Take a fresh look at your lifestyle.

న్యాయస్థానాలు మీడియా నోరు నొక్కుతున్నాయి

*నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు..పక్షపాత ధోరణి
*రాజ్యసభలో విజయసాయి ఎంపిలతో కలసి నిరసన

‌చట్టం ముందు అందరూ సమానులే అన్న సూత్రాన్ని విస్మరించి న్యాయవ్యవస్థ పక్షపాతంతో వ్యవహరిస్తోందని వైఎస్‌ఆర్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి అన్నారు. తాను ఏ జడ్జికి ఉద్దేశాలు ఆపాదించడం లేదని అసాధారణ  పరిస్థితుల్లో మాత్రమే నిషేధం విధిస్తారని వివరించారు. న్యాయస్థానాలు మీడియా నోరు నొక్కు తున్నాయని, పౌరుల ప్రాథమిక హక్కులను హరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మాన్ని కాపాడాల్సిన వారే  పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. తాజా వివాదంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. ఇదే సందర్భంలో పార్లమెంట్ ‌ ‌ముందు ఎంపిలతో కలసి నిరసనకు దిగారు. ఈ మేరకు ఆయన గురువారం పార్లమెంట్‌ ‌వద్ద మీడియాతో మాట్లాడారు. ఆంధప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని …ఆంధప్రదేశ్‌ ‌హైకోర్టు తాజాగా విధించిన ఉత్తర్వులపై న్యాయపరమైన అనేక ప్రశ్నలు ఉత్పన్నమవు తున్నాయని అభిప్రాయపడ్డారు. న్యాయ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత, పక్షపాతంతో ఉందని, ఈ ధోరణి వెంటనే మానుకోవాలని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ కారణంగా ఆంధప్రదేశ్‌ ఇబ్బందులు ఎదుర్కొంటోందని సభలో వివరించారు. ఆంధప్రదేశ్‌ ‌హైకోర్టు ఉత్తర్వులపై న్యాయపరమైన అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని, హైకోర్టు అసాధారణంగా వ్యవహరిస్తోందని, మీడియా, సోషల్‌ ‌మీడియాపై నిషేధం విధించిందని సభలో ప్రస్తావించారు. మాజీ అడ్వకేట్‌ ‌జనరల్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రిపోర్టు చేయవద్దని నిషేధం విధించిందని ఎంపీ విజయసాయిరెడ్డి వివరించారు. ఈ చర్యలను సమర్ధించుకునే ఏ ఆధారమూ లేదని, ఈ రకమైన సెన్సార్షిప్‌ అసాధారణమైందని తెలిపారు. బ్రిటిష్‌ ‌తరహాలో వ్యవహరిస్తూ.. దీనికి సంబంధించిన మరో కేసు పైన కూడా స్టే విధించారని, గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇలా వ్యవహరిస్తున్నారని అన్నారు. మీడియా కవరేజ్‌, ‌పబ్లిక్‌ ‌స్కూట్రినీ లేకుండా తప్పించుకోవాలని చూస్తున్నారని తెలిపారు. జ్యుడీషియల్‌ ‌నుంచి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఆంధప్రదేశ్‌ ‌కొరోనా నియంత్రణలో ముందంజలో ఉందని తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply