Take a fresh look at your lifestyle.

తెలంగాణ సొంత నిధులతోనే కాళేశ్వరం నిర్మాణం

  • ప్రాజెక్ట్‌కు ఇప్పటికి అందిన నిధులు రు.59.53 కోట్లు
  • ప్రభుత్వం సమీకరించాలనుకున్నవి రూ.86.06 కోట్లు
  • లోక్‌ ‌సభలో కాంగ్రెస్‌ ఎం‌పి ఉత్తమ్‌ ‌ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబు

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, న్యూ దిల్లీ, డిసెంబర్‌ 16 : ‌కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్ట్‌ను, జలశక్తి మంత్రిత్వ శాఖ నీటిపారుదల, వరద నియంత్రణ మరియు బహుళార్ధసాధక ప్రాజెక్టుల సలహా కమిటీ జూన్‌, 2018‌లో ఆమోదించింది. ఈ ప్రాజెక్ట్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన సొంత వనరులతో కట్టుకుంటున్నది. రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివరాలు మేరకు, లంప్సమ్‌ ‌కాంట్రాక్ట్ ‌విధానం ఆధారంగా ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ ‌ప్లాట్‌ఫారమ్‌లో ప్రాజెక్ట్ ‌కోసం టెండర్లను తెలంగాణ ప్రభుత్వం పిలిచింది. రాష్ట్ర ప్రభుత్వ వివరాల ప్రకారం…కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్ట్‌లో అక్టోబర్‌ ‌వరకు 83.7 శాతం పూర్తయ్యింది. ప్రాజెక్ట్ ‌కింద నీటిపారుదల కొరకు ప్రతిపాదించబడిన మొత్తం కమాండ్‌ ఏరియా 18,25,700 ఎకరాలు. అదనంగా, 18,82,970 ఎకరాల విస్తీర్ణంలో స్థిరీకరణ జరగాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ప్రాజెక్టులోకి లిఫ్ట్ ‌చేసి సరఫరా చేయాలనుకున్న మొత్తం నీటి పరిమాణం 240 టిఎంసిలని కేంద్రానికి తెలిపింది.

ప్రాజెక్టు ద్వారా కరీంనగర్‌, ‌రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్‌, ‌యాదాద్రి-భోనగిరి, నల్గొండ, సంగారెడ్డి, నిజామాబాద్‌, ‌జగిత్యాల్‌, ‌కామారెడ్డి, నిర్మల్‌, ‌మేడ్చల్‌, ‌పెద్దపల్లి తదితర పదమూడు జిల్లాల్లోని వివిధ ప్రాంతాలలో కొత్త ఆయకట్టును ప్రతిపాదించారు. ప్రాజెక్ట్‌పై ఇప్పటి వరకు ఖర్చు చేసిన మొత్తం ఖర్చు 80,321.57 కోట్లు. ప్రాజెక్ట్‌కు యూనియన్‌ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌డియా కన్సార్టియం 7,400 కోట్లు, పంజాబ్‌ ‌నేషనల్‌ ‌బ్యాంక్‌ 11,355.20 ‌కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ ‌బరోడా 2,150 కోట్లు, పవర్‌ ‌ఫైనాన్స్ ‌కార్పొరేషన్‌ 23,584.72 ‌కోట్లు. రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ ‌కార్పొరేషన్‌ ‌లిమిటెడ్‌ 9,633.65 ‌కోట్లు, నాబార్డ్ 5,415.94 ‌కోట్లు సమకూర్చింది. జూన్‌, 2018‌లో జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన నీటిపారుదల, వరద నియంత్రణ మరియు బహుళార్ధ సాధక ప్రాజెక్టుల సలహా కమిటీ కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 80,190.46 కోట్లకు(2015-16) ఖరారు చేసింది. బెనిఫిట్‌ ‌కాస్ట్ ‌రేషియో 1.51గా చెప్పింది. అయితే, దీని తర్వాత ప్రాజెక్ట్ ‌తదుపరి అదనపు ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం సలహా కమిటీ పరిశీలనకు ఇంతవరకు పంపలేదని కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్‌ ఎం‌పి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అడిగిన ప్రశ్నకి లోక్‌ ‌సభలో కేంద్రం సమాధానం ఇచ్చింది.

Leave a Reply