
మహాశివరాత్రి జాతర సందర్భంగా మెదక్ జిల్ల్లాలోని ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని మంత్రి హరీష్‌రావు దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే శివరాత్రికి కాళేశ్వరం నీళ్లు మెదక్ జిల్లాకు చేరుతాయని, కాళేశ్వరం పనులను సిఎం కెసిఆర్ యుద్ధప్రాతిపదికన చేయిస్తున్నారని అన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలోని ఆలయాలకు అన్యాయం జరిగిందనితెలిపారు. అందకునే రాష్ట్రంలో దేవాలయాలకు సిఎం కెసిఆర్ భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. దేవాదాయ శాఖను బలోపేతం చేసి ఉద్యోగులకు, వేతనాలు ఇస్తున్నామని హరీష్ వివరించారు. ఏడుపాయల జాతరకు వచ్చే భక్తుల కోసం మౌలిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మెదక్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని హా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంఎల్ఎలు, పద్మా దేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డిల పాల్గొన్నారు.