Take a fresh look at your lifestyle.

ప్రకృతిని రక్షించుకుందాం మహమ్మారిని తరుముదాము

  • జులై 28 ప్రపంచ ప్రకృతి వనరుల పరిరక్షణ దినం

1 వ శతాబ్దం అనేక హానికర మహమ్మారిలను చవి చూస్తున్నది.1918 స్పానిష్‌ ‌ఫ్లూ నుండి నేటి కొవిడ్‌-19‌వరకు మహమ్మారుల పరంపర కొనసాగుతూ జనజీవనము అతలాకుతలం అవుతున్నది.అపరిమిత ఆర్ధిక వృద్ధి,సంపదను పెంచుకోవడమే అభివృద్ది నమూనా గా చూపిస్తూ పర్యావరణ విధ్వంసం కొనసాగిస్తున్నారు.వన్య అవాసాలు తగ్గడం,అడవులు నరికివేత,గనుల తవ్వకం, నగరీకరణ వంటి చర్యల వలన జంతువులకు,మొక్కలకు సంక్రమించే వైరస్‌ ‌లు మానవుడికి సోకుతున్నాయి.కోవిడ్‌ 19 ‌వలన అనేక దేశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి.ఇప్పటికైనా గుణ పాఠం నేర్చుకుని దీని ఉద్గార మూలాల పై దృష్టి పెట్టాల్సిన అవసరముంది.కానీ అలాంటి ఆచరణ జాడలు కనిపించడం లేదు. భవిష్యత్‌ ‌తరాలకు సుస్థిరమైన, ఉత్పాదకతతో కూడిన ప్రకృతిని తన గర్భంలో ఇముడ్చుకున్న సమస్థ వనరులను అందిం చడానికి, వనరుల రక్షణపై అవగాహన కోసం ప్రతి ఏటా జూలై 28 ని ప్రకృతి వన రుల దినోత్సవంగా జరుపు కుంటారు. మానవుడు తాను ఉద్భవించిన నాటి నుండి ప్రతి పనికి ప్రకృతిపై ఆధార పడుతున్నాడు.ప్రకృతి మనకు కావల్సిన నేల, నీరు చెట్లు,జంతువులు, ఖనిజాలను కలిగివుంది. మానవ జాతి తన అవసరం మేరకు ఉపయోగించుకుంటూ ప్రకృతిని సురక్షితంగా పరిశుభ్రంగా ఉంచే ప్రక్రియ సుధీర్ఘ కాలం కొనసాగింది.ప్రకృతి వనరులు నేర్పడాటానికి మిలియన్ల సంవత్సరాలు పట్టింది.18వ శతాబ్దం పారిశ్రామిక విప్లవం నుండి ప్రకృతికి మానవుడికి ఉండే సామరస్యత, సమతుల్యం భారీ కుదుపులకు లోను కావడం ఆరంభమయింది.అది నేడు మానవ మనుగడను ప్రశ్నార్థక స్థాయికి చేర్చింది.ప్రస్తుతం ఒక నిమిషానికి వంద ఎకరాల వర్షాధార అడవులు నరికివేయబదురున్నాయి.ప్రతిరోజు వన్య జీవులు అవాసంలో 5,760 ఎకరాలు మానవ చర్యలకు నాశనం అవుతున్నాయి.ప్రతి రోజు 200 జంతు వృక్ష జాతులు అంతరించి పోతున్నాయి.ఇంకా ఈ దత్తాంశాలను ప్రస్తావిస్తే భీతిల్లె అంశాలు అనేకం కనిపిస్తాయి.

