Take a fresh look at your lifestyle.

ఎపి హైకోర్టు సిజెగా జస్టిస్‌ ‌మిశ్రా ప్రమాణం

  • ప్రమాణం చేయించిన గవర్నర్‌ ‌బిశ్వభూషన్‌
  • ‌హాజరైన సిఎం జగన్‌,‌పలువురు మంత్రులు

విజయవాడ,అక్టోబర్‌ 13 : ఏపీ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ‌ప్రశాంత్‌ ‌కుమార్‌ ‌మిశ్రా ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ ‌ప్రశాంత్‌ ‌కుమార్‌ ‌మిశ్రాతో గవర్నర్‌ ‌బిశ్వభూషన్‌ ‌ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. అలాగే మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్‌, ‌పలువురు ఎమ్మెల్యేలు,హైకోర్టు న్యాయవాదులు హాజరయ్యారు. జస్టిస్‌ ‌ప్రశాంత్‌ ‌కుమార్‌ ‌మిశ్రా 1964 ఆగస్టు 29న ఛత్తీస్‌గఢ్‌లోని రాయగఢలోని జన్మించారు.

బిలాస్‌పూర్‌లోని గురుఘసీదార్‌ ‌వర్సిటీ నుంచి బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ పట్టాలు పొందారు. 1987 సెప్టెంబర్‌ 4‌న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. రాయగఢ జిల్లా, మధ్యప్రదేశ్‌, ‌ఛత్తీస్‌గఢ్‌ ‌కోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టిస్‌ ‌చేశారు. 2005 జనవరిలో ఛత్తీస్‌గఢ్‌ ‌హైకోర్టు ద్వారా సీనియర్‌ ‌న్యాయవాది హోదా పొందారు. బార్‌ ‌కౌన్సిల్‌ ‌ఛైర్మన్‌గా పనిచేశారు. హైకోర్టు నియమాల రూపకల్పన కమిటీ సభ్యునిగా పనిచేశారు. 2004 జూన్‌ 26 ‌నుంచి 2007 ఆగస్టు 31 వరకు ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్ర అదనపు అడ్వకేట్‌ ‌జనరల్‌గా సేవలందించారు. ఆ తర్వాత అడ్వకేట్‌ ‌జనరల్‌గా పదోన్నతి పొందారు. 2009 డిసెంబర్‌ 10‌న ఛత్తీస్‌గఢ్‌ ‌హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ ‌ప్రశాంత్‌ ‌కుమార్‌ ‌మిశ్రా నియమితులయ్యారు. అక్కడ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉన్న ఆయనకు పదోన్నతి కల్పించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కలోజియం ఇందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ఆమోదముద్ర పడింది.

Leave a Reply