Take a fresh look at your lifestyle.

‌ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే కల్వకుర్తి పంప్‌ ‌హౌస్‌ ‌ఘటన

వేల కోట్ల నష్టానికి మానవ తప్పిదమే కారణం
పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి

కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో పంపులు పేలిపోయి వేల కోట్ల రూపాయల నష్టానికి మానవ తప్పిదమే కారణమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అన్నారు. 20 జూన్‌ 2016‌లో నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. శనివారం జూమ్‌ ‌యాప్‌ ‌ద్వారా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కల్వకుర్తి పంప్‌ ‌హౌస్‌కు 400 మీటర్ల దూరంలోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అండర్‌ ‌గ్రౌండ్‌ ‌తవ్వకాలు చేస్తున్నారని అక్కడ బ్లాస్టింగ్ల వల్లనే ఇంత పెద్ద నష్టం జరిగిందన్నారు.

ఇందుకు పూర్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌బాధ్యత వహించి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు.14 అంతస్తుల కల్వకుర్తి పంప్‌ ‌హౌస్‌లో 10 అంతస్తులు నీటితో మునిగిపోయాయని రాష్ట్రంలో ప్రాజెక్టులతో కాలువలు నిండడం లేదు కానీ కమిషన్లలతో కల్వకుంట్ల జేబులు నిండుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply