Take a fresh look at your lifestyle.

న్యాయవ్యవస్థలో అన్యాయాలు..!

‘ఈ ‌దేశ న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేయటం లేదు. ముఖ్యంగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీమ్‌కోర్టు సక్రమంగా పనిచేయడం లేదు. ప్రజల ప్రాథమిక హక్కులు కాపాడటంలో, పాలనా వ్యవస్థ ప్రజల కోసం పని చేస్తుందా లేదా అన్న విషయాన్ని పర్యవేక్షించే పర్యవేక్షకుని బాధ్యతగా అత్యున్నత న్యాయస్థానం పని చేయడం లేదన్నది స్పష్టం.’
న్యాయవ్యవస్థలో అన్యాయాలు..!
మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ ‌గొగోయ్‌ ‌ని  రాజ్యసభకి రాష్ట్రపతి నామినేట్‌ ‌చేశారు. సుమారు 13 నెలల పాటు సుప్రీమ్‌కోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌ ‌గా పనిచేసి రంజన్‌ ‌గొగోయ్‌ ‌గత ఏడాది నవంబర్‌లో రిటైర్‌ అయ్యారు.. ఈయన కింద పని చేసిన మహిళా ఉద్యోగి తనపై లైంగిక వేధింపులు చేసారని ఆరోపిస్తే ఆమె, ఆమె భర్త, భర్త సోదరుని ఉద్యోగాలు తీసివేయించారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. సీనియర్‌ ‌లాయర్‌ ‌ప్రశాంత్‌ ‌భూషణ్‌ ‌ని సదరు మహిళ ఆశ్రయించగా సుప్రీమ్‌కోర్టులో కేసు వేయగా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న రంజన్‌ ‌గోగయ్‌.. ‌చీఫ్‌ ‌జస్టిస్‌ ‌గా పని చేస్తు తన నేతృత్వంలో బెంచ్‌ ఏర్పాటు చేసుకుని ఆమె కేస్‌ ‌సుప్రీమ్‌కోర్టు విచారించేలా చేశారు. అంతే కాదు ప్రభుత్వం కోరిన జడ్జిమెంట్లు ఇచ్చారని విమర్శలు ఉన్నాయి.. భారత న్యాయ వ్యవస్థ పనితీరుపై పలు వివాదాలు వస్తున్న నేపథ్యంలో సీనియర్‌ ‌లాయర్‌ ‌ప్రశాంత్‌ ‌భూషణ్‌ ‘‌ప్రజాతంత్ర’  ప్రత్యేక ప్రతినిధి అరుణతో ముఖాముఖి మాట్లాడారు. ఆ వివరాలు :

ప్ర: మన రాజ్యాంగ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదనే విమర్శ కొనసాగుతున్నది మీరు చాలా కేసులు వేస్తూ ఉంటారు.. ఈ దేశ సామాన్య ప్రజలు దేశ న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలాగా ఏం చేయగలరు?
ప్రశాంత్‌ ‌భూషణ్‌:-
‌మన ముందు ఉన్నది చాలా స్పష్టమైన నిజం, ఈ దేశ న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేయటం లేదు. ముఖ్యంగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సక్రమంగా పనిచేయడం లేదు. ప్రజల ప్రాథమిక హక్కులు కాపాడటంలో, పాలనా వ్యవస్థ ప్రజల కోసం పని చేస్తుందా లేదా అన్న విషయాన్ని పర్యవేక్షించే పర్యవేక్షకుని బాధ్యతగా అత్యున్నత న్యాయస్థానం పని చేయడం లేదన్నది స్పష్టం. అత్యున్నత న్యాయస్థానం కాశ్మీర్‌ అం‌శంపై ఏ తీరుగా వ్యవహరించింది చూసాం. అలాగే పౌర చట్టం సవరణకు సంబంధించి,  జేఎన్‌యూ, జామియా కేసులకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం ఎలా వ్యవహరించింది చూసాము. చెప్పొచ్చేదేమంటే దేశంలో ఉన్న ప్రతి వ్యవస్థ అంతిమంగా ప్రజలకు జవాబుదారీ..కనుక ప్రజలు కూడా బాధ్యతగా దేశంలో పని చేస్తున్న అన్ని వ్యవస్థల పనితీరును పరిశీలించినట్లుగానే దేశ జ్యూడిషియల్‌ ‌వ్యవస్థ పనితీరును కూడా పరిశీలించాలి.. అలాగే వ్యవస్థలు సక్రమంగా పని చేయనప్పుడు, తమ గళాన్ని ప్రజలు వినిపించాలి.. కేవలం తమ గళాన్ని వినిపించడమే కాకుండా దేశ న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేయటం లేదు, అన్న అంశంపై పెద్ద ఎత్తున ప్రజలు నిరసనలు చేయవలసిన అవసరం ఉంది..

ప్ర. మన దేశంలో న్యాయ వ్యవస్థ పనితీరును చూస్తున్నాం.. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో న్యాయ వ్యవస్థ పనితీరు ఏ విధంగా ఉందో మీ అభిప్రాయం చెప్పండి.

ప్రశాంత్‌ ‌భూషణ్‌:
 ‌ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో న్యాయవ్యవస్థ కొంతవరకు సమర్థవంతంగా పనిచేస్తుంది అని చెప్తాను. ఉదాహరణకు యూకేలో బ్రెగ్జిట్‌ ‌కి సంబంధించిన వివాదాన్ని ఆ దేశ కోర్టు సమర్థవంతంగా కొన్ని రోజులలోనే పరిష్కరించింది. అమెరికా దేశ న్యాయవ్యవస్థ కొంత పొలిటిసైజ్‌ అయింది. అక్కడ జడ్జీల నియామకంలో కొంత రాజకీయ ప్రవేశం ఉంది.. అక్కడ ఐడియాలాజికల్‌ ‌సమస్య తలెత్తినాక ఇటువంటి సమస్య మొదలయింది. ఇక మన దేశానికి వస్తే మన దేశంలో భిన్న మైన సమస్యలు ఉన్నాయి. మనదేశంలో జడ్జీల నియామకం అనేది పూర్తి అవకతవకలతో నిండి పోయింది. సమర్ధత లేని వారిని అత్యున్నతమైన స్థానంలో   కూర్చోబెట్టడం కూడా జరుగుతున్నది. ప్రస్తుతం ఫాసిస్ట్ ‌ప్రభుత్వం నడుస్తున్న కాలంలో జడ్జిలు చాలా బలహీనంగా ఉన్నారు. వీరు ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నారు.
ప్ర. మీరు చాలా రకాల జ్యూడిషియల్‌ ‌రిఫార్మస్ ‌ప్రతిపాదిస్తూ ఉంటారు మీరు ప్రతిపాదించిన రిఫార్మస్ ‌కొన్నింటిని చెప్పండి..?
ప్రశాంత్‌ ‌భూషణ్‌:-
‌న్యాయ వ్యవస్థకు ప్రధానంగా రెండు ముఖ్యమైన బాధ్యతలు ఉన్నాయి. ఒకటి వివాదాలు పరిష్కరించటం రెండవది ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటం. ఈ రెండు పనుల కోసం హైకోర్టు, సుప్రీమ్‌కోర్టు ఉన్నాయి.. ఇవి కాకుండా ఉన్న ఇతరత్రా పనుల కోసం అంటే జ్యూడిషి•యల్‌ ‌వ్యవస్థకు స్వతంత్రత వుండేలాగా ఒక జ్యూడిషి•యారీ కమిటీ ఉండాలి. అంటే జడ్జీల నియామకంలో రాజకీయ జోక్యం లేకుండా చూసేలా ఒక జ్యూడిషియల్‌ ‌కమిటీ ఉండాలి. రిటైర్మెంట్‌ ‌తర్వాత జడ్జిలకి పదవులు ఇవ్వకూడదు. అలాగే  ఇన్వెస్టిగేటివ్‌ ఏజెన్సీలు ఉపయోగించి జడ్జిలను బ్లాక్‌ ‌మెయిల్‌ ‌చేయకూడదు..
ప్ర:- మీరు చాలా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేస్తూ ఉంటారు. మీకు ఆ ఇన్స్పిరేషన్‌ ఎక్కడి నుంచి వస్తుంది..?
ప్రశాంత్‌ ‌భూషణ్‌:-
అట్టడుగు అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతున్నప్పుడు.. వారి ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లు తున్నప్పుడు.. కంటి ముందు అవినీతి వ్యవహారాలు చూస్తున్నప్పుడు.. నాకు అనిపిస్తుంది నేను ఏమి చేయగలిగితే అది చేయాలి. ఇలా అనిపించినప్పుడు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు వేస్తూంటా.. అయితే కోర్టులలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలకి అనుకూల వాతావరణం లేదు.
ప్రశ్న:- మీరు చాలా సీనియర్‌ ‌లాయర్‌.. ‌జూనియర్‌ ‌లాయర్లుకు ఏమి సలహా ఇస్తారు..?
ప్రశాంత్‌ ‌భూషణ్‌:-
‌లాయర్‌ ‌బాధ్యత చేపట్టిన వారు  దేశంలో అణగారిన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రధానంగా గమనించాలి. జూనియర్‌ ‌లాయర్లు అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడి ప్రజలు న్యాయం ఇప్పించటం అనేదిక క•చ్చితంగా తమ బాధ్యతగా భావించాలి..  తద్వారా సమాజంలో న్యాయాన్ని నిలపాలి. జూనియర్స్ ‌తమ వాదనా పటిమని ఉపయోగించి దేశ న్యాయ వ్యవస్థని పటిష్టం చేయాలి.. అని ముగించారు..

Leave a Reply