Take a fresh look at your lifestyle.

బహుజన బ్రతుకులలో జ్యోతి మహాత్మా పూలే

జ్యోతిరావు పూలే 1827 ఏప్రిల్‌ 11‌న మహారాష్ట్రలో గోవిందరావు చిన్నాబాయి దంపతులకు జన్మించాడు వెలుగును సూచిస్తూ అతని తల్లిదండ్రులు అతనికి జ్యోతి అనే పేరు పెట్టారు. ఆ రోజుల్లోనే కుమారునికి చదువు చెప్పించాలనే ఆలోచన తండ్రి గోవిందరావుకి కలిగింది.
అయితే బ్రాహ్మణేతరులకు విద్య నేర్పే సంప్రదాయం ఆనాడు లేదు దింతో పూలే తండ్రి తన కుమారుడికి విద్యా నేర్పించడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.తండ్రి పట్టుదలతో పూలే క్రమంగా మరాఠీ భాష పై పట్టు సాధించారు.పగలు తండ్రికి పనిలో సహాయపడుతు రాత్రిళ్లు గుడ్డి  దీపం వెలుగులో చదువుకునేవాడు,క్రమంగా ఆయన ఇంగ్లీష్‌ ‌భాషపై కూడా పట్టు సంపాదించాడు.
నాటి ఆచారాల ప్రకారం ఆయనకు 13 ఏళ్ళకే వివాహం జరిపించారు. వధువు పుణె వద్ద ఉన్న కవాడీ గ్రామానికి చెందిన సావిత్రిబాయి పెళ్లి సమయానికి ఆమె వయస్సు ఎనిమిదేళ్లు.నిమ్న వర్గాల బాలికల కోసం పూలే పాఠశాల స్థాపించినప్పుడు ఆయన ఉపాధ్యాయునిలు దొరక్క ఇబ్బంది పడుతున్నాడని గమనించిన ఆమె తను స్వయంగా ఉపాధ్యాయురాలిగా మారారు.
అప్పట్లో మహారాష్ట్ర లో వచ్చిన కరువు కాటకాలల్లో ఆమె చేసిన సేవలు అపూర్వం. రాష్ట్రంలో ప్లేగువ్యాధి ప్రబలిన రోజుల్లో రోగులకు సేవ చేస్తూ ఆ ప్లేగు వ్యాధికే ఆయె బలయ్యారు.

జ్యోతిరావ్‌ ‌పూలే జీవితంలో జరిగిన ఓ ఘటన ఆయన జీవన గమనాన్ని మార్చేసింది ఓ బ్రాహ్మణ స్నేహితుని ఆహ్వానాన్ని మన్నించి వివాహానికి వెళ్లిన పులేకి ఊరేగింపులో బ్రాహ్మణులు తప్ప ఎవరు ఉండకూడదన్న మాటలు సూలల్లా తాకాయి.
అది వర్ణవ్యవస్థ పై ఆయన తిరుగుబాటుకు నాదిగా మారింది. శూద్రులు పడుతున్న బాధలు ఎదుర్కొంటున్న అవమానాల నుంచి
వారిని విముక్తి చేయాలని పూలే సంకల్పించారు.తాను బ్రాహ్మణికానికి  వ్యతిరేకం కానీ బ్రాహ్మణులకు కాదని ప్రకటించి అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా జ్యోతిరావుపూలే పోరాటం చేశారు.విద్యా ద్వారానే నిమ్న వర్గాలకు అణచివేత నుంచి విముక్తి లభిస్తుందన్న దృఢ విశ్వాసంతో ఆయన వారి విద్యా వ్యాప్తి కోసం కృషి చేశారు. విద్యా సంస్థల స్థాపనకు సహృదయులైన విదేశీయుల నుంచి సైతం విరాళాలు సేకరించేవారు.ఆయన సేవలకు విదేశాలలో కూడా ప్రచారం లభించడంతో బ్రిటిష్‌ ‌ప్రభుత్వం 1852లో పూణే కళాశాల ప్రిన్సిపాల్‌ ‌చేతుల మీదుగా ఆయనను సన్మానించింది. ఒకానొక సమయంలో అగ్రవర్ణాల వారు ఆయన పేరు ప్రఖ్యాతులు చూసి ఓర్వలేక ఆయనను హత్య చేయించడానికి కూడా ప్రయత్నించారు. అయితే వాటన్నింటి నుంచి ఆయన విజయవంతంగా బయటపడ్డారు.ఆ రోజుల్లోనే ఆయన సతీసహగమనం రూపుమాపడానికి కృషి చేశారు. వితంతు వివాహాలను ప్రోత్సహించారు ఆయనను ఆదర్శంగా తీసుకొని తరువాత కాలంలో ఆంద్ర రాష్ట్రంలో కందుకూరి వీరేశలింగం,ఉన్నవ లక్ష్మీనారాయణ లాంటివారు వితంతు వివాహాలను జరిపించారు.

