టిఎన్ జిఓస్ ఆధ్వర్యంలో స్థానిక అధ్యక్షులు మరియు యు.ఎస్ అసోసియేట్ ప్రెసిడెంట్ డెక్క నరసింహారావు, కటుకూరి నాగభూషణం ఆధ్వర్యంలోలో బుధవారం కాళోజి నారాయణ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ మరియు అసోసియేట్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ కాలోజి సేవలు తెలంగాణ ప్రజలు మరువలేనివని కొనియాడారు. భావితరాలు నిస్వార్ధంగా కాలోజీ అడుగుజాడల్లో నడవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ గగ్గూరి బాలకృష్ణ , గజ్జెల్లి శ్రీనివాస్, వడిగా నరసింహారావు , రామకృష్ణ, అంజి బాబు అన్వర్ తదితరులు పాల్గొన్నారు.
గ్రంధాలయం ఆధ్వర్యంలో :శాఖా గ్రంధాలయం భద్రాచలం కాళోజీ నారాయణ రావు 86వ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డాక్టర్ శ్రీనివాస్ మణుగూరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కాళోజీ చిత్రపటానికి పూల మాలవేసి అంజలి ఘటిం చారు. ఆయన మాట్లాడుతూ ప్రజాకవి కాళోజి నారాయణ రావు ఆయన పుట్టినరోజు సందర్బంగా తెలంగాణ భాషాదినోత్సవం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంగా ప్రకటించటం కాళోజికి ఘన నివాళి అన్నారు. ప్రజా కవిత తెలంగాణ యాసలో ప్రజలకు అర్ధం అయ్యే రీతిలో కవితలు రాసి సమాజ కవి అనిపించుకున్నారని వీరు వరంగల్ జిల్లా మడిగొండ సెప్టెంబర్ 9, 1914 లో జన్మించారని అన్నారు. ఆయన బాల్యం నుండే తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజల్లో చైతన్యం పరిచే విధంగా ఆయన పాటలు పద్యాలు ఉండేవని వారి త్యాగాల ఫలితమే నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కాళోజి చరిత్ర చదువుకుని మంచి మార్గంలో ఉండాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో డా. శ్రీనివాస్, గ్రంధాలయ చైర్మన్, మామిడి పుల్లారావు, గ్రంధపాలకులు జానీ , పూర్ణచందర్రావు, సీతమ్మ, మహేష్ , పాల్గొన్నారు.
పినపాక లో:మండలంలోని యంపిడిఓ కార్యాలయం, అటవీశాఖ, పోలీసు శాఖ కార్యాల యంలో ప్రజాకవి కాళోజి 106వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా యంపిపి గుమ్మడి గాంధీ, సిఐ దోమల రమేష్, ఎఫ్ఆర్వో వెంకటేశ్వర్లు వారి చిత్రపటానికి పూలమాలవేసి తెలంగాణకు చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా తెలంగాణయాస, భాషా పరిరక్షణకు కృషి చేయడంతో పాటు, తన కవితల ద్వారా ప్రజల్లో ఉద్యమ చైతన్యం నింపిన మహనీయుడు కాళోజీ నారాయణ రావు అని వారి రచనల స్ఫూర్తి ఉద్యమానికి మరింత బలాన్ని, చైతన్యం నింపిందన్నారు. తెలంగాణ భాషకి తగిన గుర్తింపు కోసం తన రచనల ద్వారా ప్రజల్లోకి చురుగ్గా పంపగలిగారని వారి ఆశయ సాధన కు ప్రతి ఒక్కరు కృషి చేయా లని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శ్రీనివా సులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు దాట్ల వాసు బాబు, ఉడుముల లక్ష్మిరెడ్డి, ఎఫ్బిఓ లక్ష్మణ్, జూనియర్ అసిస్టెంట్ క్రాంతి కుమార్, డీఈవో సాంబశివ రావు,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
బూర్గంపాడు లో: మండల కేంద్రమైన బూర్గంపాడు తాసిల్దార్ కార్యాలయంలో తెలంగాణ వై• •ళికులు ప్రజాకవి భాషా పండితుడు కాళోజీరావు జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా తాసిల్దార్ కిషోర్ కాళోజీ రావ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం కాళోజీ అనేక కవితలు పాటలు రాసి ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. ఆయన స్ఫూర్తి పలువురికి ఆదర్శం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వరరావు ,జూనియర్ అసిస్టెంట్ పరమేష్ ,ఆర్ ఐ శంకర్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెంలో :ప్రముఖ ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను బుదవారం ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ ముత్యాలరావు, తహశీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ ఆదినా రాయణ, కొత్తపల్లి ఆశ్రమ పాఠశాలలో ప్రదానోపాద్యాయుడు మడకం మోతీర్లతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలు, పా• ••శాలలో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ బాష కు యాసకు చెరగని ముద్ర కాళోజీ నారాయణరావు అని కొనియా డారు.ఈ కార్యక్రమంలో ఆయా కార్యాలయాల సిబ్బంది ప్గాన్నారు.