Take a fresh look at your lifestyle.

ఆరు నెలల్లోపే తీర్పులు అభినందనీయం: కేటీఆర్‌

it minister ktr
‌ఫాస్ట్‌ట్రాక్‌ ‌కోర్టుల పనితీరుపై హర్షం

రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఫాస్ట్‌ట్రాక్‌ ‌కోర్టులు మహిళలు, చిన్నారులకు సంబంధించిన మూడు దారుణ కేసుల్లో ఆరు నెలల్లోపే తీర్పులు ఇచ్చాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ కేసుల్లో ఐదుగురు నిందిత లకూ ఉరిశిక్ష విధించారని గుర్తు చేశారు. ఆయా కేసుల అంశంలో సత్వర న్యాయం జరిగేలా ప్రయత్నించిన న్యాయ, •ంశాఖ అధికారులతో పాటు న్యాయవ్యవస్థను మంత్రి అభినందించారు. ఈ మేరకు కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. ఆదిలాబాద్‌ ‌జిల్లాలో సమత, యాదాద్రి జిల్లాలోని హాజీపూర్‌లో వరుస హత్యలు, వరంగల్‌ ‌జిల్లాలో చిన్నారిపై హత్యాచారం కేసుల్లో ఫాస్ట్‌ట్రాక్‌ ‌కోర్టులు సత్వర విచారణ జరిపి దోషులకు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే.

Leave a Reply