Take a fresh look at your lifestyle.

‘‘‌మాదక ద్రవ్యాలు నాగరికతకు గొడ్డలి పెట్టు’’

జూన్‌ 26, అం‌తర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం
వ్యసనాలు నాగరికతకు చిహ్నాలు కావు. అభివృద్ధికి విఘాతాలు. వ్యక్తిత్వ హననానికి సోపానాలు. ఒక మహాజాడ్యం. అక్రమ వ్యాపార సౌధాల నిర్మాణం కోసం బాలలలు, యువత లక్ష్యంగా ప్రపంచాన్ని మత్తులో ముంచెత్తడం ఘోరం. మాదక ద్రవ్యాల వలన శక్తియుక్తులన్నీ నిర్వీర్యమై, సమాజం అతలా కుతలమై పోయే ప్రమాదం దాపురించింది. ప్రతీ ఏటా ‘‘డ్రగ్స్ ‌వ్యతిరేక దినం’’ జరుపుకుంటున్నా. ఆ ఒక్కరోజుతోనే దాని ప్రాముఖ్యత సమాప్త మవుతున్నది. మాదక ద్రవ్యాల వలన కలిగే విషపరిణామాల దృష్ట్యా 1987 లో వియన్నా లో అంతర్జాతీయ డ్రగ్స్ ‌వ్యతిరేక సదస్సు జరిగగా, ప్రపంచం దేశాలు డ్రగ్స్ ‌మహమ్మారి ని అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తూ చట్టాలకు పదును పెడుతున్నాయి. అయితే ఒక్కరోజు జరిగిన మొక్కుబడి సదస్సులు, ప్రసంగాల వలన ప్రయోజనం చేకూరదు..

మాదకద్రవ్యాల వినియోగం వలన పాలన, రక్షణ, ఆరోగ్యంపై పడే ప్రభావం గురించి, డ్రగ్స్ ‌నిరోధానికి అంతర్జాతీయ సహకారం అవసరమని చాటి చెప్పడమే ఐ.రా.స ‘‘ బెట్టర్‌ ‌నాలెడ్జ్ ‌ఫర్‌ ‌బెట్టర్‌ ‌కేర్‌’’ ‌లక్ష్యం. ప్రపంచ వ్యాప్తంగా సుమా రు 200 మిలియన్ల మందికి పైగా డ్రగ్స్ ‌కు బానిసలని గణాంకాలు తెలియ చేస్తున్నాయి. ఇతర దేశాల విషయం ప్రక్కన బెడితే భారత ప్రభుత్వం 1985 లోనే మాదక ద్రవ్యాల వ్యతిరేక చట్టం ‘‘ఎన్‌.‌డి.పి.ఎస్‌’’ ‌తీసుకువచ్చి, తర్వాత పలు సవరణలతో ఈ చట్టాన్ని పటిష్ఠం చేసింది. అయితే కాగితాలకే పరిమితం కావడం విచారకరం. ప్రజల్లో వివేచన కలగాలి. నేటి ప్రపంచం అపసవ్య దిశలో సకల అవ లక్షణాలతో, వ్యసనాలతో మానవ వనరులు నిర్వీర్యమై, అభివృద్ధి అడుగంటుతున్నది. ఆనంద జీవితం మంచి నడవడిక, క్రమశిక్షణ వలనే ప్రాప్తిస్తుంది. నైతికత, మానవీయత లేకుండా గొప్పలకోసం చేసే ప్రచార పటోటాపాలవల్ల ప్రయోజనం చేకూరదు.

పాత కాలం నాటి విద్యావిధానంలో చిరుప్రాయం నుండే విలువలతో కూడిన విద్యను నేర్పేవారు. దేశం పట్ల,కుటుంబం పట్ల వారికి ఒక అవగాహన ఏర్పడేది. నేడు ఆ పరిస్థితులు మృగ్యమైనాయి. యువత చెడుదారిలో పయని స్తున్నది. మంచి చెడులను బోధించే విద్యా విధానం కరువైనది. కేవలం చదువంటే మార్కుల మాయ, గ్రేడుల గోల.మానసిక పరిపక్వత లేని చదువుల వలన వివేకం అబ్బడం లేదు. చిన్న వయసునుండే పెద్దలను ఎదురించడం, యుక్త వయసు వచ్చాక వ్యసనాలకు అలవాటు పడి, వ్యసనాలకోసం డబ్బు ఖర్చుచేయడం, డబ్బు లేక పోతే సంఘవిద్రోహులుగా మారి దేశానికి భారంగా మారడం మనం చూస్తున్నాం. ప్రపంచం మారింది.మారిన కాలానికి అనుగణంగా మనం కూడా మార్పుకు సిద్ధం కావాలి. అయితే ఈ మార్పు సవ్యంగా ఉండాలి.

