సినేషన్‌ ‌పక్రియ వేగంగా కొనసాగుతున్నదని, ప్రభుత్వ సూచనల మేరకు ప్రజలంతా టీకా తీసుకోవాలన్నారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా కొరోనా మహమ్మారిపై విజయం సాధించలేమని, అందరూ కొరోనా జాగ్రత్తలు పాటించాలన్నారు. కొరోనా టీకా వేయించుకున్నవారు నిర్లక్ష్యం వహించవద్దని సూచిస్తూ.. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, పౌరులు విధిగా తమ బాధ్యతగా తమ ప్రాంతంలోని ప్రజలందరూ కోవిడ్‌ ‌టీకా వేయించుకునేలా ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో సుడా ఛైర్మన్‌ ‌మారెడ్డి రవీందర్‌రెడ్డి, డైరెక్టర్‌ ‌మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, మునిసిపల్‌ ‌మాజీ ఛైర్మన్‌ ‌కడవేర్గు రాజనర్సు, సిద్ధిపేట అర్బన్‌ ‌తహశీల్దార్‌ ‌విజయ్‌తో పాటు పలువురు మునిసిపల్‌ ‌కౌన్సిలర్లు, నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలు, గ్రామ ప్రజాప్రతినిధుల తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply