Take a fresh look at your lifestyle.

‌ప్రజల గొంతుకగా నిలిచిన కాళోజీ

జయంతి సందర్భంగా నివాళి అర్పించిన సిఎం కెసిఆర్‌

ప్రజల గొంతుకగా జీవితాంతం బతికిన కాళోజీ నారాయణరావు ఎప్పటికీ చిరస్మరణీయుడే అని సిఎం కెసిఆర్‌
‌పేర్కొన్నారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు 106వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నివాళులర్పించారు. ప్రజల్లో చైతన్య దీప్తి వెలిగించడానికి ఆయన ధైర్యంగా నిలబడే వారు అని సీఎం కేసీఆర్‌ ‌గుర్తు చేశారు. రవీంద్ర భారతిలో ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ భాషా సాంస్క•తిక శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి సాంస్క•తిక శాఖ మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌పూలమాల వేసి నివాళులర్పించారు.  పుటక నీది చావు నీది. బతుకంతా దేశానిది అని మనిషి ధర్మాన్ని ఎలుగెత్తి చాటిన మానవతావాది కాళోజీ అని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా శాసన మండలిలో మంత్రి కాళోజీ చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు.
ప్రజల్లో చైతన్య దీప్తి వెలిగించడానికి ఆయన ధైర్యంగా పోరాడారని మంత్రి తెలిపారు. కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజాకవి కాళోజీ తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేశారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భూమి పుత్రుడు, ప్రజాకవి కాళోజీ జన్మదినం సందర్భంగా మంత్రి ట్విటర్‌ ‌ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తన కవిత్వంతో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించారని అన్నారు. మన తెలంగాణ భాషను, యాసలోని మాధుర్యాన్ని తన రచనలతో ఎలుగెత్తి చాటారని కొనియాడారు. భాష రెండు విధాలుగా ఉంటుందని, ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకుబడుల భాష అని.. పలుకుబడుల భాష కావాలని చెప్పిన తెలంగాణ వైతాళికుడు కాళోజీ అని అన్నారు.
భాషను, యాసలోని కమ్మదనాన్ని తెలియజెప్పిన మహాకవి కాళోజి : హరీష్‌ ‌రావు
ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతిని ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు రాష్ట్ర ప్రజలకు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మన యాసల్నే మన బతుకున్నది..నీ భాషల్నే నీ బతుకున్నది..నీ యాసల్నే నీ సంస్క•తున్నది..అంటూ తెలంగాణ భాషను, యాసలోని కమ్మదనాన్ని ప్రపంచానికి తెలియజెప్పిన మహాకవి కాళోజి హరీష్‌ అని కొనియాడారు.

Leave a Reply