Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం

  • కెసిఆర్‌ ‌వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించడం దారుణం
  • రాష్ట్ర ప్రభుత్వంపై బిజెపి సీనియర్‌ ‌నేత లక్ష్మణ్‌ ‌మండిపాటుు

తెలంగాణలో అంబేడ్కర్‌ ‌రాజ్యాంగం కాకుండా.. కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతోందని బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ‌విమర్శించారు. హైదరాబాద్‌లో ఆయన డియాతో మాట్లాడుతూ ‘ఢిల్లీ వెళ్ళిన కేసీఆర్‌ ‌రైతులకు ఎందుకు మద్ధతు తెలపలేదో చెప్పాలి.  హైదరాబాద్‌లో అరుపులు.. ఢిల్లీలో కాళ్ళు పట్టుకోవడం కేసీఆర్‌కు అలవాటే. వంగి వంగి దండాలు పెడ్తోన్న కేసీఆర్‌ ‌తీరు ప్రజలకు అర్థమైంది’ అన్నారు.  రైతుల ఉద్యమానికి కేసీఆర్‌ ‌వంత పాడటం సిగ్గుచేటన్నారు. సన్నవడ్లను కొనుగోలు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యిందని, సీఎం కేసీఆర్‌ ‌దలారులకు వంత పాడటం హాస్యాస్పదమని, వారి జేబులు నింపటానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. భూసార పరీక్షల కోసం కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్‌ ‌పక్కదారి పట్టించారని మండిపడ్డారు. తెలంగాణలో ఉద్యోగ సంఘాలు కేసీఆర్‌కు భజన సంఘాలుగా మారిపోయాయని, ఉస్మానియా యూనివర్సిటీలో సురేష్‌ ‌యాదవ్‌పై దాడిని ఖండిస్తున్నామన్నారు.

ప్రశ్నిస్తే విద్యార్థులపై దాడులు చేస్తారా? అని నిలదీసారు.  డబుల్‌ ‌బెడ్‌ ‌డూమ్‌ ఇళ్ళపై సర్కార్‌ ‌మాట తప్పిందని, రాష్ట్రంలో ఎదురుగాలి వీస్తోన్నందునే ఉద్యోగాల భర్తీ అంటున్నారని, గొర్రెల పంపిణీలో కేసీఆర్‌ ‌ప్రభుత్వం విఫలమయ్యిందని దుయ్యబట్టారు. కొత్త వ్యవసాయ చట్టంతో రైతులకు మేలని, పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్చ రైతుకిస్తే తప్పేంటని లక్ష్మణ్‌ ‌ప్రశ్నించారు. పివి సంస్కరణలను కూడా వ్యతిరేకించిన ఘనత కమ్యూనిస్టులదన్నారు. వారు కంప్యూటర్లను కూడా వ్యతిరేకించారని గుర్తు చేశారు.

Leave a Reply