21 వ శతాబ్దం అనేక హానికర మహమ్మారిలను చవి చూస్తున్నది.1918 స్పానిష్‌ ‌ఫ్లూ నుండి నేటి కొవిడ్‌-19‌వరకు మహమ్మారుల పరంపర కొనసాగుతూ జనజీవనము అతలాకుతలం అవుతున్నది.అపరిమిత ఆర్ధిక వృద్ధి,సంపదను పెంచుకోవడమే అభివృద్ది నమూనా గా చూపిస్తూ పర్యావరణ విధ్వంసం కొనసాగిస్తున్నారు.వన్య అవాసాలు తగ్గడం,అడవులు నరికివేత,గనుల తవ్వకం, నగరీకరణ వంటి చర్యల వలన జంతువులకు,మొక్కలకు సంక్రమించే వైరస్‌ ‌లు మానవుడికి సోకుతున్నాయి.కోవిడ్‌ 19 ‌వలన అనేక దేశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి.ఇప్పటికైనా గుణ పాఠం నేర్చుకుని దీని ఉద్గార మూలాల పై దృష్టి పెట్టా ల్సిన అవసరము ంది.కానీ అలాంటి ఆచరణ జాడలు కనిపించడం లేదు. భారత దేశం ప్రపంచ భూభాగంలో 2% ను కలిగి ఉన్న అనేక ప్రాంతీయ శీతోష్ణస్థితులను ,నదులు,పర్వతాలు,పీఠభూమి లను,డెల్టా మైదానాలతో కూడిన వైవిధ్య స్థల అమరికలను కలిగివుంది.ఎనిమిది వేల కిలోమీటర్ల సముద్రతీర ప్రాంతాన్ని కలిగిఉండి హిందు మహా సముద్రముతో ప్రపంచానికి అనుసంధానమై ఉంది.సుస్థిర ఆర్ధిక వృద్ధి కి వనరుల వినియోగం, పునరుద్ధరణ ఆవశ్యకతను గుర్తించిన స్వతంత్ర భారత పాలకులు పర్యావరణ దేశభక్త వాదంతో1950 నుండి 1990 వరకు జాతీయ ఉద్యాన వనాలను,551 పులులు ఏనుగులు, సింహాలు పక్షుల మొదలు వన్య జీవుల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఇవి ఒక్కొట్టి సగటున 200 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఏర్పడ్డాయి.ఇవి దాదాపు భారత భూభాగంలో 5% ఆక్రమించాయి.కొన్ని సార్లు ప్రభుత్వాలు సంరక్షణ కేంద్రాలుగా ప్రకటించిన కేరళ సైలెంట్‌ ‌వ్యాలీ లో విద్యుత్‌ ‌ప్రాజెక్ట్ ‌కు,మధ్యప్రదేశ్‌ ‌లోని మధుమలై పులుల కేంద్రంలో అణు పరిశోధనా కేంద్రాన్ని,ఒడిశా లో నియమగిరి కొండలలో బాక్సైట్‌ ‌తవ్వకాలకు అనుమతిని ఇచ్చాయి.అయితే పర్యావరణ సంరక్షకారుల,ప్రజల నిరసనలతో వాటి నిర్మాణాన్ని ఆపివేసాయి.ప్రజల నిరసనను పట్టించుకోకుండా సరిస్కా పులుల సంరక్షణ కేంద్రంలో గనుల తవ్వకాలకు అనుమతులు అవ్వడం ద్వారా అక్కడ పులులు అంతరించి పోయాయి.భారీ డ్యాం ల నిర్మించడం వకన నదుల సహజ పర్యావరణం దెబ్బతిని అనేక సరీసృపాల క్షిరాదాలు తగ్గిపోతున్నాయి.గంగ నది కాలుష్యం వలన డాల్ఫిన్‌ ‌విలుప్త స్థితికి చేరుకున్నది.ఆదివాసీలు హక్కుల కార్యకర్తల ప్రజాస్వామిక న్యాయ పోరాటాలతో అప్పుడప్పుడు పాలకులు అటవీ నియంత్రణ,పర్యావరణ చట్టాలకు మరింత మెరుగులను చేర్చారు.అయితే రాను రాను వాటిని వారే స్వయంగా ఉల్లఘించడం చేస్తున్నారు.

