దేశవ్యాప్తంగా పలువురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయ మూర్తులు బదిలీ అయ్యారు. తెలుగు రాష్ట్రాలకూ కొత్త సీజేలు నియమితులయ్యారు. ఈనెల 14న జరిగిన సుప్రీమ్ కోర్టు కొలీజియం సమావేశంలో ఈ మేరకు ఖరారు చేసినట్లు ప్రకటన విడుదలైంది.
తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ హిమా కోహ్లీ నియమితులయ్యారు. తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న ఆర్.ఎస్.చౌహాన్‌ను ఉత్తరాఖండ్‌కు బదిలీ చేశారు.