Take a fresh look at your lifestyle.

కోరోనాతో కాళేశ్వరం ఆలయ చైర్మన్ మృతి  

సంతాపం వ్యక్తం చేసిన  మంత్రి హరీష్ రావు
కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ కమిటీ ఛైర్మన్ , దుబ్బాక మండలం చెర్వా పూర్ కు చెందిన
 బొమ్మెర వెంకటేశం అకాల మరణం పట్ల మంత్రి హరీష్ రావు తన సంతాపాన్ని తెలియజేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ అత్యంత సన్నిహితుడు, నాకు మంచి ఆత్మీయంగా ఉండే వెంకటేశం మరణం బాధాకరమన్నారు. అందరితో ఆత్మీయంగా ఉంటూ, ఆధ్యాత్మిక సేవలో పాలుపంచుకున్నరన్నారు. తెలంగాణ సుప్రసిద్ధ క్షేత్రం కాళేశ్వర ముక్తేష్వర ఆలయ చైర్మన్ గా రెండు మార్లు ఎన్నికై ఆలయంలో తన సేవలను కొనియాడారు. కేసీఆర్ బాల్య మిత్రునిగా టిఆర్ ఎస్ పార్టీ కి చేసిన కృషిని మరువ లేనిదని, దుబ్బాక లో నిర్మించే వెంకటేశ్వర ఆలయం ఏర్పాటులో తన సేవ ఎంతో ఉందన్నారు.   వారు కొరోనాతో పోరాడి మృతి చెందడం బాధాకరమని చెప్పారు. ఆయన మృతి పట్ల వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

Leave a Reply