ఎక్కడ చూసినా మద్యపానం.. ధూమపానం
చతుర్ముఖపారాయణం…అత్యాచారాలు…లైంగిక వేధింపులు. సంపాదనంతా వ్యసనాలకే సరిపోతుంటే ఇక పిల్లల బాధ్యత పడుతుందా? బాధ్యత లేని తల్లిదండ్రుల వలన, విలువలు నేర్పని విద్యల వలన ప్రపంచమే నైతికంగా పతనమైపోతున్నది.యువశక్తి నిర్వీర్యమై పోతున్నది. ఆల్కహాలిజం వలన యువత అను నిత్యం మత్తులో తూలుతున్నది. ఇది చాలదన్నట్టు మాదక ద్రవ్యాల వ్యసనం ఒక మహమ్మారిలా మానవ సమాజంలో ప్రవేశించింది. భయం కరమైన డ్రగ్స్ ‌భూతానికి మానవ వనరులన్నీ నిర్వీర్యమై పోతున్నాయి. దేశాల ఆర్ధిక వ్యవస్థలన్నీ కుప్పకూలుతున్నాయి. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువత చేయలేని దుర్మార్గమంటూ ఏదీ లేదు. మత్తు లో చిత్తయి, వారి అలవాట్లకు, అవ సరాలకు సంఘ విద్రోహుల వలలో చిక్కి యువత అసా ంఘిక కార్య కాలాపాల వైపు పయనించడం ఆందోళన కలిగించే విష యం. భ్రమల్లో తేలియాడించి ఊహల పల్లకీలో ఊరేగించి,రంగుల ప్రపంచం చుట్టూ పరి భ్రమి ంచేలా చేయగల శక్తి మాదక ద్రవ్యా లకుంది.ఈ డ్రగ్స్ ‌కు అలవాటు పడిన వారికి మానవ ప్రపం చంతో సంబం ధాలుండవు. మంచి-చెడు విచక్షణ కనిపించదు. స్వప్నలోకాల్లో విహరిస్తూ,మత్తు వదలిన తర్వాత అనేక శారీరక,మానసిక బలహీనతలకు గురై, మళ్ళీ అదే మత్తుకోసం చేయకూడని అకృత్యాలన్నీ చేస్తారు. డ్రగ్స్ ‌మాఫియా వలలో చిక్కి, డ్రగ్స్ అ‌క్రమ వినియోగానికి, డ్రగ్స్ ‌రవాణాకు పాల్పడతారు. డ్రగ్స్ ‌కు బానిసలై ఉగ్రవాదులుగా మారుతున్న వారెంతో మంది సమాజానికి చీడపురుగుల్లా తయారౌతున్నారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటూ, అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు.

వ్యసనపరులై, భ్రష్టులైన పెద్దలు తమ పిల్లలను ఏ రకంగా పెంచగలరు? అలాంటి వారి వలన,అలాంటి వాతావరణంలో పెరిగే పిల్లలు ఎలా తయారౌతారో వేరే చెప్పన క్కరలేదు.. విద్య, వైద్య, ఆరోగ్యం,అ666భివృద్ధి వంటి వాటిపై దృష్టి పెట్టవలసిన ప్రభుత్వాలు సింహభాగం నిధులను అరాచకశక్తుల అణచివేతకోసం, బాహ్య,ఆంతరంగిక అసాంఘిక శక్తులను అడ్డుకోవడానికే వెచ్చించవలసి వస్తున్నది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలకు ప్రజోపయోగమైన కూడు, గూడు, గుడ్డ విద్య, వైద్య, ఆరోగ్యం వంటి అంశాలపై అధిక నిధులు వెచ్చించలేకపోవడం జరుగుతున్నది. ఈ పరిస్థితులు మారాలి. ప్రజల్లో మార్పు రావాలి. మత్తులో తూలుతున్న యువతను ఆ మత్తు నుండి బయటకు తీసుకురావాలి. సకల అనర్ధాలకు, సమాజంలో చోటుచేసుకుంటున్న అరాచకాలకు, అమానుషత్వ ధోరణులకు ‘‘మత్తు’’ ప్రధాన కారణంగా అనేక సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక ప్రపంచంలో మాదక ద్రవ్యాల ప్రభావం గురించి ప్రత్యేకంగా విశ్లేషించ నక్కరలేదు. మానసిక ప్రవర్తనలో విపరీతమైన ధోరణులను ప్రేరేపించి, అరాచకత్వానికి నాంది పలుకుతున్న డ్రగ్స్ ‌ను యువత నుండి దూరం చేయాలి. డ్రగ్స్ ‌లేని సమాజాన్ని రూపొందించడానికి అంతర్జాతీయ సమాజం మరింత కృషి చేయాలి. డ్రగ్స్ ‌మహమ్మారి ని పారద్రోలి వివేకవంతమైన సమాజ స్థాపనకు ప్రతీ ఒక్కరూ నడుంబిగించాలి. డ్రగ్స్ ‌వినియోగం తో పాటు మద్యపాన వ్యసనం అత్యంత ఘోరంగా తయారైన నేపథ్యంలో ప్రభుత్వాలు వీటిపై ఉక్కు పాదం మోపాలి. ప్రజలకు విద్య,వైద్యం,పరిశుభ్రమైన త్రాగునీరు ఉచితంగా అందించాలి. ప్రపంచాన్ని మానసిక రోగగ్రస్తులకు నిలయంగా మార్చే డ్రగ్స్ ‌మాఫియా సామ్రాజ్యాన్ని కూకటి వ్రేళ్ళతో సహా పెకలించాలి.
-సుంకవల్లి సత్తిరాజు. 9704903463.

Leave a Reply