వితంతువుల కోసం పూలే ఒక శరణాలయం కూడా స్థాపించారు. దేశంలోని విద్యారంగ పరిస్థితులను పరిశీలించేందుకు బ్రిటిష్‌ ‌ప్రభుత్వం 1882లో ఇండియన్‌ ఎడ్యుకేషన్‌ ‌కమిషన్‌ ‌ను నియమించింది.దాని అధ్యక్షుడు హంటర్‌ ‌పేరిట.
హంటర్‌ ‌కమిషన్‌ ‌గా పేరుపొందింది. పూలే ఆ కమిషన్‌ ‌ముందుకు వెళ్లి తన వాదన వినిపించారు.
రైతుల నుంచి పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వం ఆ డబ్బును కేవలం అగ్రవర్ణాల చదువు కోసం మాత్రమే ఖర్చు పెడుతోందని విశ్వవిద్యాలయాలు అగ్రవర్ణాల వారికి మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఆరోపించారు.
బ్రాహ్మణ పురోహితులు లేకుండా ఆత్మ సాక్షిగా,పెద్దల సాక్షిగా,నిరాడంబరంగా దండలు మార్చుకొని పెళ్లి చేసుకునే పద్ధతిని ఆరోజుల్లోనే ప్రవేశపెట్టిన మానవతావాది జ్యోతిరావ్‌ ‌పూలే.జ్యోతిరావ్‌ ‌పూలే రాసిన పుస్తకాలన్నీ సమాజ అభివృద్ధికి దోహదపడ్డాయి. ఆయన రచనల్లో ముఖ్యమైనవి గులాంగిరి అమెరికాలో బానిసత్వాన్ని రద్దు చేసిన లింకన్‌ ‌తో ఉత్తేజితుడై ఆయన గులాంగిరి ని రచించారు.
శాస్త్రాలు,పురాణాల్లో పేర్కొన్న విషయాల గురించి ముఖ్యంగా అవతారాల గురించి జ్యోతిభా దీనిలో తీవ్రంగా చర్చించి బ్రాహ్మణుల మీద తిరుగుబాటు జెండా ఎగురవేశారు. జ్యోతిబాపూలే జీవితం డాక్టర్‌ ‌బి.ఆర్‌ అం‌బేద్కర్‌, ‌మహాత్మా గాంధీ లాంటి అనేక మందికి ఆదర్శంగా నిలిచింది.పూలే గడిపిన సాధారణ జీవితం సత్యనిష్టగరిష్టత  అహింసాయుత విధానాలు సత్యాగ్రహం మార్గాలు తనను ఎంతో ప్రభావితం చేశాయని గాంధీజీ తన ఆత్మకథలో రాసుకున్నారు. దీన్నిబట్టి పూలే ప్రభావం ఆయనపై ఎంతగా ఉందో తెలుసుకోవచ్చు. విశ్వవిద్యాలయాల్లో కుల రక్కసి విజృంభిస్తున్న నేపథ్యంలో జ్యోతిరావు పూలే బోధనలు, రచనల అవసరం సమాజానికి ఇప్పుడు ఎంతైనా ఉంది.

(ఏప్రిల్‌ 11 ‌మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా..)

– గుండమల్ల సతీష్‌ ‌కుమార్‌
‌టీఆర్‌ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి.
9493155522.

Leave a Reply