Take a fresh look at your lifestyle.

నెలాఖరులోపు కొండపోచమ్మ సాగర్‌కు కాళేశ్వరం జలాలు

  • అన్నదాతలు వరినాట్లకు సిద్ధంగా ఉండాలి
  • మంత్రి తన్నీరు హరీశ్‌రావు 

నెలాఖారులోపు కొండపోచమ్మ సాగర్‌కు కాళేశ్వరం జలాలు రానున్నాయని అర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడించారు. సిద్ధిపేట జిల్లా మండల కేంద్రమైన వర్గల్‌లో రూ.2.60కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కొత్త కుంట చెరువు, రూ.4.27కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఖాన్‌ ‌చెరువు పునరుద్ధరణ-సుందరీకరణ నిర్మాణ పనులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ ‌రావు, జెడ్పి చైర్మన్‌ ‌వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎఫ్డీసీ చైర్మన్‌ ‌వంటేరు ప్రతాప్‌ ‌రెడ్డిలతో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మంత్రి తన్నీరు హరీశ్‌రావు మాట్లాడుతూ…ఈ నెలాఖారులోపు కొండ పోచమ్మ జలాశయానికి కాళేశ్వరం జలాలు రానున్నాయన్నారు. కాళేశ్వరం జలాలతో గజ్వేల్‌ ‌నిమోజక వర్గ పరిధిలోని చెరువులు, కుంటలు నింపనున్నట్లు పేర్కొన్నారు. రైతులు నాట్లు వేసుకునేందుకు సిద్ధం కావాన్నారు. కొత్త కుంట చెరువు పునరుద్ధరణ-సుందరీకరణతో వర్గల్‌ ‌సరస్వతీ దేవాలయానికి మరింత శోభ సంతరించుకోనునందన్నారు.

66 ఎకరాల ఆయకట్టుతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జెట్టి సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. మిషన్‌ ‌కాకతీయ కింద ఫీడర్‌ ‌ఛానల్‌, ‌పంట కాలువలు, చెరువులు, బతుకమ్మ మెట్లు అభివృద్ధి పనులు చేపట్టనట్లు వెల్లడించారు. గతంలో ఉన్న 3 మీటర్ల మేర బండ్‌ను 10 మీటర్ల మేర వెడల్పుతో పనులు చేస్తున్నట్లు తెలిపారు. రూ.4.27కోట్ల రూపాయలతో ఖాన్‌ ‌చెరువు పునరుద్ధరణ-సుందరీకరణతో 600 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు రానున్నదన్నారు. త్వరలోనే రానున్న కాళేశ్వరం జలాలతో కొత్త కుంట, ఖాన్‌ ‌చెరువులు 3వేల క్యూసెక్కుల నీటితో జలకళ సంతరించు కుంటాయన్నారు. అలాగే హల్దీ వాగుపై ఉన్న 12 చెక్‌ ‌డ్యామ్‌లు నింపుతున్నట్లు తెలిపారు. దాదాపు 2900 ఎకరాల మేర మేలు చేకూరనున్న హల్దీ ప్రాజెక్ట్టు పై ఉన్న 12 చెక్‌ ‌డ్యామ్‌లు సాగునీటితో కలకలలాడనున్నాయన్నారు. వచ్చే వాన కాలం నాటికి యుద్ధప్రాతిపదికన పనులు చేయాలని ఇరిగేషన్‌ అధికారులకు మంత్రి ఆదేశించారు. అదే విధంగా నాచగిరి శ్రీ లక్ష్మీ నర్సింహాస్వామి దేవాలయ ఆవరణలోని చెక్‌ ‌డ్యామ్‌ ‌పనులను 45 రోజుల్లో పూర్తి చేయాలని ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. వర్గల్‌ ‌లోని ఆర్‌అం‌డ్‌ ‌బీ గెస్ట్ ‌హౌస్‌ను సరస్వతీ దేవాలయానికి అప్పగించాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈకార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీగిరిపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
గజ్వేల్‌ ‌మండలం శ్రీగిరిపల్లిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి హరీశ్‌ ‌రావు, జెడ్పి చైర్మన్‌ ‌వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎఫ్డీసీ చైర్మన్‌ ‌వంటేరు ప్రతాప్‌ ‌రెడ్డి, భూపతి రెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ..గ్రామంలో చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తడిపొడి చెత్తగా వేరు చేసి పారిశుధ్య సిబ్బందికి అందించాలన్నారు. అదే విధంగా గ్రామానికి 50 డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ‌గృహాలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇక నుంచి 57 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరికి వృద్ధాప్య పెన్షన్‌ను ప్రభుత్వం అందిస్తుందన్నారు. గ్రామంలో రోడ్డు వెడల్పు ఇండ్లు పోయిన వారికి డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్లు ఇస్తామని హామీనిచ్చారు. చెత్త సేకరణ సరిగ్గా చేస్తే 15 రోజుల్లో రూ.22 లక్షలతో మోరీల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానన్నారు. గ్రామంలో బొడ్డు రాయి ఏర్పాటు కార్యక్రమానికి హాజరవుతానన్నారు.

Leave a Reply