Take a fresh look at your lifestyle.

జూన్‌ 2‌న పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా నిరసన చేపడతాం

  • కేసీఆర్‌ ‌చెప్పే ఏ మాటకూ విలువ ఉండదు : ఉత్తమ్‌
  • ‌కేసీఆర్‌ ‌నీకు బుద్ధి ఉందా..? : కోమటిరెడ్డి 
  • కాంగ్రెస్‌ ‌దయాదాక్షిణ్యాల వల్లే తెలంగాణ వచ్చింది …రేవంత్‌   

ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడుపై కొత్త ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం పూర్తిగా సీఎం కేసీఆర్‌ ‌వైఫల్యమేనని కాంగ్రెస్‌ ‌పార్టీ విమర్శించింది. తెలంగాణ హక్కులను కాపాడాల్సిన బాధ్యతను పక్కనబెట్టి కేసీఆర్‌ ‌పొరుగు రాష్ట్రానికి సాయపడతామని ప్రకటించడం సిగ్గు చేటని పేర్కొంది. ఈ మేరకు మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో టీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి, ఎంపీలు ఎ.రేవంత్‌ ‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి మాట్లాడుతూ జూన్‌ 2 ‌రాష్ట్ర అవతరణ దినోత్సవ• సందర్భంగా నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఎస్సెల్బీసీ టన్నెల్‌ ‌దగ్గర నిరసన దీక్ష చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కేసీఆర్‌ ఏదో ఉద్దరిస్తారని రెండో సారి సీఎంని చేస్తే అందుకు విరద్ధంగా వ్యవ హరిస్తున్నారని విమర్శించారు. పోతిరెడ్డి పాడు నుండి ఏపీకి కి నీళ్లు తీసుకెళ్లే విషయం పై ఆ రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్‌ ‌నాయకులు వ్యతిరేకి ంచామని అన్నారు..2014 నుండి తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత కేసీఆర్‌ ‌దా..? కాదా..? అని నిలదీశారు .కేసీఆర్‌ ఏపీ సీఎం జగన్‌ ‌కి ఎన్నికల్లో డబ్బులు ఇచ్చారని ఆరోపించారు.ఇద్దరు సీఎం లు ఏమైనా చేసుకోండి కానీ తెలంగాణా రైతుల కు అన్యాయం చేయొద్దని డిమాండ్‌ ‌చేశారు.పోతిరెడ్డి పాడు సామర్థ్యం కేసీఆర్‌ ‌తో చర్చించకుండా చేశారంటే నమ్మమని,ప్రెస్‌ ‌మీట్‌ ‌లో కొట్టేసినంత ఈజీ అంశం కాదన్నారు .

కేసీఆర్‌ ‌నిర్లక్ష్యం వల్ల దక్షిణ తెలంగాణ ఎడారి అవుతుందని నీళ్లను వదులుకోవడానికి ఎందుకు సిద్ధపడారో తెలియదని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు విషయంలో కేసీఆర్‌ ‌తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని గ్రావిటీ ద్వారా వచ్చే నీటిని వదులుకుని కోట్ల ఖర్చు పెట్టె ఆలోచన మానుకోవాలని సూచించారు. లాక్‌డౌన్‌ అమలులో ఉండగా దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ప్రాజెక్టు కోసం టెండర్లు పిలవలేదనీ, కాళేశ్వరం, దుమ్ముగూడెంలో 8 శాతం కమీషన్లు మాట్లాడుకున్నారనీ, ముఖ్యమంత్రి బంధువు మురళీధర్‌రావు ఈ వ్యవహారాలను చూస్తున్నారని ఆరోపించారు.పీజేఆర్‌ ‌ని గుర్తు చేసి ఉంటే శంకించే వాళ్ళంకాదు …రేవంత్‌ ‌రెడ్డిమల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ…ఆగస్ట్ 2006 ‌లో కేసీఆర్‌ ‌కేంద్ర మంత్రిగా ఉండి పోతిరెడ్డిపాడు గురించి ఒక్క మాటకుడా మాట్లాడలేదని కేవలం పీజేఆర్‌, ‌మర్రి శశిధర్‌ ‌రెడ్డి లు మాత్రమే నిలదీశారని గుర్తు చేశారు.కేసీఆర్‌ ‌సమావేశంలో కనీసం పీజేఆర్‌ ‌ని గుర్తు చేసి ఉంటే ఆయన చిత్తశుద్ధిని శంకించే వాళ్ళం కాదన్నారు.కేసీఆర్‌ అసమర్థత వల్లనే నీళ్ల తరలింపు జరుగుతుందని ,790 అడుగుల వరకు నీళ్లున్నా తరలించేలా రాయలసీమ ప్రాజెక్ట్ ‌కడుతున్నారని దీనికి కేసీఆర్‌ ఏం ‌సమాధానం చెప్తారని ప్రశ్నించారు ..రాయలసీమ కోసం 11 నుండి 12 టీఎంసీ ఏపీ తరలిస్తే, 20 రోజుల్లో శ్రీశైలం ఎండిపోతుందని ,885 అడుగులు నీటి సామర్థ్యం దాటితేనే నీటిని తరలించాలని లేదంటే పోతిరెడ్డిపాడు తో శ్రీశైలం నుండి సుక్కనిరు లేకుండా పోతుందని తెలిపారు. సెప్టెంబర్‌ 13, 2005‌న పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతూ జీవో ఇచ్చినా కేసీఆర్‌ ఏనాడూ మాట్లాడలేదన్నారు. జగన్‌ ఇచ్చిన జీవో 203తో దక్షిణ తెలంగాణ ఎడారి అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్‌తో బంతి భోజనం తరువాతనే జగన్‌ ‌జీవో 203 ఇచ్చారనీ, 790 అడుగుల ఎత్తులో తరలిస్తే అవి వరద జలాలు ఎలా అవుతాయని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ‌దయాదాక్షిణ్యాల వల్లనే తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని కేసీఆర్‌ ‌గుర్తుంచుకుంటే మంచిదని సూచించారు.

కేసీఆర్‌ ‌నీకు బుద్ధి ఉండా : కోమటిరెడ్డి
భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణను ఎడారిగా మార్చే జీవో నం. 203ను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఈ జీవోకు కారణం కేసీఆర్‌ అనీ, అసలు నీకు బుద్ధి ఉండా ? జగన్‌ను ప్రగతి భవన్‌లో ఎలా అడుగుపెట్టనిచ్చావని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ‌హయాంలో 70 శాతం పూర్తి అయిన ప్రాజెక్టులను పూర్తి చేయని అసమర్థుడు కేసీఆర్‌ అని దుయ్యబట్టారు. కాళేశ్వరంలో 90శాతం పనులు పూర్తి చేశామని గొప్పలు చెబుతున్న కేసీఆర్‌ ‌దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయడం లేదని నిలదీశారు. దీనిపై అడిగే దమ్ము టీఆర్‌ఎస్‌ ‌మంత్రులకు లేదని మండిపడ్డారు. శాసనమండలి చైర్మన్‌ ఓ ‌రాజకీయ బ్రోకర్‌ అనీ, ఆయన రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి రాజకీయాలు మాట్లాడుతున్నారని విమర్వించారు. కేసీఆర్‌ ‌పక్కన బ్రోకర్లను పెట్టుకుని మాట్లాడుతున్నారనీ, సీఎం బెదిరిస్తే తాము భయపడబోమని స్పష్టం చేశారు. ఏపీ జారి చేసిన జీవోపై ప్రధానిని కలుస్తామనీ, పార్లమెంటులో పోరాడతామని స్పష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply