Take a fresh look at your lifestyle.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో అదనంగా.. లక్ష ఎకరాల సాగు

  • వ్యవసాయ రంగంలో విప్లవాత్మక, గుణాత్మక మార్పులు
  • మోతాదుకు మించి ఎరువులు వాడొద్దు
  • సిఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో అన్నింటా ముందంజ
  • త్వరలో జిల్లాలో మెగా ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌జోన్ల ఏర్పాటు: మంత్రి హరీష్‌రావు

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో  సిద్ధిపేట జిల్లా అన్ని రంగాలలో ముందంజలో ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శనివారం 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తొలుత సిద్ధిపేటలోని తన నివాసంలో, అటు తర్వాత కలెక్టరేట్‌ ‌కార్యాలయంలో మంత్రి హరీష్‌రావు జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం కలెక్టరేట్‌ ‌సమావేశ మందిరంలో మంత్రి హరీష్‌రావు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…సిఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమంలో దూసుకెళ్తుందన్నారు. దీనికి తోడుగా ప్రజాప్రతినిధులు, అధికారుల కృషితో జిల్లా అద్భుత ప్రగతిని సాధించిందన్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక, గుణాత్మక మార్పులు సాధించిందన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఫలితంగా సిద్ధిపేట జిల్లాలో అదనంగా లక్ష ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు సాధ్యమైందన్నారు. గత వానాకాలంలో ఒక లక్షా 20 వేల ఎకరాలలో వరిని జిల్లాలో సాగు చేస్తే ప్రస్తుత వానాకాలంలో గతంలో సాగు చేసిన వరి పంటకు అదనంగా లక్ష ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారన్నారు. భూగర్భ జల మట్టం పెరగడం, నీటి లభ్యత పెరగడం ఇందుకు కారణం అని మంత్రి తెలిపారు. అనేక సాగు నీటి ప్రాజెక్టు లతో రిజర్వాయర్ల ఖిల్లాగా సిద్దిపేట అవతరించి నందునే ఇది సాధ్య పడిందన్నారు. రైతుల సంక్షేమం, ప్రయోజనాన్ని కాంక్షించి ప్రభుత్వం నియంత్రిత పంటల సాగును చేపట్టిందనీ,  ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతుబంధు కింద వానాకాలం పంట పెట్టుబడి కోసం 302 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేశామనీ,  రైతు బీమా పధకం లో భాగంగా అకాల మరణం పొందిన 581 మంది రైతులకు 29 కోట్ల 5 లక్షల రూపాయలను పరిహారంగా అందించామన్నారు.

సాగు విస్తీర్ణం పెరగడం, పంట దిగుబడులను దృష్టిలో పెట్టుకొని ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌జోన్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో మెగా ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌జోన్ల ఏర్పాటు త్వరలో ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందన్నారు. అంతే కాకుండా, రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంకు 30 వేల మెట్రిక్‌ ‌టన్నులు సామర్థ్యం గల గోడౌన్ల నిర్మాణం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందన్నారు. కోల్డ్ ‌స్టోరేజ్‌లను సైతం ఏర్పాటు చేస్తామన్నారు. కాలేశ్వరం జలాలతో జిల్లా కోనసీమను తలపించనుందన్నారు. రైతులు 3 పంటలను సాగుకు కార్యచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. వ్యవసాయ యాంత్రీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు. వర్షాలు విరివిగా కురుస్తున్న దృష్ట్యా రైతులు ఎకరానికి మోతాదుకు మించి యూరియా వినియోగిస్తున్నారని అన్నారు. మోతాదుకు మించి ఎరువులు వాడకం సరికాదన్నారు. దీని వల్ల అనవసర పెట్టుబడి వ్యయం పెరుగుతుందన్నారు. యసంగి పంట కోసం కొంతమంది యూరియా ను నిల్వ చేస్తున్నారనీ, ఇది సరి కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌ద్వారా ఎండాకాలంలో ప్రాజెక్టు లు, చెరువులు నింపడం ద్వారా ….ప్రస్తుతం కురుస్తున్న కొద్దిపాటి వర్షాలకే జిల్లాలోని అన్ని జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయన్నారు. జిల్లాలో 3484 చెరువులు,చెక్‌ ‌డ్యాం లకు గానూ ఇప్పటి వరకూ 1600 చెరువులు, చెక్‌ ‌డ్యాం లు పూర్తిగా నిందయన్నారు.  సింగరాయ సాగర్‌, ‌గండి మహా సముద్రం, శనిగరం ప్రాజెక్టులు సైతం నిండాయన్నారు. అనంతగిరి, రంగనాయక సాగర్‌ ‌ప్రాజెక్టులతో పాటు ప్రధాన కాలువల నిర్మాణం పూర్తి అయ్యాయనీ, డిస్ట్రిబ్యూటెడ్‌, ‌మైనర్‌ ‌కాలువల తవ్వెందుకు రైతులు సహకరిస్తే చివరి ఆయకట్టుకు సాగునీరు అందుతుందనీ మంత్రి తెలిపారు. రెండు పడక గదుల గృహ నిర్మాణంలో జిల్లా ముందంజలో ఉందని మంత్రి తెలిపారు. జిల్లాకు కేటాయించిన 12820 ఇండ్లలో 8370 ఇండ్లు నిర్మాణం ఇప్పటికే పూర్తి చేశామన్నారు. కొరోనా వల్ల పంపిణీ చేయడంలో కొంత అలస్యం జరిగిందన్నారు. కోవిడ్‌ ‌తగ్గగానే…ప్రస్తుత సంవత్సరాంతంలోగా ఇండ్లను నీరు పేదలకు పంపిణీ పూర్తి చేస్తామన్నారు.

తెలంగాణ ప్రభుత్వం టిఎస్‌ ‌బి పాస్‌ ఇం‌డ్ల నిర్మాణంకు అత్యంత వేగంగా ఇండ్ల నిర్మాణంకు కేవలం 21 రోజుల్లో అనుమతులు మంజూరు చేస్తుందన్నారు. 75 గజాల లోపు పేదలు నిర్మించుకునే ఇండ్లకు రూ.1 కే అనుమతులు మంజూరు చేస్తుందన్నారు. కొత్త పంచాయితీ రాజ్‌ ‌చట్టం .. పల్లెలు సమగ్రాభివృద్ధి సాధించేందుకు ఆయువు పట్టుగా నిలిచిందన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రతి నెల మొదటి వారంలో 15వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులను మంజూరు చేస్తుందన్నారు.గ్రామాలలో ప్రణాళిక బద్ధమైన పచ్చదనం పెంపుకు ప్రభుత్వం కృషి చేసిందన్నారు.పల్లెల అభివృద్ధితో గ్రామాలకు తిరిగి వలసలు ప్రారంభం అయ్యాయన్నారు. ముఖ్యమంత్రి కృషి ఫలితమే రివర్స్ ‌మైగ్రేషన్‌ అని మంత్రి అన్నారు. గ్రామ పంచాయతీ, పురపా లిక పారిశుద్ధ్య కార్మికుల వేతనం పెంచడంతో పాటు కొరోనా క్లిష్ట సమయంలో కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తుందన్నారు. కొరోనా క్లిష్ట సమయంలో ముందుండి పోరాటం చేస్తున్న వైద్య సిబ్బంది కనిపించే దేవుళ్ళుగా ప్రజలు భావిస్తున్నారన్నారు. అలాగే కొరోనా వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లాలో రోజుకు 1000 ఆర్‌టిసిపిఆర్‌ ‌పరీక్షలు చేసే సామర్థ్యం సాధించామన్నారు. ర్యాపిడ్‌ ‌టెస్ట్‌లు ముమ్మరంగా చేపడుతున్నామన్నారు. కోవిడ్‌ ‌వ్యాధి లక్షణాలతో బాధపడే ప్రజలు వెంటనే హాస్పిటల్‌కు వచ్చి పరీక్షలు చేయించు కోవాలన్నారు. సకాలంలో రావడం వల్ల ప్రాణాపాయం లేకుండా కాపాడుకోవచ్చునని అన్నారు. కొత్తగా ఏర్పాటైన సిద్దిపేట జిల్లాలో అధునాతన సౌకర్యాలతో సమీకృత కలెక్టరేట్‌, ‌పోలీస్‌ ‌కమిషరేట్‌ ‌భవన నిర్మాణం చేపడుతున్నామని మంత్రి హరీష్‌రావు తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా పరిషత్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌వేలేటి రోజారాధకృష్ణశర్మ, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు రఘోత్తంరెడ్డి, ఫారుఖ్‌హుస్సేన్‌, ‌కలెక్టర్‌ ‌పరపతి వెంకట్రామరెడ్డి, అదనపు కలెక్టర్లు ఎస్‌.‌పద్మాకర్‌, ‌ముజమ్మీల్‌ఖాన్‌, ‌ట్రైనీ ఐఏఎస్‌ ‌దీపక్‌ ‌తివారీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply