Take a fresh look at your lifestyle.

తుక్కుగూడపై న్యాయ పోరాటం చేస్తాం కెకెపై రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదు లక్ష్మణ్‌ ‌వెల్లడి

దొడ్డిదారిన తుక్కుగూడ మున్సిపాలిటీని టీఆర్‌ఎస్‌ ‌దక్కించుకుందని బిజెపి అధ్యక్షుడు డాక్టర్‌ ‌కె. లక్ష్మణ్‌ ‌మండిపడ్డారు. తుక్కుగూడ నుంచే టీఆర్‌ఎస్‌ ‌పతనం ప్రారంభమైం దన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. తుక్కుగూడలోని దేవేందర్‌ ‌గౌడ్‌ ‌నివాసంలో కార్యకర్తలతో లక్ష్మణ్‌ ‌బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తుక్కుగూడ చైర్మన్‌ ఎన్నికపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అ‌క్రమాలపై ఉపరాష్ట్రపతి, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఎక్స్ అఫీషి యో సభ్యుడు కాకున్నా టిఆర్‌ఎస్‌ ఎపి కె.కేశవరావు ఇక్కడ ఓటు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. కేంద్రంలో బీజేపీ ఉన్న విషయాన్ని టీఆర్‌ఎస్‌ ‌గుర్తుపెట్టుకోవాలని లక్ష్మణ్‌ ‌తెలిపారు.

తుక్కుగూడలో ఓటు వేసిన కేకేను అనర్హుడిగా ప్రకటించాలంటూ.. రాజ్యసభ చైర్మన్‌ ‌వెంకయ్యనాయుడుకు ఫిర్యాదు చేస్తామని లక్ష్మణ్‌ ‌వెల్లడించారు. తెలంగాణలో బీజేపీ బలం పెరిగిందనడానికి తాజా ఫలితాలే నిదర్శనమన్నారు. ఒంటరిగా పోటీ చేసినా 80 మున్సిపాలిటీల్లో తమ అభ్యర్థులు గెలిచారని లక్ష్మణ్‌ ‌వెల్లడించారు. అసదుద్దీన్‌ ఓవైసీతో ఫ్రెండ్‌ ‌షిప్‌ ‌కోసమే సీఎం కేసీఆర్‌ ‌పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు.  పౌరసత్వాన్ని అడ్డుకోవడమంటే పాకిస్తాన్‌ ‌ముస్లింలకు మనదేశ పౌరసత్వం కోరడమేనన్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పారన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో భైంసాలో టీఆర్‌ఎస్‌ ఒక్క సీటు కూడా గెలవలేక పోయిందన్నారు. బీజేపీ కార్యకర్తలపై టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ తీసుకుంటున్న నిర్ణయాలే బీజేపీకి పెద్ద బలమన్నారు.

Leave a Reply