Take a fresh look at your lifestyle.

టీచర్స్ ఎమ్మెల్సీగా కల్పలత ప్రమాణ స్వీకారం

  • ప్రమాణం చేయించిన మండలి ఛైర్మన్‌ ‌షరీఫ్‌
  • ‌టీచర్ల సమస్యలకు కృషి చేస్తానని హావి

ఆం‌ధ ్రదేశ్‌ ‌శాసనమండలి  సభ్యురాలిగా టి.కల్పలత బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ప్రాంగ ణంలోని  శాసనమండలి చైర్మన్‌ ఎం.ఎ. ‌షరీఫ్‌ ‌సమక్షలో ఆమె ప్రమాణం చేశారు. గుంటూరు- కృష్ణా జిల్లాల స్వతంత్ర  టీచర్స్ ఎమ్మెల్సీ నూతన సభ్యురాలిగా ఇటీవల కల్పలత  ఎన్నిక కాగా షరీఫ్‌ ‌ప్రమాణం చేయించారు. అనంతరం ఆమెకు శుభాకాంక్షలు తెలిపి,శాసన మండలికి సంబం ధించిన నియమ, నిబంధనలు, కార్యకలాపాల పత్రాలను అందజే శారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి  అదిమూలపు సురేష్‌ ,అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు, అసెంబ్లీ  ఒఎస్‌డి కె.సత్యనారాయణ, అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీ  విజయరాజు, ఆంధప్రదేశ్‌ ‌సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు  కె.వెంకటరామిరెడ్డి, నూతన ఎమ్మెల్సీ  కుటుంబ సభ్యులు  పాల్గొన్నారు. గుంటూరు,కృష్ణా జిల్లాల శాసన మండలి సభ్యురాలిగా తనపై నమ్మకం ఉంచి గెలిపించిన టీచర్లకు నూతన శాసన  కల్పలత ధన్యావాదాలు తెలిపారు. ప్రమాణం అనంతరం శాసనమండలి ప్రాంగణంలో ఆమె వి•డియాతో మాట్లాడారు. తన గెలుపుకు కృషిచేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రచార సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హావి•లను నెరవేర్చేందుకు పని చేస్తానని అన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ ‌జగన్మోహన్‌ ‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌లకు ఆమె రుణపడి ఉంటానన్నారు. ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్, ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల సమస్యలు,మోడల్‌ ‌స్కూల్స్,‌కస్తూరి బా స్కూల్స్, ‌కాంట్రాక్టు ఉపాధ్యాయులు,టీచర్లు,ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పని చేస్తానని పేర్కొన్నారు.తన గెలుపు కోసం 43 ఉపాధ్యాయ సంఘాలు పనిచేశాయని అందుకు సర్వదా రుణపడి విద్యాభివృద్ధికి కృషిచేస్తానని వెల్లడించారు.

Leave a Reply