Take a fresh look at your lifestyle.

అన్యాయాన్ని ఎదిరించిన ధిక్కార స్వరం కాళోజి

రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945లో పరిషత్తు ద్వితీయ మహాసభలను  నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్యసాహసాలను ఆయన అభిమానులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు. వరంగల్‌ ‌కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు ఆయనను నగరం నుంచీ బహిష్కరించారు   1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. 1958 లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి  శాసనమండలికి ఎన్నికయ్యారు. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌, ‌భారత ప్రభుత్వం పద్మవిభూషణ్‌ అవార్డుతో సత్కరించాయి.

‘‘తెలుగు బిడ్డవు రోరి తెలుగు మాట్లాడుటకు సంకోచ పడియెదవు సంగతేమిటిరా? అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడ!   చావవేటికిరా…’’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు. ప్రముఖ కవి, రచయిత మాటల మాంత్రికుడు, అందరి గొడవను తన గొడవ గా భావించిన అక్షర యోధుడు,  మన కాళోజీ నారాయణ రావు తెలంగాణ ప్రజల ప్రతి ఉద్యమానికీ ప్రతిధ్వనిగా నిలిచారు.   ఆయన రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం. హక్కులడిగిన ప్రజల మనిషి. ఉద్యమం నడిపిన ప్రజావాది. తెలంగాణ జీవిత చలనశీలి, ప్రజాకవి, బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు. వైతాళికుడు. నిజాం నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా కలం ఝళిపించారు. స్వాతంత్య్ర  సమరయోధుడు, తెలంగాణా   ఉద్యమకారుడు.

‘‘కాళోజీ – కాళన్న’’ గా సుపరిచితులైన రఘువీర్‌ ‌నారాయణ్‌ ‌లక్ష్మీకాంత్‌ ‌శ్రీనివాసరాం రాజా కాళోజీ సెప్టెంబరు 9, 1914న    కర్ణాటక రాష్ట్రం, బీజాపూర్‌ ‌జిల్లా లోని రట్టిహళ్లిలో రమాబాయమ్మ – రంగారావు దంపతులకు జన్మించారు. తల్లి కన్నడిగుల ఆడపడుచు. తండ్రి మహారాష్ట్రీయుడు. కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషుభాషల్లో రచయితగా వన్నెకెక్కారు. రాజకీయ వ్యంగ్య కవిత్వం వ్రాయడంలో దిట్ట. ‘నా గొడవ’ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా,  స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా పేరుపొందారు. కాళోజీ కుటుంబం బీజాపూర్‌ ‌నుంచి తరలివచ్చి వరంగల్‌ ‌జిల్లా మడికొండ లో స్థిరపడింది. హైదరాబాదు పాతబస్తీ  చౌమహల్‌ ‌న్యాయపాఠశాలలో, ఆతరువాత  సిటీ కాలేజీ లోకాళోజి విద్యాభ్యాసం సాగింది.

1939 లో హైదరాబాదు హైకోర్టుకు అనుబంధ న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1930 నుంచే కాళోజీ గ్రంథాలయోద్యమం లో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు.  సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలుశిక్ష అనుభవించారు. నిజామాంధ్ర మహాసభ, హైదరాబాదు స్టేట్‌ ‌కాంగ్రెసుతో ఆయన అనుబంధం విడదీయరానిది. 1940 లో రుక్మిణీబాయిని వివాహమాడారు. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పి.వి.నరసింహారావువంటి వారితో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న లక్ష్యంతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకరు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ ఆకాంక్ష.

రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945లో పరిషత్తు ద్వితీయ మహాసభలను  నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్యసాహసాలను ఆయన అభిమానులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు. వరంగల్‌ ‌కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు ఆయనను నగరం నుంచీ బహిష్కరించారు   1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. 1958 లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి  శాసనమండలికి ఎన్నికయ్యారు. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌, ‌భారత ప్రభుత్వం పద్మవిభూషణ్‌ అవార్డుతో సత్కరించాయి.

కాళోజీ 2002 నవంబరు 13 న తుదిశ్వాస విడిచారు. ఆంధప్రడేశ్‌ ‌లెజిస్లేటివ్‌ ‌కౌన్సి ల్‌ ‌స్వతంత్ర సభ్యుడిగా 1958 నుండి 60 వరకు కొనసాగారు.. ‘‘ఆంధ్ర సారస్వత పరిషత్‌’’ ‌వ్యవస్థాపక సభ్యుడు. ఆంధప్రదేశ్‌ ‌సాహిత్య అకాడెమీ సభ్యుడు. తెలంగాణ రచయితల సంఘం అధ్యకునిగా,   గ్లోసరీ కమిటీ సభ్యునిగా  ఉన్నారు. 1977లో సత్తుపల్లి (ఖమ్మం జిల్లా) నుండి స్వతంత్ర అభ్యర్థిగా జలగం వెంగళరావు పై పోటీ చేసి ఓడిపోయారు. ఆంధప్రదేశ్‌ ఏర్పడినపుడు పాములపర్తి సదాశివరావుతో కలిసి తెలంగాణా ప్రత్యేక సంచిక వెలువరించారు. విశాలాంధ్ర కావాలనీ కోరారు.  ప్రత్యేక తెలంగాణా కావాలనీ వాదించిన ధీశాలి కాళోజీ మాత్రమే.  పి.వి.నరసింహారావు లాంటి ఎందరికో సాహిత్య, రాజకీయ రంగాల్లో మార్గదర్శనం చేశారు. భాష రెండు తీర్లు – ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకు బడుల భాష. పలుకు బడుల భాషగావాలె, అని వాదించారు.

తన ఖండకావ్య సంపుటానికి ‘నా గొడవ’ అని పేరు పెట్టారు. ఒక్క సిరాచుక్క లక్షల మెదళ్లకు కదలిక. పుటక నీది-చావు నీది-బతుకంతా దేశానిదీ •-ఇలాంటి ఎన్నో మాటలు చెప్పిన కాళోజీ. ఈయన జయంతిని తెలంగాణ మాండలిక భాషా దినోత్సవంగా పాటిస్తారు. కొవిడ్‌ ‌సమయంలో  సామాజిక దూరం పాటిస్తు వర్ధంతి నిర్వహిస్తున్నారు.
కామిడి సతీశ్‌ ‌రెడ్డీ, జడలపేట, జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా, 9848445134

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply