Take a fresh look at your lifestyle.

కలాలకు సంకెళ్లు…!

స్వాతంత్య్ర భారతంలో …
నిషేధాలు మొలుస్తున్నయ్‌

‌ప్రజాస్వామ్య దేశంలో …
నిర్బందాలు వెలుస్తున్నయ్‌

‌గణతంత్ర రాజ్యంలో..
ఆయుధాలు
తుపాకి గొట్టాలు గర్జిస్తున్నయ్‌
‌బూటక చట్టాలు నర్తిస్తున్నయ్‌

ఉరి తాళ్ళు వేలాడుతున్నయ్‌
ఉక్కు పాదాలు సంచరిస్తున్నయ్‌

ఇదేంటని కలమెత్తిన
పాత్రికేయ యోధులపై
రాజ్యం కత్తులు దూస్తుంది

సిరాపై విషం చిమ్ముతుంది
పెన్నుపై గన్ను గురి పెడుతుంది

రాతలపై ఆంక్షలు విదిస్తుంది
వార్తలపై కొరడా జులిపిస్తుంది

బెదిరింపులకు ఒడిగడుతుంది
మూక దాడికి తెగబడుతుంది

దేశ ద్రోహ ట్యాగ్‌ ‌వేలాడేసి
చీకటి జైళ్లలో బందిస్తుంది

మొత్తంగా…
ఫోర్త్ ఎస్టేట్‌ ‌కూలుస్తుంది
జర్నలిస్టుల ఖతం చేస్తుంది

ఇంకా భయం నటిస్తే …
బతికున్నా చచ్చిన కిందే లెక్క

మౌనం ఆశ్రయిస్తే …
బండరాయికి మనకు తేడాలేనట్లే

అందుకే ఉన్నపళంగా…
జన గణం ఉద్యమించాల్సిందే
పాలకులకు బుద్ది చెప్పాల్సిందే
పత్రికా స్వేచ్ఛను రక్షించాల్సిందే

(పత్రికా స్వేచ్ఛ హరించే రాజ్య తీరును ఖండిస్తూ..)
 –  కోడిగూటి తిరుపతి, 9573929493

Leave a Reply