నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. కవిత 672 ఓట్ల భారీ మెజార్టీతో తన సమీప బీజేపీ అభ్యర్థి పీ. లక్ష్మీనారాయణ పై ఘనవిజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు 728 వోట్లు పోలవగా, బిజెపి కి 56 , కాంగ్రెస్కు 29 వోట్లు పోలయ్యాయి. 10 వోట్లు చెల్లకుండా పోయాయని చెప్పారు. ఇదిలా ఉండగా బిజెపి కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదన్నారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత భారీ మెజార్టీతో విజయం సాధించడంతో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తల్లో ఆనందం వ్యక్తమవుతోంది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంత భారీ మెజార్టీతో ఎమ్మెల్సీగా గెలిచి కల్వకుంట్ల కవిత చరిత్ర సృష్టించారు.