భారత్‌ ‌దేశంలో కొవిడ్‌.19‌వ్యాప్తి, నియంత్రణ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నది.కానీ ఇదే సమయంలో ఎంతో శ్రద్ధతో జీవ వైవిద్యానికి హానిని తలపెట్టే అనేక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ పర్యావరణ అటవీ వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ అతి సులువుగా అనుమతులను ఇస్తున్నది.వన్య అవాసాలకు,జీవ వైవిధ్యత కు నిలయాలైన అభయారణ్యలలో ప్రాజెక్టులకు ఎలాంటి క్షేత్ర స్థాయి పర్యటనలు లేకుండా అనుమతిని ఇచ్చింది.అవి అటవీ నియంత్రణ,జక వనరుల చట్టాలకు లోబడి ఉన్నాయ లేదా అనే కనీస అధ్యయనం చేయలేదు.ప్రజాభిప్రాయ సేకరణ లేదు.ప్రజా బాహుళ్యానికి సమాచారం లేదు.నిర్వాసితుల గోడు వినిపించుకోవడం లేదు.వారు విద్య వైద్య ఇతర సౌకర్యాలతో కూడిన పునరావాసపు ఉసే లేదు. అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ ‌లోని జంతు వృక్ష జాతులు సమృద్ధిగా ఉన్న దిబాంగ్‌ ‌లోయలో జల విద్యుత్‌ ‌ప్రాజెక్టుకు,అస్సాం లో ఏనుగుల రిజర్వ్ ‌ప్రాంతంలో బొగ్గు గనుల తవ్వకానికి, పన్నా అడవులలో వజ్రాల తవ్వకానికి,ఒడిశా లో తలబొరియా అడవులలో థర్మల్‌ ‌విద్యుత్‌ ‌కేంద్రానికి,గుజరాత్‌ ‌లో గిర్‌ ‌జాతీయ ఉద్యానవనంలో సున్నపురాయి గనుల తవ్వకానికి శరావతి సింహాల సంరక్షణ కేంద్రంలో జియో సాంకేతిక అన్వేషణ కు అనుమతులను జారీ చేసింది.గతంలో ఇలాంటి సంరక్షణ కేంద్రాలలో ఇలాంటి ప్రాజెక్టులకు అనుమతి వలన కలిగిన అరుదైన జీవ జాతులు తగ్గిపోవడం,ఏనుగులు ఎలుగు బంట్లు,అడవి పందులు సమీప పంట పొలాలను నాశనం.చేయడం,మానవ ప్రాణ నష్టం వంటి ఉపద్రవాలను పరిగణనలోకి తీసుకోలేదు. డాక్యుమెంట్ల సమగ్ర పరిశీలన లేకుండా,పర్యావరణ ప్రభావంను పరిగణనలోకి తీసుకోకుండా కార్పొరేట్‌ ‌పెట్టుబడిదారులకు అప్పచెప్పారు.ఆత్మ నిర్భర భారత్‌ ‌డొల్లతనం బయట పడుతున్నది.

ప్రఖ్యాత పర్యావరణ వేత్త మహేష్‌ ‌రంగరాజన్‌,‌చరిత్రకారుడు రామచంద్ర గుహ,అరవింద్‌ ఆర్య అభిప్రాయం మేరకు భారత అమెజాన్‌ ‌గా ప్రసిద్ధి చెందిన ఛత్తీస్‌ ‌గఢ్‌ ‌లో అబుజ్‌ ‌మడ్‌ ‌ప్రాంతంలోని ప్రకృతి వనరులు సురక్షిత స్థితిలో ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.అతి తక్కువ నష్టంతో మానవ ఆర్థికాభివృద్ధి కోరుకునే మావోయిస్టుల ప్రాబల్యం,ఆదివాసులకు సహజాతంగా ఉండే ప్రకృతి అనుకూల జీవన విధానాలతో ఇది సాధ్యమవుతున్నదని తేల్చి చెప్పారు.ఈ అబుజ్‌ ‌మడ్‌ ‌లో ఇనుము,బాక్సైట్‌ ‌రాగి గనులతో పాటు జీవ వైవిధ్యం ఉంది.అలాగే బోడోలాండ్‌ ఆదివాసుల కు స్వయం ప్రతిపత్తి కౌన్సిల్‌ ఏర్పాటుతో తమ ప్రాంతంలోని మానస్‌ ‌జాతీయ ఉద్యానవనం ఒక నమూనగా కాపాడబడుతున్నది. ఈ మహమ్మారితో నైనా గుణపాఠాలు నేర్చుకుని అంతర్జాతీయ సమాజం కళ్ళు తెరవాల్సి ఉంది.ఆయా ప్రభుత్వాలు ప్రకటించుకున్న ఉద్యాన సంరక్షణ కేంద్రాలతో పాటు వాటికి వెలుపల ఉన్న ప్రకృతి వనరుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.మానవ సమాజ నైతిక,రాజకీయ,సామాజిక ఆర్ధిక స్పందనలు ప్రకృతి వనరుల రక్షణతో ముడిపడి ఉంది.సౌర,పవన శక్తి ల వినియోగాన్ని పెంచాలి.వర్షపు నీటిని నిల్వ చేయాలి.సేంద్రియ వ్యవసాయం ఒక హాబీ గా మారాలి”EARTH PROVIDES ENOUGH TO SATISFY EVERY MAN NEEDS ,BUT NOT EVERY MAN’S GREED”అని ప్రవచించిన గాంధీ వెలుగులో ప్రకృతి, జీవ సంబంధ వలయాలకు, మానవ జనిత చర్యలకు సమతూకం ఉండేలా చేసుకున్నప్పుడే ప్రకృతి పోషణ మానవాళి జీవనం మరింత ఫలప్రదం సుఖవంతం అవుతుంది.

Asnala Srinivas
అస్నాల శ్రీనివాస్
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (ఇంటర్ విద్య)

Leave a Reply