Take a fresh look at your lifestyle.

కాళేశ్వరం నీళ్లు .. పల్లెలకు చేరుకుంటున్నాయ్‌…

  • రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం
  • రైతులు భౌతిక దూరం పాటించాలి : తీగుల్‌లో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో  రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు

రైతుల కలల ప్రాజెక్టు అయినా కాలేశ్వరం నీళ్లు పల్లెలకు చేరుకుంటాయని, దీంతో బీడు భూములు పచ్చని మగాణిగా మారడం ఎంతో దూరంలో లేవనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. సోమవారం సిద్ధిపేట జిల్లాలోని జగదేవ్‌పూర్‌ ‌మండలం తీగుల్‌ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ…రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ఈసారి యాసంగి సీజన్‌లో 40 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో మొత్తం రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు 7వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధ్యానం తెచ్చేటప్పుడు నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. అలాగే టోకన్ల ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులు సహకరించాలని కోరారు.

ప్రస్తుతం కొరోనా వైరస్‌ ‌ప్రభావం ఉన్నందున రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించాలని, అలాగే వైరస్‌ ‌రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 24 గంటల్లోనే ధ్యానం డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ఫారెస్ట్ ‌కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌ప్రతాప్‌ ‌రెడ్డి, గఢా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, ఎంపిపి బాలేషంగౌడ్‌, ‌జడ్పిటిసి సభ్యుడు వంటేరు సుధాకర్‌ ‌రెడ్డి, పిఏసిఎస్‌ ‌చైర్మన్‌ ఇం‌ద్రసేనారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కో అర్డినేటర్‌ ‌జంబుల శ్రీనివాస్‌ ‌రెడ్డి, జిల్లా సభ్యులు పనుగట్ల శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ఎం‌పీపీ ఉపాధ్యక్షుడు భగవాన్‌, ‌కో అప్షన్‌ ‌సభ్యులు ఎక్బాల్‌, ‌టిఆర్‌ఎస్‌ ‌మండ) శాఖ అధ్యక్షుడు గుండా రంగారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు కప్పర భానుప్రకాష్‌ ‌రావు, కొత్త లక్ష్మీ శ్రీనివాస్‌ ‌రెడ్డి, రజిత రాజిరెడ్డి, నరేష్‌, ‌కనకయ్య, చంద్రశేఖర్‌, ‌సత్యం, కుమార్‌, ఎం‌పిటీసిలు బట్టు మంజుల మహేందర్‌ ‌రెడ్డి, కొత్త కవిత శ్రీనివాస్‌ ‌రెడ్డి, స్రవంతి శ్రీనివాస్‌, ‌కావ్య దర్గయ్య, డైరెక్టర్‌ ‌లు భూమయ్య, యాదయ్య, యశ్వంత్‌ ‌రెడ్డి, ఉప సర్పంచ్‌ ‌లు ఐలయ్య, మల్లేశం, అజాం, నాయకులు హరిగౌడ్‌, ‌బాలకిషన్‌, ‌బుద్ద మహేందర్‌, ‌సంతోష్‌ ‌రెడ్డి, లక్ష్మణ్‌ ‌రాజ్‌, ‌బట్టు దయానంద్‌ ‌రెడ్డి, మధుచారి, బట్టు సుధాకర్‌ ‌రెడ్డి, ఎల్లయ్య, అమరేందర్‌ ‌రెడ్డి, కోటయ్య, విజయేందర్‌ ‌రెడ్డి, లక్ష్మణ్‌, ‌రాజు, సత్యం, ఎంపిడివో రామారావు, డిప్యూటీ తహశీల్దారు కరుణాకర్‌ ‌రావు, ఐకెపి ఏపిఎం ఆనంద్‌, ‌డిసిసిబి బ్యాంకు మేనేజర్‌ ‌నాగభూషణం, పిఏసిఎస్‌ ‌సిఈఓ రాములు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply