Take a fresh look at your lifestyle.

అధికార దుర్వినియోగం, ప్రలోభాలు

During the six year No development in Ts BJP state president k lakshman

రాష్ట్రంలో అధికార పార్టీ అధికార దుర్వినియో గానికి పాల్పడిందని, విచ్చలవిడిగా ప్రలోభాలకు గురిచేసిందని బీజేపీ అధ్యక్షడు లక్ష్మణ్‌ ‌బుధవారం టీఆర్‌ఎస్‌ ‌విరుచుకుపడ్డారు. అనవసరఘర్షణలు సృష్టించి దొంగ వోట్లు వేసుకున్నారని, ఉద్దేశపూర్వకంగా పంచాయతీలు పెంచారని ఆరోపించారు. కరీంనగర్‌, ‌నిజామాబాద్‌ ,ఆదిలాబాద్‌, ‌జిల్లాల పరిధిలోని మునిసిపా లిటీల్లో బీజేపీ జెండా ఎగురుతున్న దన్న విషయం తెలుసుకోవడంతో టీఆర్‌ఎస్‌ అ‌గ్రనేతల్లో గుబులు మొదలయ్యిందని విమర్శించారు. ప్రతీచోట అభివృద్ధి తమ నినాదమని, తాము పేద ప్రజలకోసం ఏర్పాటఱు చేసిన సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తామని ఊదరగొట్టే టీఆర్‌ఎస్‌ ‌నాయకులు ధనప్రవాహాన్ని ఎందుకు పంచారని ప్రశ్నించారు.

 

ఏ మునిసిపాలిటీలో కూడా ఎటువంటి అభివృద్ధి చేయనందుననే ఓటర్లు తిరగబడ్డారని, బీజేపీకి ఎక్కువ మునిసి పాలిటీలో అధికారం ఇచ్చేందుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు.  నిజామాబాద్‌లో బీజేపీ కార్యకర్తల మీదికి మజ్లీస్‌ ‌కార్యకర్తలను ఎగదోసి ఉద్రిక్తవాతావరణం సృష్టించారని ఆరోపించారు.. టీఆర్‌ఎస్‌ ‌నాయకులు  ప్రచారం చేసేందుకు కూడా ప్రజల్లోకి రాలేకపోయారని, ప్రజలు ప్రతీ చోట వారిని తిరస్కరించారని విమర్శించారు. బీజేపి చేసిన విమర్శలకు సమాధానాలు చెప్పలేని నిస్సహాయ రాజకీయ స్థితిలో టీఆర్‌ఎస్‌ ‌కొట్టుమిట్టాడుతున్నదని బీజేపీ అధ్యక్షులు తూర్పారపట్టారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply